Numismatics

దమ్మిడీ అంటే ఎంత ?

1 దమ్మిడీ ( pie) = 1/12 అణా
 ( ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 0.520833 నయాపైసలు )

స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పదేళ్ళవరకూ భారతీయ ద్రవ్య విధానం రూపాయికి 16 అణాల పద్దతిలో వుండేది. అర్ధ రూపాయంటే ఎనిమిది అణాలు,  పావలాకు నాలుగు అణాలు రెండు పరకలు అంటే ఒక అణా, నాలుగు కానీ (Pice) అయితే ఒక అణా అప్పుడు ఒక పైస్ అనేది ఇప్పటి 1.5625 నయాపైసలకు సమానం అప్పుడు అణాలో 12 వంతు భాగాన్ని దమ్మిడీ అనేవారు.

1 రూపాయి = 16 అణాలు ( తర్వాత 100 నయాపైసలు )
1 అర్ధ రూపాయి = 8 అణాలు లేదా 1/2 రూపాయి ( తర్వాత 50 నయాపైసలు )
1 పావలా = 4 అణాలు లేదా 1/4 రూపాయి ( తర్వాత 25 నయాపైసలు )
1 బేడా = 2 అణాలు లేదా 1/8 రూపాయి ( తర్వాత 12.5 నయాపైసలు )
1 అణా = 1/16 రూపాయి ( తర్వాత 6.25 నయాపైసలు )
1 పరక = 1/2 అణా ( ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 3.125 నయాపైసలు )
1 కానీ(pice) = 1/4 అణా ( ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 1.5625 నయాపైసలు )
1 దమ్మిడీ ( pie) = 1/12 అణా ( ఇప్పటి లెక్కల ప్రకారం  0.520833 నయాపైసలు )


ఇది గొప్పగానే అనిపిస్తుంది గమనించండి
కానీ రూపాయిని లెక్కలేనన్ని బాగాలుగా చేసుకున్నా ఆ భాగాలకూ మార్పిడిలో వస్తువులు వచ్చేవి. డాలరు కంటే రూపాయి విలువ ఎక్కువగా వున్న రోజులవి.

1957లో దశాంక విధానం అమలులోకి వచ్చింది. అప్పుడు రూపాయికి 100 పైసల లెక్క కాబట్టి అప్పటి నుంచీ లెక్క బెట్టే పైసలు వేరేవి అందుకే ఆర్ధం లోనే పైసలను నయా పైసలు (కొత్త పైసలు) అని పిలిచేవారు.

రెండు అణాలు అయితే ఒక బేడ (ఇప్పటి నయాపైసల కొలతలో 12.5)

Four Annas and Eight Annas Coins

అణాలో సగభాగం  పరక (ఇప్పటి నయాపైసల కొలతలో 3.125)

One Quarter Anna
One Pice
One Anna
అణా నాణెలపై తెలుగు భాష కూడా వుంది
గమనించారా?

   

Naya Paisa
One Pice 1943
వ్వవహారంలో నాణేల గురించి

పదహారణాల ఆడపిల్ల (ఒక్క అణాకూడా తగ్గకుండా నిండా రూపాయి అని)

క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు.(కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికేలేనట్లే కనిపిస్తారు, కానీ వారు చేసేపని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళను ఉద్దేసించి అనేదే ఈ సామెత)
దమ్మిడీకి కొరకాడు ( అణాలోనే పన్నెండవ వంతయిన అత్యంత తక్కువ విలువున్న దమ్మిడీకి కూడా పనికి రాడని)
ఆచారి పిలక ఆరణాలు ముడిప్పదీస్తే మూడణాలు ఎత్తేస్తే ఏడణాలు మొత్తం కలిపితే(6+3+7) రూపాయ్.

