telugu poetry

హైదరా బాధితులు – 1

వరదలు ముంచెత్తినా,

పండుగలు ముంపెత్తినా,

ట్రాఫిక్ వరదలో భేఫికర్ గుంటారు.

ఔరా ! హైదరా బాధితులు.

Standard
telugu poetry

ఏకోన్ముఖం

కాలం
గతజ్ఞాపకాల్లో మరణించిన వాళ్ళని
కనీసం చూడదు….
తనతో నడిచేవాళ్ళతోనే
కరచాలనం చేస్తుంది!

చెట్టు
కొత్త చిగుర్లు తొడిగేటప్పుడు
ఎండుటాకులను స్పర్శించవు
ప్రయాణమంటే అంతే.

Standard
Telugu

ద్విముఖం

చింత చిగురిస్తుంటే

వరిస్తావా ? భరిస్తావా ?

పాత్ర ఖాళీ అవుతుంటే

తేలికవుతావా ? వెలితిబడతావా?

అదే ఇది పదే పదే

ఒకే నాణెం రెండు ముఖాలు.

► 23-04-2013

https://www.facebook.com/groups/kavisangamam/permalink/548103371909086/

Standard
Telugu

తెలుగు – తేనెకన్నా తియ్యనిది

ఈ భాష మాట్లాడ గలిగిన 8 కోట్ల ప్రజలతో, అభివృద్ధి చెందుతూన్న వినోద పరిశ్రమలతో భారత ఉపఖండం లో తెలుగు మరొక మహత్తరమైన భాష.గా రూపొందింది . ఈ వ్యాసం ఈ భాష యొక్క మూలాన్ని ,చరిత్రను పరిశీలిస్తుంది.

తెలుగు ఒక భారతీయభాషగా గుర్తింపు పొందింది. మరియు, భారతదేశంలో హైటెక్ రాజధాని హైదరాబాద్ కు పుట్టిల్లైన ఆంధ్ర ప్రదేశ్ కు అధికారిక భాష. అనేక ఇతర ద్రవిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాణ్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, మొదటి శకం బి.సి లో శాతవాహన రాజులు సృష్టించిన “గధాశప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ ,గోదావరి మధ్య భూభాగంలో నివాసం ఉండే పెద్ద వారయి ఉంటారని నిర్ణయించ వచ్చు.

తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. 11 వ శతాబ్దం ఎ.డి. ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యం. విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి కృష్ణదేవరాయల ఆదరణలో 16 వ శతాబ్దం ఎ.డి. ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.

శ్రీనాథుని “శృంగార నైషధం,” పోతన “దశమస్కంధం”, జక్కన “విక్రమార్క చరిత్ర”, తాళ్ళపాక తిమ్మక్క “సుభద్రా కల్యాణం”, మొదలైనవి మహారాజు కృష్ణదేవరాయల స్వర్ణయుగం కంటె ముందుగానే ఉన్నకొన్ని గొప్ప సాహిత్యాలు. స్వతహాగా కవియైన మహారాజు తన “ఆముక్తమాల్యద” తో “ప్రబంధం” అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

కర్నాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, మరియు క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

అశోకుడి చారిత్రక శకానికి చెందిన బ్రాహ్మి లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించినట్టుగా నమ్ముతున్నారు. తెలుగు యొక్క తూర్పు చాళుక్యుల లిపిని వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.

తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు “అచ్చులు” ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు “హల్లులు” ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు “అ” ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో “మాత్రలు” అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ “మాత్రల” ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం “పూర్ణవిరామం”తో కానీ, “దీర్ఘవిరామం”తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి.

ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
తెలుగును సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు, ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

తెలుగును ఒక ద్రవిడ భాషగా గుర్తించడానికున్న ఎన్నో మార్గాలలో ఇదొక్కటి. తెలుగుకు “విభక్తి” సంప్రదాయం కూడా ఉంది. తెలుగులో ప్రతి పదమూ ఒక అచ్చుతోనే ముగింపు పొందడంతో, 19వ శతాబ్దపు యాత్రీకులు సాధారణంగా దీనిని “ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్” ( తూర్పు దేశపు ఇటాలియన్ భాష ) గా పరిగణించేవారు.
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లో సాధ్యమయ్యింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు “భావకవిత్వం” అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్నకందుకూరి వీరేశలింగంగారి “రాజశేఖరచరిత్రము” తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావుగారు. గిడుగు రామ్మూర్తి వారి “ముత్యాల సరాలు”, కట్టమంచి రామలింగారెడ్డిగారి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకులు) “ముసలమ్మ మరణం”, రాయప్రోలు సుబ్బారావుగారి “త్రుణకంటకం” మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం “వ్యావహారిక భాషా వాదా”నికి దారితీసింది.

