telugu poetry

హైదరా భాదితులు 8

నాలాతూముల్లా నగరాన్ది
మగర్ సోసలిజం
నల్లాలూ, డ్రైయిన్లూ కుశాలుగా కల్సే తిర్గుతయి.
రక్తం కల్వకున్నా నిళ్ళైనా కల్వనీరా భయ్
ఈ హై డర్ బాదుడు నగరాన

Standard
telugu poetry

హైదరా భాదితులు – 7

సవాలక్ష రెక్ లెస్ రొడ్లల్ల
నెక్ లెస్ లు, హెడ్ లెస్ లుంటై
అభిమన్యుడయినా ఆగమయ్యే ఈదుల్ల
భేఫికరు బజార్ల ఉర్కుతున్రు
అరరే, హై దరా వాసితులు.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/549623175090439/

Standard
telugu poetry

ఏకోన్ముఖం

కాలం
గతజ్ఞాపకాల్లో మరణించిన వాళ్ళని
కనీసం చూడదు….
తనతో నడిచేవాళ్ళతోనే
కరచాలనం చేస్తుంది!

చెట్టు
కొత్త చిగుర్లు తొడిగేటప్పుడు
ఎండుటాకులను స్పర్శించవు
ప్రయాణమంటే అంతే.

Standard
Telugu

ద్విముఖం

చింత చిగురిస్తుంటే

వరిస్తావా ? భరిస్తావా ?

పాత్ర ఖాళీ అవుతుంటే

తేలికవుతావా ? వెలితిబడతావా?

అదే ఇది పదే పదే

ఒకే నాణెం రెండు ముఖాలు.

► 23-04-2013

https://www.facebook.com/groups/kavisangamam/permalink/548103371909086/

Standard