( నోట్ : పైన చిత్రంలో చూపిన నాణేల అసలు సైజుల వేరుగా వుంటాయి వాటి పరిమాణాలను అనుసరించి బొమ్మలను చూపలేదని గమనించగలరు)

Advertisements
Standard
telugu poetry

టెల్గూస్

భాషా దౌర్భల్యమో
బావ దారిద్యమో
తెలుగు చాలటం లేదెవరికీ
వ్యక్తీకరించేందుకు
బట్
ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ 

Standard
Telugu

భాషా రక్షతి… రక్షిత:

దమ్మిడీ, నిట్టాడు, సాలు
ఈ మాటలకు అర్ధం ఇప్పటి పిల్లలకు తెలుసా?
పదాలకు సమానమైన పరభాషా పదాలు అదే సంస్కృతి లేకపోతే వుండవు.
అంటే ఆ పదాన్ని మర్చిపోతే దానివెనకున్న సంస్కృతికూడా కనుమరుగయినట్లే.
పెద్దింటి అశోక్ కుమార్ గారి ‘‘జిగిరి’’ నవల చదువుతున్నప్పుడు ఎలుగు బంటిని ఆడించే సంస్కృతి తో ముడిపడ్డ పదాలు చదువుతున్నప్పుడు ఇదే అనిపించింది.

అలాంటిది లిపిలేని భాషవుంటే ఆ సంస్కృతి దాని విశేషాలు ఆ మనుషుల తర్వాత ఎలా అందాలి.

సవర భాషకు గిడుగు (http://tinyurl.com/p9huaev ) వారు. తన స్వంత నౌకరీనుంచి వచ్చే చిన్న మొత్తంతోనే చేసిన కృషి ఈ రోజు ఆ భాషకు అస్థిత్వన్ని నిలబెట్టింది. మనకి భాషని నిలబెట్టుకునేందుకు ఒక స్ఫూర్తిని ఇచ్చింది.

మన సంస్కృతి నిలబడక పోతే ఏమవుతుంది ?
ఇలాగే అరువు సంస్కృతి బరువు రూపాయి నెత్తిన రోజురోజుకూ పెరుగుతుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు మన రూపాయినో, ఆర్ధిక వ్యవస్థనో పాతాళంలోకి తొక్కేస్తుంది. రిమోట్ ఆపరేషన్స్ తో మెదళ్ళమీద సాధించిన పట్టుతో బలహీన వస్తువులని అంటగట్టి సైతం స్ట్రాతో పీల్చినట్లు మన జేబుల్లో రూపాయిని పీల్చుకునే శక్తిని మనమే ఇస్తున్నాం.

మన మూలాల్ని కాపాడుకోవటం అంటే మన కాళ్ళపై మనం నిలబడటమే, మన వెన్నెముకని మనం భద్రంగా వుంచుకోవడమే.

Advertisements
Standard
తత్వం

హీరో ది క్రిష్

తనే ఎందుకు జగద్గురువు అయ్యాడు?
తనే ఎందుకు మిగిలిన చాలా మంది కంటే భిన్నంగా కనిపిస్తాడు?
సంఘటనల్లో, ఎమోషనల్లో మునిగిపోకుండా అవసరమైనంత వరకే ఎలా చేసేశాడు? ఇలా ఇంకెవరైనా వున్నారా?

నలుగురికి ఉపయోగపడే మడుగులో పాము పడగలను అణగదొక్క గలడు
వెదురు పుల్లతో అప్పటికెవ్వరూ ఎరుగని సంగీత వాయిద్యాన్ని తనే సృష్టించగలడు, (పేటెంట్ హక్కులు పోకుండా ప్రతిప్రేము లోనూ తనతోనే వుంచుకోగలడున్నూ)

ఇప్పటి మన జాతియ పక్షికి తనెప్పుడో గౌరవం ఇచ్చేశాడు.
త్యాగాలో తపస్సులో చేసి జనాన్ని ఆకట్టుకున్నాదీ లేదు.
నిజానికి ఖరీదుతో సంభందం లేని అలంకార ప్రియత్వం తనది. పూల దండలూ, పక్షి ఈకలూ, వెదురు పుల్ల అన్నింటికంటే సందర్భంలో మునిగిపోకుండా మెదడుతో ఆలోచించి మట్లాడగల నేర్పరి తనం.
పదహారువేల మంది గోపికలు ప్రెండ్ లిస్ట్ లోవున్నా సరే, తన ఎనిమిది మంది గ్రూపులలో ప్రజెన్స్ ని ఆపేసిందీ లేదు.