ఈనాడు హైదరాబాద్ కు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజి తో ఉన్న సామీప్యం, తెలుగు భాషాభిమానుల మేళవించిన కృషి, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజి విభాగంలోనూ, కంప్యూటింగ్ విభాగంలోనూ, తెలుగు గణించదగ్గ అభివృద్ధి పొందగలదని నిశ్చయంగా తెలుపుతూంది. ఈ మృదుమధురమైన భాష శతాబ్దాలుగా ఉన్న తన చరిత్ర వలెనే మున్ముందు తప్పకుండా వర్ధిల్లగలదని కాలము, కృషి నిశ్చయంగా

Standard
Telugu

తెలుగు లిపి చరిత్ర

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[4].

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.

తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా

తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు “అచ్చులు” ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు “హల్లులు” ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు “అ” ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో “మాత్రలు” అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ “మాత్రల” ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం “పూర్ణవిరామం”తో కానీ, “దీర్ఘవిరామం”తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
తెలుగు అంకెలు

ప్రధాన వ్యాసం: తెలుగు సంఖ్యామానము

పేరు తెలుగుసంఖ్య ఇండో అరబిక్ అంకెలు
సున్న ౦ 0
ఒకటి ౧ 1
రెండు ౨ 2
మూడు ౩ 3
నాలుగు ౪ 4
ఐదు ౫ 5
ఆరు ౬ 6
ఏడు ౭ 7
ఎనిమిది ౮ 8
తొమ్మిది ౯ 9

తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండర్ లో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు
కంప్యూటర్లో తెలుగు

తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072-3199) ఇవ్వబడినది.
తెలుగు సాహిత్యం

ప్రధాన వ్యాసం: తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.
క్రీ.శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో “నాగబు” అనే పదం కన్పిస్తుంది.
1020-1400 – పురాణ యుగము

దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.
1400-1510 -మధ్య యుగము (శ్రీనాథుని యుగము )

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. “ప్రబంధము” అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.
1510-1600 – ప్రబంధ యుగము

విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో “ప్రబంధం” అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.
1600-1820 – దాక్షిణాత్య యుగము

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.
1820 తరువాత – ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు “భావకవిత్వం” అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు

నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి[9]. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.
తెలుగు నేర్చుకొనుటకు వనరులు
ఇంగ్లీషునుండి

సి.పి బ్రౌన్ అకాడమి వారి పుస్తకాలు అంతర్జాలంలో ఉచితంగా పొందవచ్చు

ఇతర రాష్ట్రాలలో తెలుగు

తెలుగు దక్షిణ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక లలో కూడా మాట్లాడబడుతుంది.తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరు జనాభా లొ 30 % ,మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు. తమిళనాడు లోని హొసూరు,కొయంబత్తూరు లొ కూడా తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేలకొలది తమిళప్రాంతము వెళ్ళి స్థిర పడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా,రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణంగా ఆరాష్ట్ర ప్రాంతీయ భాషయిన తమిళము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటక లో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు.ఇంకా ఒడిషా, చత్తీస్ ఘడ్,మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువ గా మాట్లాడువారు నివసించుచున్నారు[ఆధారం కోరబడినది] 1. బెంగళూరు 2. చెన్నై 3. హొసూరు 4.కొయంబత్తూరు 5. మధురై (తమిళనాడు) 6. బళ్ళారి 7. రాయగడ 8. హుబ్లి 9. వారణాసి (కాశి) 10. షిరిడి 11. జగదల్పూర్ 12. బెర్హంపూర్ ఒరిస్సా 13.ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 14. షొలాపూర్ 15. సూరత్ 16. ముంబై -భివాండి 17. ఛత్తిస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 18.ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు
భాషా పరిరక్షణ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలుగు అకాడమీ మరియు తెలుగు విశ్వవిద్యాలయం మరియు అధికార భాషా సంఘం నెలకొల్పింది. అయితే అధికార భాషా సంఘం ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది. తెలుగుని అభివృద్ధికి పెద్ద బాలశిక్షతో మొదలుకొని ఇటీవలి తెలుగు వికీపీడియా లాంటి విజ్ఞాన సర్వస్వము వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినా ఎన్నో ప్రతికూల ప్రభావాలకు లోనై, తెలుగు భాషవాడుకలో తగ్గిపోతున్నది.

