Uncategorized

ఓర్నాయనో !!!

ఇంత హోరైతే

దేవునికైనా బోరే…

సంకటహరుని పేరుతో

ఆటంకాలను అందించే భక్తికి పేరేమిటో..

చిందుల వెనుక ఇంధనం

ఇదేనా దేవునికి వందనం.

దేవుడా

మరి నిన్నెవరు రక్షించాలయ్యా.

Standard
Uncategorized

అద్వైతం


కాలి చెప్పునో, చేతి బ్యాగునో

కుట్టించుకునేందుకు

అప్పగించినపుడు,

ఇలా అనిపించలేదు.

టీవినీ, మిక్సీని

రిపేరు చేయిస్తున్నపుడూ

అనిపించలేదు.

ఏ వస్తువుని

బాగుచేయించేప్పుడూ

మది బరువుగా కాలేదు.

కానీ ఎందుకో 

శరీరాన్నే రిపేరుకి ఇస్తూ,
పరిక్షలకోసం నిరీక్షిస్తున్నపుడు,
రకారకాల రసాయనాలను
లోనికి పంపింపజేస్తున్నపుడూ,
ఎందుకో
నా
లకుముకి పిట్టా
నాకు నేనే పరాయిగా అనిపిస్తాను,
అతీత తత్వమేదో
నిశ్శబ్దంగా పీల్చుకుంటుంటాను.
నా దేహంకాని నన్ను తాకుతుంటాను.


Standard
Uncategorized

నడక

ఆవిష్కరణాత్మక ప్రగతిశీల ఆలోచనలు
నీ విశాల నిశీధి గదులలో
పరుచుకుంటూ వెలగాలి.
అక్కడితో చాలదు.

ఆ వెలుతురు దారిలో
నీ ధ్రుఢమైన అడుగులు
తడబడకుండా కదలాలి


లకుముకి పిట్టా
అప్పుడే నూతన ద్వారం నిన్నాహ్వానిస్తూ
తెరుచుకుంటుంది.
నీక్కావలసిన నిధికూడా
అక్కడే దొరకొచ్చు.

Standard
Uncategorized

స్వేచ్ఛలో నేనోక భంధీని

గుంపులో నిలబడివుండటం సులభమే.
ఒంటరిగా నిలబడేందుకే ధైర్యం కావాలి.

‘మంద’ బుద్ది గా మారేందుకు చిన్న ప్రయత్నం చాలు.
దారాలు తెంచేసుకోవాలంటేనే తెంచే తెగింపుండాలి.

ఓ లకుముకి పిట్టా
ఆకాశమంతా నాదేనని ఓ సారి ఎగిరిచూడు.
పొడుస్తున్న పొద్దు నీకే ముందుగా వందనం అంటుందిరా.

Standard
Uncategorized

అన్వేషణ

పైపైన చూస్తే ఏముందిరా,

పుస్తకం అంతరాలలో ఒకసారి అన్వేషించి చూడు,

కాగితపు అందాన్నో, అచ్చులో స్సష్టతనో కాదు,

చెప్పిన వాడి ఖ్యాతినో, దానికున్న చరితనో కాదు,

అఖరికి

భాషద్వారా అందే బావం ఒక్కటే కాదు.

లకుముకి పిట్లా

ఇంతపొడిచి ఇంకేం చూడాలిరా అంటావేమో ?

అదే వెతుకు

నీకక్కడ చాలా ఆశ్చర్యం దొరుకుతుంది.

ఆనందం మాత్రమే కాదు,

అదంటే ఏమిటో కూడా దొరుకుతుంది.

Standard
Uncategorized

నీ రంగేమిటి ?

పారదర్శకమైన మనసు పట్టకం గుండా.
ప్రపంచపు తెలుపు ప్రతిఫలిస్తే విరిసే హరివిల్లు.
అదే నేను, అదేనేమో మనమంతా.
అసలు రంగులే లేవు
తరంగధైర్ఘ వ్యత్యాసమే లేనపుడు అంటాడు రామన్.
అలాగే నేనూ లేను.
వేరు వేరు భావోద్వేగాల స్పందనలు ప్రతిఫలించనపుడు.


వంటికో రంగు,
వృ త్తి హంగుకో రంగు,
ప్ర
వృ త్తికో రంగు,
ప్రపంచం ఏ రంగుల అద్దం గుండా చూసినా,


లకుముకి పిట్టా,
లోపలున్న ఆ ఒక్కటే నేను.

25-09-2012

Standard
Uncategorized

పదునెక్కిన నీటిచుక్క

చిన్న విత్తనం
విశాల సామ్రాజ్యపు పునాదుల్లో
బీటలు తేగలదు,

చిట్టి చీమ
పడగలిప్పి బుసకొట్టే పామును
చుట్టుముట్టి మట్టుపెట్ట గలదు,

కన్నీటి చుక్కని
వ్రుధాగా రాల్చకు
తనతో చాలా పనుంది.
లకుముకి పిట్టా
ఉబికివచ్చే ఉక్రోషాన్ని
అదిమిపెట్టు.

బాణం ఎంతలాగితే అంత బలం పెరుగుతుంది.
పిడికిలి సరిగా బిగిస్తేనే దెబ్బకుదురుతుంది.
గాబరాపడి దానిని
గాలిలో ఆవిరి కానివ్వకు
పనిలో పదిలంగా ఇంకిపోనివ్వు
వరదై పరుగు పెడుతుంది.

Standard
Uncategorized

సముద్రం

పిల్లకాలువలా ప్రవహించి,
వంపులు తిరుగుతూ, అడ్డంకులు దాటుకుని,
అనుభవాల రాశిపోసుకుని,
నిబ్బరంగా నిలుచుంది.
ఆటు పోట్లు అస్థిత్వనికి చిహ్నలే,
అగ్నిపర్వతాలను కడుపులో దాచుకున్నా
రత్నగర్భగా వెలుగు నవ్వులు రువ్వినా


లకుముకి పిట్టా,
నిండుకుండ ఇంకేం తోణుకుతుందిరా.
నీ పిచ్చిగానీ.

Standard
Uncategorized

జర ఫైలం రా దోస్తూ…

నీడకు చీడపట్టిందని
ఓ కోయిలకు కోపం వచ్చింది.
ఈ కొమ్మపై కూయబోనని
కోపాన్ని ప్రకటించేసింది.


చెట్టు ఎప్పటిలా తలూపింది.
ఎండకు గొడుగులా,
గూడుకు తనో తోడుగా,
తన నివాసం అక్కడే
పిట్టలు వచ్చిపోతుంటాయి.
జీవధర్మం.

కోపమేం లేదు.
ఓ కోయిలా
కోత్త చివుర్లు రాగానే,
వచ్చిపోదువుగని,
ఎండలు మండేకాలం,
జర భద్రం సుమా.

Standard
Uncategorized

వీడుకోళ్ళు . . .

కలిసివుంటున్నాం నిజమే

ప్రజాస్వామ్యపు దారాలతో అల్లుకున్న గుళ్ళు ఇవి.

తలుపులూ దర్వాజాలూ లేని గదులివి.

గుంపులో ఒంటరి అస్థిత్వాలున్న చోటిది.

లోపలికెలా సంతోషపు స్వాగతమో

వెళ్ళేందుకూ మొహమాటపు అడ్డుగోడలుండని మనోగతం.

ఓ లకుముకి పిట్టా

విషాదపు నీడను మోయాల్సిన పనిలేదు.

Standard