telugu poetry

బ్రాండ్ ఇమేజ్

నిన్నే నువ్వు బ్రాడింగ్ చేసుకోవడం అంటే
ప్రపంచానికి నీ పటాన్ని ఆడించే దారాన్నివ్వడం.
కొలతలకందే నిర్మాణంగా నిలువెత్తు నిరూపణనివ్వడం
అడవిలా విశాలమై, విస్తృతంగా విస్తరించుకుంటే మార్కులుండవు
అద్దాల మధ్య మరుగుజ్జు వృక్షాలపై ఆపేక్షలకూ అంతూ వుండదు.
నేటి నవీన సౌందర్యశాస్త్ర నిర్వచనాలకు అదే చెపుతున్నాయి మరి.
ఉద్యాన వనాలను హత్తుకునే వేళ చిట్టడివిగా మారి చిరాకు పరచకు.
ఆలోచనలకు సైతం పెళుసుగా చిట్లే చట్రాల గుండా సాగే పయనం చేస్తున్నాం

తల్లిపాలతో ఎదిగిన బిడ్డలా,
కొమ్మ ఒడినుండీ పండువై పలకరించాలని చూడకు.
రంగులేబుళ్ళ గందరగోళం లేనిదే పంటికేమాత్రం రుచించవు.
శవాల గుట్టా సద్దిపెట్టెల మాటున రసాయన సెగల ధూపం తాకనదే
నీకసలు రూపమే పిండంలో ప్రాణంపోసుకోలేదంటున్నారు.
కొన్ని ప్లేవర్స్ ఇప్పటకే ఇల్లుకట్టుకున్నాయి.
వాటిని చల్లుకోకుండానే చెల్లుబాటవుదామని చూడకు.

నదివై ప్రవహిస్తూ నాలుకలను తాకాలనుకోకు,
రుచిమొగ్గల చివర్లుకూడా స్పృశించేందుకు సంకోచిస్తాయి.
ఒదిగుంటే వ్యర్ద ద్రవానివైనా, సీసాల ఆవాసం నుంచీ పలకరిస్తేనే
గొంతులోకి ఒంపుకుంటామంటున్నారు.
బిరుసుదనం నీ తలలో వుంటే తగ్గించుకో,
పాత్రలలో ఒదిగిపోతేనే పరిశీలిస్తారట జనం

మట్టిగొళానిదేముందని చుట్టూ ఆక్రమించి
గొలుసులేవీ అంటుకోలేని గాలి జీవితం గడుపుతున్నావా ?
లోహ కచ్చడాల మద్యనుంచీ రబ్బరు ద్వారాలలోకి ప్రవహిస్తేనే
ఆబగా హత్తుకుంటారనే నిజాన్ని మరపులోకి పోనీయకు.
వెన్నుముక నిటారుగానే వుండాలని మొండిపట్టుదలలకు పోకు
మడిచుకుని విపణిలోకెళ్లే మార్గం మూసుకుపోతుంది.

విశ్వవిస్తరించేది కృష్ణబిలాలుగా మారేందుకే అన్నట్లు
స్వార్ధం విస్తృతమయ్యేది తృష్ణజలాలతో తడిసేందుకే.
సాంద్రత స్థాయిదాటితే వెన్వెంటనే మరో మహా విస్పోటనం
స్వార్ధం హద్దుమీరితే ఒంటరి పయనపు విరళీకరణం.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/557571620962261/

Standard

2 thoughts on “బ్రాండ్ ఇమేజ్

 1. ఏమండీ, మీ టపా లు రాసెక చదవి చూసేరా ?
  నా వల్లయితే కావడం లేదు
  సగానికి ఆ సైడు లో ఉన్న విడ్జెట్ మీ కవిత ని స్వాహా చేసేస్తోంది సగానికి
  పైగా … చదవడానికి అసలు కుదరడం లేదు

  జిలేబి

 2. నేను డెస్క్ టాప్ నుంచి పోస్టును సరిచూసానండీ బాగున్నకే ఫైనల్ చేసాను.
  ఫోన్ నుంచి కూడా ఇప్పుడే చెక్ చేసాను నాకు బాగానే కనిపిస్తోంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s