Standard
Telugu

యూనికోడ్‌లో తెలుగు ఒదిగిపోవాలి : లిసామూర్

యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని యూనికోడ్ కన్సార్షియం ఉపాధ్యక్షురాలు లిసామూర్ వెల్లడించారు. తెలుగు భాషకు సంబంధించిన కంప్యుటేషనల్ భావనలపై కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వేదికగా నిర్వహించిన  మూడు రోజుల అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు (International Telugu Internet Conference, 2011)లో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ తోడ్పాటుతో సిలికానాంధ్ర నిర్వహించిన ఈ సదస్సుకు పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
సమాచార సాంకేతిక రంగంలో తెలుగువారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని, సమాచార-సాంకేతిక విజ్ఞాన ప్రగతికి తెలుగు పౌరులు చేస్తున్న కృషి నిరుపమానమని లిసామూర్ పొగడ్తల జల్లు కురిపించారు. తెలుగుభాష యూనికోడ్‌లో పూర్తిగా ఒదిగిపోవాలంటే తెలుగుపండితులు, పరిశోధకులు, కంప్యూటర్ రంగ నిపుణులు మరింత క్రియాశీలం కావాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యూనికోడ్‌లో ఇప్పటికే తెలుగు భాషకు సంకేత పట్టిక (code chart) రూపకల్పన పూర్తయిందని వెల్లడిస్తూ తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, దేవనాగరి లిపులను కూడా యూనికోడ్‌లోకి తీసుకువచ్చామన్నారు. అయితే ప్రాంతీయ భాషల విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయన్నారు.
ఇక తెలుగు భాషలో విద్యాభ్యాసం చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపనమ్మకాన్ని తొలగించాలన్నది కూడా ఈ సదస్సు లక్ష్యాల్లో ఒకటని స్వాగతోపన్యాసం చేసిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభోట్ల నొక్కి చెప్పారు. ప్రాచీనభాషగా గౌరవాన్ని దక్కించుకున్న తెలుగు భాషకు అంతర్జాతీయ భాషగా గుర్తింపు లభించాలంటే తెలుగువారంతా తక్షణం నడుం బిగించాలని స్పష్టం చేశారు. ఇంటర్‌నెట్‌లోగానీ, మొబైల్ ఫోన్‌లోగాని మాతృభాషలో ఎస్ఎంఎస్‌ను పంపలేని నిస్సహాయస్థితి తెలుగువారికి ఉండరాదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.


