telugu poetry

సై కూత – పై మాట

గది బయట 
ఊరంతా ఖాళీ చేసి ఎటో వెళ్ళినట్లుంది.


–క–
దేహాలే మంచాలపై దీర్ఘ శ్వాస తీస్తూ
పడున్నాయ్‌ ఆ రాత్రి వేళ.


–చ–
అస్పష్టంగా ఆగంతకుని అడుగుల శబ్దం
చెవి పక్కగానే సంచరిస్తోంది.
గది లోపల నే ఒక్కడినే
ఐనా, నాతో ఒకలాంటి వెర్రి నవ్వుతో 
ఒంటరితనం కూడా.


–ట–
పక్కనెవరో హృదయానికి
గురక దారం వేసి గుంజి గుంజి వదుల్తున్నారు.


–త–
ఢన్..ఢన్.. ఢన్..
బలమైన దుండగులెవరో`
ఓ రెండు గడియారాలలోనుండీ,
ఆగకుండా సమ్మెట దెబ్బలేస్తున్నారు.
కాలాన్ని తుత్తునియలు చేస్తారేమో?


–ప–
పక్క గదిలో నుండి పిండి మిల్లులో కంకర పట్టిస్తున్నట్లు
కఠోఱ శబ్దం చేస్తూ ఓ పంఖా
ఆగి ఆగి మళ్ళీ పూనకంతో వూగిపోతోంది.


oo-0-oo


అదే రాత్రి మరోలా అదే నేను. కాదు కాదు
మరో రాత్రి అదేలా నాలాంటి నేను. అవునవును,
ఏదో రాత్రి ఏదోలా ఇంకోనేను.


–గ–
పగటి శ్రమకు దూరమై 
జనమంతా నిద్రిస్తుంటే 
ఏకాంత ఆలోచనల్ని శ్వాసిస్తున్నట్లు
పడుకునుంటే.


దూర తీరాల నుంచి గాలిలో అలలు అలలుగా
కదిలొస్తున్న కమ్మని పాట
చెవికి తాకకుండా హృదయంలో విహరిస్తోంది.


–జ–
బయటెవరో నడుస్తున్న శబ్దం
నాలాగే నిద్ర పట్టటం లేదేమో!


–ద–
గోడ గడియారాల జుగల్‌ బందీ 
ఒక దానితో ఒకటి పోటీ పడి
మృదంగ సాధన చేస్తున్నాయి.


–బ–
విశ్వ విస్ఫోటనాన్ని, అణు విచ్ఛిత్తిని
పాఠం చెప్తున్నట్లు పక్కింట్లో ఫ్యాను
చెప్పాలా? వద్దా? అన్నట్లు
వెనక్కీ ముందుకీ తన్నుకుంటోంది.


–డ–
నా పక్కన రైలింజన్‌ గురక 
బస్సులా అప్పుడప్పుడు కుదుపుతూ
నన్ను మరీ లోతుల్లోకి జారకుండా పట్టుకుంటోంది.

సిరి.కట్టా.


Other Linkshttp://www.telugustates.com/id33.html

http://www.facebook.com/groups/kavisangamam/permalink/415159668536791/

Advertisements
Standard
telugu poetry

సమాంతర కందకాలు

లేవండిక

మరీ ఇంత మొద్దునిద్రా..!
మొసలి పట్టిన ఏనుగుకోసం
చటాలున పరుగిత్తుకొచ్చినాయన
స్వంత భార్య భూమిలోకి ఇంకిపోతుంటే
చేష్టలుడిగి చూసినట్లు

నిద్రలో వున్నారా ?
అసలు స్ప్రహలోనే లేరా
లేవండి స్వామీ ఇకనేనా..!

రోజుకొక్క ప్రాణిని ఆహారంగా కోరిన
బకాసురినిలా
కొండచిలువ నోటితో
చీకటి పొట్టను తెరిచిపెట్టుకుని
ఊపిరాడనివ్వ కుండా మింగేస్తుంటే.
తల్లుల కన్నీటి వరద తల పక్కగా
తగలటం లేదా..

అయ్యో…
మత్తుగుళికేమైనా మింగారా ఏమిటి ?

ఆడే పాడే ప్రాణాల్ని
గుటుక్కున మింగుతోంది మహి.
నాళాల నాలుకతో
పనివాళ్ళను సైతం చప్పరిస్తోంది.
నగరం నీటిమడుగైనప్పుడు
అడుగడుగు మందుపాతరలా
మొసలి నోటి నవీన తరం
గజేంద్రపాదాలను పట్టేందుకు
వేచివున్నాయి.

