సమాచారం

తెలుగు విస్తృతి

తెలుగు విడిపోదు. తెలుగు పటాన్ని ఎథ్నోలాగ్ ప్రకారం మరింత విస్తృతమవుతుంది.
1. బెంగళూరు
2. చెన్నై
3. హోసూరు
4.కోయంబత్తూరు
5. మధురై (తమిళనాడు)
6. బళ్ళారి
7. రాయగడ
8. హుబ్లి
9. వారణాసి (కాశి)
10. షిరిడి
11. జగదల్పూర్
12. బరంపురం, ఒడిశా
13.ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్
14. షోలాపూర్
15. సూరత్
16. ముంబై -భివాండి
17. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు
18.ఒడిశా సరిహద్దు
                                                             ప్రాంతాలలో తెలుగు విరివిగా వాడుతున్నారు.
తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరు లో 30 % మంది తెలుగు భాష మాట్లాడతారు. 
“ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”

                                                     — మిరియాల రామకృష్ణ
పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. భారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు వాడకం విరివిగా వుంది. 
మన రాష్ట్రం లో మాట్లాడుతున్న తెలుగులో నాలుగు ప్రధానమైన మాండలికాలున్నాయన్నది తెలిసిందే. వేరే రాష్ట్రాలతో కలిసి నివసిస్తున్న తెలుగు వారి భాషల ఉచ్చారణతో కలిసి కొత్త సొబగులద్దుకుంటోంది.
“ జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”

                                           — వినుకొండ వల్లభరాయడు
సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె..
అన్నదమ్ములమే అనుకోవడానకి కారణం తెలుగుతల్లి బిడ్డలం కావడమే కదా.
Advertisements
Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s