ముందు అవతారంగా చెప్తున్న రామడిలో ఉదాత్తత వున్నప్పటికీ భవభందాల వలలో అడవులలో తిరిగి, జనభందాల బెదురుతో భార్యను వదిలి, బావద్వేగంతో శోకించి మారీచుడి మారువేషానికో మిమిక్రీకో మాయలో పడిపోకూడదనుకున్నాడేమో. తనే కావచ్చు ఇది కథే అయితే కథా రచయిత కావచ్చు ముందు తరం మెరుగు లక్షణాలను నింపుకున్న కారెక్టర్ తో తరువాతి తరాలను కూడా డామినేట్ చేసేశాడు.
కింగ్ లా కనిపించిన దానికంటే తను కింగ్ మేకర్ గా తాను నిర్వహించిన పాత్ర ఎక్కువ.
చీరలెత్తుకెళ్ళి కొన్ని వ్యామోహాలను పటాపంచలు చేయటం తెలుసు, చీరలిచ్చి రక్షించటమూ తెలుసు సందర్భశుద్ది వుండాలే కానీ చేసే పని వల్లనో మంచో, చెడ్ అంటుకోవన్నది నిజం.

ప్రపంచానికే తన పర్సనాలిటీ డవలప్మెంట్ పాఠాలు ఈనాటికీ అవసరం అవుతున్నాయి. మాటల్లోనే కాదు చేతల్లోనూ తన పనులు పాఠాలుగానే వినిపించాడు. యుధ్ధంలో అర్జునిడికి ఆవేశాన్ని నూరిపోయటం కాదు. ఆలోచనాత్మకంగా వివేచించి చెయ్యాల్సిన పనేమిటో చెప్పాడు. అందుకేనేమో తను జగద్గురువు.

ఎక్కడిదీ గొప్పతనం.

తను ఎదిగింది బంగారు పళ్ళేలు, వెండి స్పూనులలోనుంచి కాదు. మట్టి జీవితం నుంచి, కుచేలుడిలాంటి మిత్రులను పరిశీలిస్తూ, ఆవులు కాసి ప్రకృతిని చూసి, బాల్యాన్ని ఆహ్లాదంగా ఆటలతో గడిపి ఎదిగాడు. పెంపుడు తల్లి అయినా పాలతో పాటు ప్రేమను తాగి బ్రతికాడు.

అందుకే నాకు చాలా విషయాలలో నచ్చిన హీరో ది క్రిష్.

Advertisements
Standard
Telugu

సమైక్యమా లేక సమాఖ్యమా ?

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Advertisements
Standard
వివరణ, History

కటసరాజ దేవాలయం


రెండు సంస్కృతులు విడిపోయేప్పుడు ప్రదేశాలని తరలించలేం. చారిత్రక ప్రసిద్ధి వున్న అపురూప సంపద భిన్నమైన సంస్కృతి వున్న ప్రాంతం లోనే మిగిలిపోతే.

ఇప్పుడు చెపుతున్న హిందూ దేవాలయం భారతదేశం విభజనకు గురయినపుడు పాకిస్థాన్ కి చెందింది. అది ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబురాష్ట్రానికి చెందిన చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. దాయాది దేశంలో నిజానికి హిందు దేవాలయాలు వుండటం చాలా అరుదు. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా వుంటుందట. మరి దీని పరిరక్షన ఆదరణ ఎలావుందో మరి. ఇప్పటికైతే రక్షిత కట్టడంగా ప్రకటించబడలేదు.

ఈ ప్రదేశం గురించి వాడుకలో వున్న కథలివి

దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థం గానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థం గానూ మారాయి.