మగత నిద్రలో
మొసలి కన్నీరు అక్కర్లేదు కానీ
కళ్లునులుముకుని లెగరా నాయనా.

సిరి.కట్టా …25 జూన్ 2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/412613708791387/

Standard
telugu poetry

రేవుకొచ్చిన జీవితాలు

ఈ రోజు
తారట్లాడుతూ
రేవులో మునకేసి
దొరికిందో గాలిపటం

బద్రంగా పట్టుకున్న
రెండు చేతుల కళ్ళుకప్పి
కొట్టుకొచ్చినట్లుంది.

మొన్న బైకు జోరులో
ప్రాణాల్ని హోరెత్తించి.
రింగురోడ్డు కి అవుటర్ గా చరించింది.

నిన్న
ఎర్రటి పబ్బు దీపపు
చీకటిలో
చిందేసి తడిసింది.

నోట్ బుక్కు తెగచింపి
ప్రేమలేఖ పడవలొదిలింది.
పసి గొట్టాలకు నికోటిన్
నల్లరంగు పూసింది.

ఆకాశంలో తలెత్తుకెగరాల్సిన
రోజిలా తెగిపడి రేవులో తేలింది.

అనుబందపు దారం జారిందంటే
గాలివాటపు జీవితం ఏ దరీ చేరదుగా మరి.

http://www.facebook.com/groups/kavisangamam/permalink/411967775522647/

Advertisements
Standard
Uncategorized

రేవు కొచ్చి మునక

రేవుకొచ్చి మునకేస్తున్న
యవ్వనపు గాలిపటం

జోరుమీదున్న ప్రమాదాలు
రేస్ లైనా రేవ్ లైనా

రేవ్ వ్యాపారం జోరెక్కిందట
మీడియా వ్యాసాలు రోడ్డెక్కంగానే

రేర్ రేవ్ విషాన్ని
కామన్ గుండెల్లోకి మీడియా సిరంజితో


Advertisements
Standard
telugu poetry

కాలాతీత గమనం

వస్తువులన్నీ పోగానే ప్రపంచం అంతం కాదు
ఆలోచనే లేని రోజున పదార్ధం ఎంత మిగిలినా
ప్రపంచం ముగిసినట్లే ___

గడియారాలన్నీ పారేసినంతనే కాలం ఆగదు
చలనం అనేదే లేని రోజున అది సాంతం చచ్చిపోతుంది.

పలకరింపులు లేకపోతేనే పరిచయాలు ఆగిపోవు
జ్ఞాపకాలు లేకపోతేనే అవి ముగింపుకొస్తాయి__

http://www.facebook.com/groups/kavisangamam/permalink/407728512613240/

Advertisements
Standard
Uncategorized

గుడ్డొచ్చి …

ఏమిటి వెక్కిరిస్తున్నావ్ ?

నీ నునుపు నాకు లేదనా ?
సెల్లు ఫోనుల సిల్లి కబుర్ల తో
నేటి తరం కూడా నీ లాగే
తుల్లిపడుతోంది
కాని నడక తెలిసింది
నడత నేర్చినదీ మేమే ..
వెచ్చగా వోదిగివుండటం
నేర్చుకుంటే నువ్వు కూడా ఎదుగుతావ్.

Advertisements
Standard
Uncategorized

మినీ కవితలు

మదిని అలంకరిస్తేనే
సంతసం హ్రుదిని వరిస్తుంది
నీ అదుపుకు మెదడు
ఇతరులకైతే మనసూ వాడు
జీవితమంటే
నీవేదో ప్రణాళికలోవుండగా గడుస్తూ పోతుండేది.. 
జీవితం ఓ సైకిల్ సవారీ
నడుస్తుంటేనే పడవు మరి ….. 
జీవితం…అంటే
నిన్నునీవు తెలుసుకోడం కాదు మలచుకోవడం. 
అసత్యపు సౌఖ్యం కన్నా
సత్య నిష్ఠూరమే నయం..
ఆలోచనల వేడితో 
రాత్రి కరిగి పోతూనే వుంది.. 
మన ప్రజాస్వామ్యపు ప్రగతి 
మారణాయుధపు సంబరాలతో …
కొత్త ఫ్యాను కదా 
గాలి గట్టిగానే వీస్తోంది..
పెళ్లి పెద్దది అనుకుంటే
లొల్లి మరీ పెద్దదైంది …
గులాబి రంగు 
నిలిచిందా .. కొంచెం వెలిసిందా
జనపద్ లో దొరకనిది 
జనపధం లో దొరుకుతున్నట్లుంది 
Advertisements
Standard