Standard
Telugu

తెలుగు లిపి సంస్కరణ

”…56 అక్షరాలున్న తెలుగు భాషకంటే 26 అక్షరాలే ఉన్న ఇంగ్లీషు ఎక్కువ వాడుకలోకి వచ్చిందిప్రపంచ భాష అయ్యింది. కాబట్టి తెలుగు భాషకు 16 అక్షరాలే పెట్టి నంబర్‌ వన్‌ పొజిషన్‌ తెస్తాను చూడండి..” అంటాడొక నాయకుడు సినిమాలో. అది అతను భావావేశంలో సాధ్యసాధ్యాలను గమనించకుండా అన్నమాట అయినప్పటికీ భాషా సంస్కర్తలు ఈ పనికి పూనుకోవచ్చు. తెలుగులో ఎదురయ్యే మొదటి సమస్య గుణింతాలువత్తులు. వీటివలన అక్షరానికి క్రిందా పైనా మరో రెండు లైన్లు స్థలం అవసరమవుతుంది. టైపుమిషనుకంప్యూటర్‌లలో అక్షరాలు ముద్రించేటప్పుడు ఈ విషయం తెలుస్తుంది. ఇంగ్లీషులో కేవలం ఎ,ఇ.ఐ.ఓ.యు. అనే అచ్చులతో మిగతా 21 హల్లులు కలిసి భాష ఒకే లైనులో సాఫీగాసాగి పోతుంది. తెలుగులో అ,,,,,,బుూ,,,,,,అం,అఃఅనే16 అచ్చులు. ఇప్పుడు ఋబుూ, ఁ (అరసున్న), ః (విసర్గ) లాంటివి వాడుకలోలేవు. అలాగే చ,,ఱ లాంటి హల్లులుకూడా వాడటం లేరు. వీటికి తోడు వత్తులుగుణింతాలు. వాటికోసం ప్రత్యేక అక్షరాలు. తెలుగులోని పదాలు అజంతాలు (అచ్చుతోటే అంతమవుతాయి) హిందీ వాళ్ళు రామ్‌ అంటే మనం ‘ రామ ‘ అంటాము. సాంకేతికంగా యంత్రాలకు కూడా సులభంగా వాడగలిగేలా భాషను సంస్కరించాలి. అనవసరమయిన అక్షరాలను వత్తులను వదిలించుకోవాలి. ‘ ఐతే ‘ అనే మాటను అయితేఅఇతే అని కూడా రాయవచ్చు. గొట్టము అనే మాట ఇంగ్లీషు తరహాలోనైతే, ‘ గఒటటఅమఉ ‘  అవుతుంది. కానీ ముందుగా అక్షరాలను ‘ నకారపొల్లు ‘ శబ్దానికి మార్చి పలికితేనే ఈ సంస్కరణకు వీలు చిక్కుతుంది. ఇప్పుడు కంప్యూటర్లలో కూడా ఇంగ్లీషు కీబోర్డు వాడి తెలుగులిపిని పొందే సాప్ట్‌వేర్‌ వాడుతున్నారు.
                ”తెలుగు లిపి పరిణామం” అనే వ్యాసంలో డాక్టర్‌ తిరుమల రామచంద్ర వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. ”..తెలుగు లిపి గుండ్రంగా అవటానికి 2500 ఏళ్ళు పట్టింది. అంతకు ముందు ఇవి అడ్డపునిలువు గీతలే. భాష ధ్వనిరూపం. ఈధ్వనికి సంకేతాలే లిపులు. అచ్చు వచ్చిన తరువాత లిపి స్వరూపం మరింత సుందరమయి స్థిరపడింది. ఇక్ష్వాకుల కాలంలో శిల్పులు అక్షరాలకు ఒంపులు వయ్యారాలు చేకూర్చారు. అక్షరాల నిలువు గీతలు అడుగున పొడవై కుడి వైపునకు వంపు తిరిగాయి. శాలంకాయనుల కాలంలో కొన్ని అక్షరాల తలపై అడ్డగీత ఏర్పడింది. కొన్ని అక్షరాలు గుండ్రతనం వదిలి కోణాకారం దాల్చాయి. విష్ణుకుండినుల కాలంలో తలపై అడ్డుగీత అన్ని అక్షరాలపై కనిపించింది. వీరి కాలంలో ళ్జ‘ లనే వింత అక్షరం ఉండేది. తరువాత అంతరించింది. చాళుక్య లిపి చక్కగా నిలువుగా ఉంటుంది. నన్నయ కాలం నుంచి వేంగీ చాళుక్య లిపిలో మార్పులు ప్రారంభమై 200 ఏళ్ళకు కన్నడతెలుగు లిపులు విడిపోయాయి. తెలుగు మరీ గుండ్రమై పోయిందికన్నడ లిపి కోణాకార మయ్యింది. నన్నయ్య కాలపు అక్షరాలకు మధ్యన అడ్డంగా గీత గీస్తే తలకట్టు దగ్గర తెగుతుంది. అంటే తలకట్టు సగమూతక్కిన అక్షరం సగమూను. కాకతీయుల అక్షరాలలో తలకట్టు చిన్నదై తక్కిన భాగం పెద్దది కావటంతో అక్షరాలు పొంకంగా దీర్ఘవర్తులంగా అయి అందం వచ్చింది. పహలు తలకట్టు విదిల్చుకున్నాయి. చాపజల్లెడ వంటి వాటిలో త ఒత్తువంటి గుర్తు  19వ శతాబ్దంలో సి.