వివరణ

కావలసినదా ? అవసరమైనదా?

మంచి పేరెంటింగ్ అంటే

పిల్లలకి ఏది ఇష్టమో అది ఎంతైనా కష్టపడి సంపాదించి ఇవ్వడం కాదు.
వారికి ఏది ‘అవసరమో’ అది నిజంగా ఇవ్వగలగటం.
నిజంగా ఈ మాట కొంచెం ఆలోచించి అర్ధం చేసుకున్నాక నాకు చాలా బాగా నచ్చింది. పిల్లల విషయంలో నేను ఎలా వుండాలి అనేదాన్లో నాపై ప్రభావం చూపింది.

మరోటి యుద్దం

ఎప్పటినుండో అమలులో వున్న ప్రభావ వంతమైన యుద్ధ సూత్రం. ‘‘ శత్రువుపై ఎంత పగని, ద్వేషాన్నీ రగిలించుకుంటావో అంత బలంగా వారిపై పోరాడగలవు’’ సైనికులని ఉత్తేజితం చెయ్యలంటే అవతలివారి దుశ్చర్యలని వీరికి చేసిన ద్రోహాన్నీ రగిలించి రగిలించి చెపితే శరీరంలోని బలం కంటే మనసులోని కసివల్ల వచ్చిన బలంతో మరింత దుర్భేద్యంగా పోరాడ గలుగుతారు. కసిని చల్లరనీయక పోతేనే పోరాటం నిలబడుతుందని. ద్రౌపతి తనకు జరిగిన అవమానాన్ని భర్తలు మర్చిపోకుండా వుండేందుకు జుట్టు ముడి వేసేకోనని ప్రతిజ్ఞ చేసింది. కంకణం కట్టు కున్నవా అనే నిభందన పదే పదే పనిని గుర్తుకు చేసేందుకేనేమో.

మరి మరో ప్రక్రియ లేదా

వుందన్నాడు గాంధీ, అవును మన మహాత్మా గాంధీనే,
పగని పెంచి హింసని రగిలించటం కాదు. మరో మార్గం వుందన్నాడు. ఆ పోరాటం మీకు తెలిసిందే కాకుంటే మెదడు
వెనుక వున్న చిన్న సైన్సు సంగతొకటి నేను చెపుతాను.
మొదడులో ‘అమిగ్డాలా’ ఎమోషనల్ గా స్పందనలను కలిగిస్తుంది దీన్ని ప్రభావితం చేయటం ద్వారా కండరాల్లోకి శక్తి ప్రవహింపజెయ్యోచ్చు. రెండోది ‘ధలామస్’ ఆలోచనా విశ్లేషణ ద్వారా విషయం పై అవగాహన పెంచుకునేందుకు దోహదం చేస్తుంది. 
అర్జునుడికి తనముందున బంధుమిత్రసోదరసైనిక సమూహాలను చూడంగానే మదిలో వీరందరినీ చంపాలా అనే అలజడితో దిగిపోయినపుడు కృష్ణుడు కూడా చేసిన పని అమిగ్డాలాపై కాదు థలామస్ పైనే బహుశా నాకు తెలిసినంతలో యుద్ద ప్రక్రియలో థలామస్ ను గాంధీకంటే ముందు వాడింది. క్రిష్ నే కావచ్చు. అమిగ్డాలా మీదనే కృష్ణుడు పనిచేయాలనుకుంటే అంత కష్టపడి గీత స్పీచ్, మాక్రో మెటా మార్ఫాసిస్ కాకుండా సింపుల్ గా ‘‘ వురే సాలా (బామర్దే కదా) నీ పెండ్లానికి సైటేసిండు, నీ సైటు లాక్కుండు ఏంద్రా బై ఇంకబీ సోంచాయిస్తవ్’’ అని నాలుగు తిట్లు, ఐదారు ప్లాష్ బ్యాక్ లూ చూపించేస్తే నరాలు ఉప్పొంగి, దవడకండరం బిగుసుకుని కళ్ళు ఎర్రబడి ఒక్కొక్కడు కాదురా వంద మంది బెదర్సూ వచ్చెయ్యండి ఇక్కడెలాంటి అదుర్సూ లేదనే వాడు. 
ఈరోజుకీ  దేశదేశాలలోకి వెళ్ళి వ్యక్తిత్వవికాసానికి ఇవి పాఠాలుగా పనిచేస్తున్నాయంటే, అపర పాశ్చాత్యులనే లా బిరుదులిచ్చే దేశంలో సరిహద్దు గాంధీ, మరో దేశం గాంధీ అంటూ పేర్లు పెట్టుకునేలా ఆ రెండక్షరాలు నిలబడ్డాయంటే, ఈ రోజు అవే రెండక్షరాలను పేర్ల చివర మోస్తూ ఎంత బురద పూసినా నోట్ల పై బోసినవ్వులా చెదరకుండా జనం హృదయాలలో నిలబడటం వెనక అతీంద్రియ శక్తికాదు. శాస్త్రీయంగా ఉపయోగించన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన యుద్ద నైపుణ్యమే వుంది.