మరో కథ

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి

తర ఆరణి( త్రచ్చి నిప్పు పుట్టించెడి పుల్ల – అప్పట్లో అగ్గి పెట్టెలు, లైటర్లు లేవు కదా) లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృష్యవాణి పలికినది… ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా  చెప్తారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్ వద్దనే జరిగింది.
యక్షప్రశ్నల ఘట్టం 


ఈ కాటస క్షేత్రం ఒకప్పుడు విశ్వవిద్యాలయంగా కూడా నిర్వహింపబడినదట దేశ విదేశాలకు చెందిన విద్వార్ధులు

ఇక్కడ చదువుకునేవారట. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని జన్మతః పర్షియన్, హేతువాది, అవిసెన్నా మరియు అల్-హాజెన్ ల సమకాలికుడు, చరిత్రయేగాదు, తత్వము, బౌగోళికము చాలా లోతుగా తెలుసు, కానీ ఎక్కువగా ముస్లిం ఖగోళశాస్త్రాల ను “ఖానూన్ అల్-మసూదీ” క్షుణ్ణంగా వ్రాశాడు.” “బెరూని, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడు, – ‘భాషా శాస్త్రం’ నుండి ‘లవణ శాస్త్రం’ వరకూ, ఇతను మధ్యయుగపు ఉజ్బెకిస్తాన్ కు చెందిన సార్వత్రిక జ్ఞాని.”

చంద్రునిపై ఒక క్రేటర్ కు ఇతని పేరుపెట్టారు.

1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబుకు వచ్చేశారు.

ఈ ప్రాంతం లోని సిమెంట్ తదితర పరిశ్రమల అత్యాసతో గొట్టాలతో పరిశ్రమల అవసరాల కోసం నీటిని పీల్చేసుకోవడమే కాక పంజాబ్ ప్రభుత్వం కూడా దీని చుట్టుపక్కల రెండు గ్రామాలకు(Choa Syedan Shah and Waula villages ఈ నీటినే అధికారికంగా సరఫరా చేస్తోంది. ఆ గ్రామాలకు ఈ నీరు తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో  ఈ సరస్సు లోనిన నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి 
ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని 2007 లోనే ప్రతిపాధనలను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 
ముషర్రఫ్ అధ్యక్షులుగా వున్న సమయంలో 2006-2007 సంవత్సరాలలో ఈ దేవాలయ పునురుద్దరణ కోసం కొంత ఖర్చు పెట్టారు. పర్యటక ప్రాంతంగానూ అభివృద్ధి చేసేందుకు కృషి చేసారు. కానీ ఇది నామమాత్రమనే చెప్పుకోవచ్చు. 

ప్రశ్నలు

ఇంతకీ శివాలయానికి కటస రాజ ఆలయం (కాటస రాజా ?) అని పేరేందుకు వచ్చింది?
దానికి అర్ధం ఏమిటి ? శివుడికే మరో పేరుగా అది వుందా?
బిర్లా టెంపుల్ లాగా ఈ ఆలయాన్ని కట్టించిన రాజు కటస రాజా? అయితే అతని చరిత్ర ఏమిటి

సమాధానాలు తెలిస్తే దయచేసి పంచుకోగలరు…. ముందస్తు ధన్యవాదాలతో

ఈ వ్యాసం కోసం క్రింది ఆధారాలను పరిశీలనలోకి తీసుకున్నాను.
http://www.pakistan-explorer.com/3/post/2012/04/post-title-click-and-type-to-edit.html

http://www.scoopweb.com/Katasraj_Temple
http://en.wikipedia.org/wiki/Katasraj_temple
Youtube documentaries
http://blog.travel-culture.com/2012/04/23/katas-raj-ponds-drying-up-due-to-water-supply/ ( నీటినిల్వల తరుగు దల పై కేంద్రీకరించిన వార్త)
తదితరాలు…

మూడు భాగాలుగా వున్న ఈ డాక్యుమెంటరీ లో చాలా వివరాలున్నాయి.

Advertisements
Standard
Videos

బాబోయ్ ఇంత కేమిడినా?

Advertisements
Standard