పి. బ్రౌన్‌ పెట్టించాడు. మరో వింత అక్షరం అరసున్న. 16వ శతాబ్దానికి ముందు కనిపించదు.
                ముఖ్యాక్షరాలు ఎంతగా మారాయో గుణింతాల గుర్తులు అంతకు రెండింతలుగా మారాయి. క్రావడి మరొక్క రూపం వలపల గిలకకర్మ‘ అని వ్రాయడానికి  కమ్‌  అని వ్రాసేవారు. ఈ విధంగా తెలుగు లిపి 23 వందల సంవత్సరాలలో ఎన్నో మార్పులు పొంది నేటికీ రూపానికి వచ్చింది. ప్రస్తుత యంత్రయుగంలో ఎన్నో మార్పులు పొందవచ్చు. లోహాక్షరాలు చేతితో పేర్చుకొనే అవసరం పోయిఆంగ్లంలో లాగా మోనోటైప్‌ యంత్రాలలోనులైనోటైప్‌ యంత్రాలతలోను  టైప్‌లాగా కొట్టే వరకు అభివృద్ధి చెందింది. అక్షరాలను విడగొట్టి కలిపే పద్ధతిలో స్వరూపాలు గూడా ముందుకన్నా మారాయి. కంప్యూటర్‌ ద్వారా కంపోజ్‌ చేసే పద్ధతి ప్రస్తుతం గొప్ప విప్లవం. ఒకచోట వాడిన మాట పలుచోట్ల అక్షరరూపం దాల్చే పద్ధతి కూడా వచ్చింది. శ్రమ తగ్గించుకొని లాఘవం కోరే మానవుని బుద్ధి ఈ వర్ణమాలలోనూ ఎన్నోమార్పులు తలపెట్టవచ్చు.
                మూడు సంవత్సరాల క్రితం కర్నాటక గవర్నర్‌ పెండేకంటి వెంకటసుబ్బయ్య గారు ఆంధ్ర-కర్నాటక లిపి ఏకీకరణకు బెంగుళూరు విశ్వవిద్యాలయం కన్నడ శాఖాధ్యక్షులు సచ్చిదానంద మూర్తిగారి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు. అది లిపిలో ఎలాంటి మార్పు చేయకుండా రెండిటినీ ఆదాన ప్రదాన పద్ధతిలో కలిపింది. ఈ వివరాలను విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” లో చూడవచ్చు. దీనిని ‘ విజయలిపి ‘ అన్నారు.(ఆంధ్రప్రదేశ్‌ దర్శిని –2 పేజీలు 389-398)
                ”కొన్ని తెలుగు ముద్రాక్షరాలు అచ్చు కూర్పరులకు విసుగు పుట్టించేవి. తెలుగు లిపిలో ఉన్న క్లిష్టత వల్ల తెలుగులో అచ్చు కూర్చటానికి (కంపోజింగ్‌కు) చాలా ప్రయాస పడేవారు. ఉదాహరణకు ఆనాడు అచ్చులో ఉపయోగిస్తున్న అర్ధచంద్రాకారంలో వేరొక వర్ణానికి కిందరాస్తూ ఉండిన  రావడి కూర్పు చాలా శ్రమ కలిగించేది. దీన్ని సి.పి. బ్రౌన్‌ తెలుగు శాసనాలలో ఉన్న గుర్తును నమూనాగా గ్రహించిలాంటి రెండు రూపాలు కల్పించారు. ఈ సంస్కరణల వల్ల కూర్పరులకు కొంత శ్రమ తగ్గింది. అచ్చు కూర్పు కొంత మేరకు వేగవంతమయ్యింది. ఈ కొత్త రూపాలకు బ్రౌన్‌ రావళ్ళు‘ అనే పేర్లు కలిగాయి. ఇలాగే ప,,ల విషయంలో లిపిలో ఉన్న సామ్యాన్ని బట్టి పొరబాటు పడటానికి అవకాశం ఉన్న దాన్ని గ్రహించి కన్నడంలో ఉన్నట్లు ఈ అక్షరాలలో స్పష్టంగా మార్పు కనబడే విధంగా టైపులు పోత పోయించి సి.పి.బ్రౌన్‌ వాటిని వాడుకలోకి తెచ్చారు. కాని ఇవి తెలుగులో నిలిచినట్లు కనబడదు. బ్రౌన్‌ కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినాతెలుగుముద్రణ పెక్కు లోపాలతో సాగుతూ వచ్చింది. ముద్రాక్షరాల సంఖ్యను 405 కన్నా తగ్గించటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. బందరులోని కళ్యాణీ టైపు ఫౌండ్రీ అధిపతి కె.వి. కొండయ్యగారు అక్షరాల సొంపు చెడకుండా ముద్రణా యంత్రానికి ఒదిగే విధంగా టైపు తయారీలో సాంకేతిక మార్పులు చేసి, 350కి తెలుగు లిపి రూపాలను కుదించారు. దీన్ని ” కళ్యాణీ టైపు ” అన్నారు. తక్కువ వ్యవధిలో అచ్చుకూర్చి తక్కువ వ్యయంతో తెలుగు పుస్తకాలు ముద్రించవలసిన అవసరం ఏర్పడింది. దీనికి తెలుగు లిపి ప్రతిబంధక మైంది. అది ముద్రణకు అనుకూలంగా లేదు. గుణింతపు గుర్తులు (తలకట్టులుగుడులుసుడులు) మొదలైనవి అక్షరానికి పైనా కిందా ఉండటంసంయుక్తాక్షరాలుద్విత్వాక్షరాలూవీటి గుర్తులు కొన్ని సూటిగా అక్షరం కింద ఉండటంఅక్షరాలు అధికంగా ఉండటం అనే అంశాలు తెలుగు లిపిలోని క్లిష్టతకు ముఖ్యమైన కారణాలు. ఇలాంటి క్లిష్టత వల్లే తెలుగులో పుస్తక ముద్రణ వేగంగా జరగటం లేదు. లోపాలను తొలగించి తెలుగు లిపి సంస్కరణ తప్పనిసరిగా జరపవలసి ఉంది.
                మన మీనాడు కంప్యూటర్‌ యుగంలో పురోగమిస్తున్నాం. పరిణామాలను ఆహ్వానిస్తున్నాం. వేగం నేటి యుగధర్మం. ఈ వేగానికి తట్టు కోలేనిదేదీ నిలవదు. మందకొడిగా అక్షరాలు కూడా నడక సాగించలేవు. తెలుగు భాషకు. ఇదొక సంధియుగం. మద్రాసులో మురళీకృష్ణ అనే ఇంజనీరు బాపు అక్షరాలతో సహా అందంగా అక్షర స్వరూపాలకు కంప్యూటర్‌ ప్రింటింగ్‌కి అనువుగా కీ బోర్డులు రూపొందించాడు. లిపిని ఇంకా సంస్కరించి తెలుగు భాషా స్వరూపాన్ని ఆధునీకరించటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.”  (ఆంధ్రప్రదేశ్‌ దర్శిని –2పేజీలు 506-514).  ప్రభుత్వంఅధికార భాషా సంఘం లిపి సంస్కరణ” కొరకై నడుము బిగించాలి.
                ఇక తెలుగులో తీర్పులివ్వటం సాధ్యమని కొందరుఅసాధ్యమని కొందరుప్రమాదమని మరికొందరు సెలవిచ్చారు. బ్రిటీష్‌ వాళ్ళుమొగలాయిలు రాకముందు ఈదేశం అనేక దేశాలుగా ఉండేది. ఎవరి భాషలో వారి పాలన సాగేది. ధర్మగంట మోగిస్తే రాజుగారొచ్చి వాదోపవాదాలు విని తీర్పు ఇచ్చేవాడు. న్యాయవాదులు ఉండేవారు కాదు. వాయిదాలు తక్కువ. ప్లీడర్‌ ఫీజులు లేవు. సత్వరన్యాయం చౌకగా దొరికేది. ఆనాడే సాధ్యమవగా ఈనాడెందుకు సాధ్యం కాదుఅని కొందరన్నారు.
                అదంతా అరాచక కాలం. అప్పుడు చెల్లిందికానీ ఇప్పుడు రాచరికం లేదురాజు తీర్పులివ్వకూడదు. అందుకే న్యాయవాదులు న్యాయమూర్తులతో కూడిన న్యాయవ్యవస్థ ఏర్పడింది. పోలీసు చేతిలోపెత్తందారు చేతిలో న్యాయపెత్తనం పెట్టకూడదు. ఇచ్చిన తీర్పు దేశమంతటా అర్ధం కావాలి గాబట్టి ఇంగ్లీషులోనే ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తుల్లో తెలుగు రానివారు కూడా ఉంటారు సుప్రీంకోర్టులో తెలుగు అనుమతించరు. ఇంగ్లీషే ఈ దేశ అధికార భాష కాబట్టి తీర్పులు ఇంగ్లీషులోనే ఉండాలి అని కొందరన్నారు. అసలు మన రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించారాఆ అనువాదానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందాసివిల్‌క్రిమినల్‌ చట్టాలు తెలుగులో అధికార పూర్వకంగా విడుదల అయ్యాయాఅవి నోరుతిరిగే భాషలో ఉన్నాయాఅర్థం అవుతాయామన పిల్లలకు న్యాయవిద్య తెలుగులో అందిస్తున్నారా?పారిభాషిక పదాల కొరత ఎలా తీరుస్తారులాంటి ప్రశ్నలతో కొందరు ఇదంతా అయ్యేపని కాదని పెదవి విరిచారు. తెలుగు భాష విూద నాకు ఎంత ప్రేమో! తీర్పులు తెలుగులో ఇవ్వొచ్చు” అని ధైర్యపరిచేవాడిని. తెలుగు దీనావస్థను చూచి కూడా ఏదో ఆశఇది పునరుద్ధరించ బడుతుందని. నేను పెట్టిన పోటీ నాకే పోటీ అయికూర్చొంది.
                 ఈ మధ్య నేనే న్యాయమూర్తినయ్యాను. రంపచోడవరం  మొబైల్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అంతా గిరిజనులుమన అచ్చ తెలుగువాళ్ళుఆహాఇంకేం తెలుగులో తీర్పులివ్వొచ్చు అని ఆనందపడుతూ వెళ్ళాను. అక్కడా పదిమంది లాయర్లు ‘ యువరానర్‌అంటూ ప్రత్యక్షమయ్యారు. ఆంగ్ల భాషాకోవిదులైన అడ్వకేట్లు నల్లకోట్లు వేసి నాముందుకొచ్చి,  నేను తెలుగు న్యాయం మాత్రమే చెప్పబూనటం అపూర్వంసాహసంప్రమాదభరితం అని ఆంగ్లంలో ఉపదేశించారు. అడివిలో కూడా ఆంగ్లమేనా ఇక నా తెలుగెక్కడ తల్లీఅని తడుముకున్నానుమదనపడ్డాను. వాదిప్రతివాదిసాక్షులు అంతా తెలుగులో చెబుతున్నారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం టైపు చేయమంటే తెలుగు టైపు మిషన్‌ లేదుఅయినా అది కష్టంవిూరు ఇంగ్లీషులోకి మార్చి చెప్పండి కొడతాం” అని సిబ్బంది ఇబ్బంది పడ్డారు. శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్లుగా బహుశా తెలుగును అభిమానించే న్యాయమూర్తులంతా ఇటువంటి ఇబ్బందుల్ని నెగ్గుకు రాలేక మౌనం దాల్చారని స్వానుభవం మీద అర్థం అయ్యింది.
                కంప్యూటర్లొచ్చాయికోర్టులో తెలుగు సాఫ్ట్‌వేర్‌ వాడుకోవచ్చుగదా అని కొందరు ఉచిత సలహాపడేశారు. నిజమే గదా అని కంప్యూటర్‌ అడిగాం. ఇస్తామన్నారు అయితే దానికి ఇంగ్లీష్‌ కీబోర్డే ఉంటుంది. ఇంగ్లీష్‌లో కొడితే తెలుగు అక్షరాలు ప్రత్యక్షమవుతా యన్నారు. మాడుమీద కొడితే మోకాలు పగిలినట్లు ఈ బాధ మనకెందుకు తెలుగు మాటల్నే ఇంగ్లీషులో కొడదాం తేలికగా పనైపోతుంది annaru kondaru అసలు విషయం అర్థంకాకుండా పోతుంది annaru inkondaru  ఇలాంటి తీర్పులు ఎవరు ఒప్పుకొంటారండీ అని ఇంకొంత మంది ఆక్రోశించారు. వత్తులు గుణింతాలతో పడిలేచి చచ్చేకంటేయంత్రానికి అనువైన ఆంగ్లాక్షరాలతో పనిచేసుకోవచ్చు గదా అప్పుడు మన తెలుగును ఇంగ్లీషొచ్చినోళ్ళంతా చదువుతారుతద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇంగ్లీష్‌ సౌలభ్యాలన్నీ మనం కొట్టేయవచ్చు అన్నారింకొందరు అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టవు తుందేమోనని ఆచర్చ అంతటితో ఆపాము.
                ఇంతకీ తెలుగుకు వైభవం తేవటానికి ప్రభుత్వం నడుం బిగించిదనే వార్తలుఅధికారభాషా సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణప్రజల భాషకు పట్టం కట్టడానికి పలుచర్యలు తీసుకుంటామని ప్రకటించటం సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నా తల్లి నా కందంనా భాష నాకానందం” అంటాడు గురుకుల మిత్రా. ఈనాటి కోర్టులు పరాయివిఊరిలో న్యాయం ఊరిలోనే జరగాలి” అనే వ్యాసంలో (వార్త 8-7-2003) ఆయన ఇలా అంటాడు. ఉదయం కేసు వేస్తే సాయంత్రానికి న్యాయం ఒనగూడుతుందనే పద్ధతిని ప్రజాకోర్టుల నుండి ఈ ప్రజాస్వామ్యం నేర్చుకోవాలి. ఇప్పటి పంచాయితీలకు కోర్టు అధికారాలు కూడా ఇస్తే అక్కడే ఒక సారి కాకపోతే రెండోసారి లేక మూడోసారి కూడా కేసును తడివి తడివి విమర్శిస్తే సరిపోతుందేమో చూసుకోవాలి. ఎక్కడి ప్రజల సమక్షంలో అక్కడే తీర్పు జరిగితే ఆ కోర్టు గొప్పదవుతుంది.
                ఎన్టీరామారావుగారు న్యాయ పంచాయితీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అవి వస్తే ప్రజల భాషలో తీర్పులొస్తాయి. పరాయి ప్లీడర్లుపరాయిభాషపరాయి ప్రాంతం లాంటి సమస్యలు ఉండవు. ఏ భాషలో న్యాయస్థానం తీర్పులిస్తుందో అదే నిజమైన అధికార భాష. తెలుగుకు ఆ స్థాయి రావాలి అని నాఆకాంక్ష! సముద్రాల అవతలి నుంచి వచ్చిన ఇంగ్లీషు ప్రభావంతో తెలుగు తెల్లబోతోంది. ఆధునికులు మాట్లాడే నాలుగు ముక్కల తెలుగులో మూడుమాటలు ఇంగ్లీషువే ఉంటున్నాయి. తెలుగు ఇంగ్లీషు కలవ్వేమో అని కొందరికి డౌటేహం కానీ అటువంటి సందేహాలు అవసరం లేదని ఇప్పటి తెలుగు రుజువు చేసింది. అందువల్లే అతను అదో టైపు‘ ‘నీ కంత సీన్‌ లేదులే‘ వంటి తరచూ వినపడే మాటలు అచ్చ తెలుగులానే అనిపిస్తున్నాయి ఇంగ్లీషు మాటలతో చక్కగా కలిసి పోయి కొత్తరకం తెల్గిష్‌భాష తయారయింది. ప్రస్తుతం తెల్గిష్‌” వీరవిహారం చేస్తోంది.(ఈనాడు సంపాదకీయం 20.7.2003)
                విశృంఖలమైన భాషను ఎవరూ ఆపలేరు. జనం నాలుకలపై నాట్యమాడే భాషే అధికార భాష కూడా. అయితే వారి భాషలోనే సమస్త పాలనా వ్యవహారాలూ జరిగితేఆ ప్రజలు సుఖపడతారు. ప్రాకృతంసంస్కృతంఉర్దూఇంగ్లీషు మొదలైన భాషల నుండి ఎన్నో పదాలు మన తెలుగులో కలిసిపోయి వందల ఏళ్ళ నుండి మన వాడుకలో మన పదాలే అయిపోయాయి. వాటిని మన నిఘంటువులో చేర్చి మన భాషను శక్తివంతం చెయ్యాలి. ప్రజలు విరివిగా మాట్లాడే మిశ్రమ భాషే” అందరికీ అర్థమై పాలకభాషగా చక్కగా రాణిస్తుందేమో! ఉర్దూ అలాంటిదే గదా!

ఆధారం : యన్ రహ్మతుల్లా గారి బ్లాగు

Standard