మరి మన నేటి పోరాటాలలో 

విడిపోవాలా కలిసుండాలా అనేది ఆలోచించామా, అనుకున్నామా?
యుద్ద తంత్రంలో భాగంగా ఎమోషన్స్ రగిలితే కాలిపోతున్నది ఎవరు?
సర్లే చెప్పొచ్చావ్ ఇంతకంటే ఏంచెయ్యలి? కర్రవున్న వాడిదే బర్రె పోరాడితేనే వింటున్నారు. ప్రజాస్వామ్యమనే పిల్లల పెంపకంలో ఎవరు ఎక్కువగా ఏది కావాలని గొడవ చేస్తే అదే దొరుకుతుంది. నోరు మూసుకునే కూర్చుంటే అరిచి గీ పెట్టే వాళ్ళకు ఇచ్చేస్తారని మా పేరెంట్స్ గురించి నాకు తెలిసింది అంటున్నారు. 

ఏం జరిగి వుండాల్సింది?

గ్రామాలలోనైనా చూస్తాం వేరు కాపురం పెడతామంటేనో, విడిపోతామంటేనో అలా అనేవాళ్ళ దగ్గరనుంచి మొదట వాళ్లు ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చారో వినాలి. పరిష్కారంగా వారుచెపుతున్న విడిపోవటం ద్వారా నిజంగానే ఫలితం వస్తుందని కనీస అంచనాలతో నిర్ధారణకు రావాలి ఆ సమూహం మొత్తం అభిప్రాయం అదేనా కాదా తెలుసుకోవాలి. ఇతర ఆఫ్షన్లు వేరే ఏమీ చెప్పబోతున్నారు అనేదీ అడగాలి. అలా వద్దని చెప్పేవారు  విషయాన్ని గుర్తిస్తే దాని పరిష్కారంగా కనీసం ఇప్పటినుంచి ఎటువంటి సూచన చేయబోతున్నారో సరిచూసి నిర్ధారించుకుని చూడాలి. ఆ తర్వాతే పరిష్కారానికి ఆలోచించాలి నిజానికి ఇవ్వన్నీ జరిగాయా కమిటీలు నాయకుల మాట వింటే సరిపోతుందా. పార్టినాయకులు ఇద్దరు వస్తే ఒకరి కొకరు సంభందం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు. ఓట్టవేట లాగానో, అస్థిత్వాలను నిలబెట్టుకునే పోరాటాలుగానో జరిగే ఈ ఆటలో కోటలోంచి చూస్తూ ఆడుతున్న చదరంగంలో అమిగ్డాలలను రగిలించుకుని తగలబడుతున్న సైనికులెవ్వరు.
నిజానికి పెద్ద యింట్లో గదుల మధ్య గోడలు కొంచెం అటూ ఇటూ జరిపితే జరిగే లాభం ఎంత, ప్రమాదం ఎంత? అభివృధ్ధికి నిజంగా ఈ జరిపే గోడలూ, జరిగే గొడవలూ సమాధానమేనా ? అప్పుడో ముక్క అప్పుడో ముక్క చేస్తూ తక్కిడి బిక్కిడి తక్కెట లాటకంటే పరిపాలనా వికేంద్రీకరణతో జిల్లావారీ పరిపాలన కోసం మేధావులు మరికొంచెం ఆలోచించ కూడదా?
నా తరాన్ని ఎవర్రా ఇలా తగలబెడుతున్నవారు?
ఎందుకు పేరెంట్స్ అవసరమైనదేదో ఆలోచించకుండా గొడవలను ఎగదోసేలా చాక్లెట్స్ పంచుతారు?
తమ్ముళ్ళూ అన్నలూ రేపే కాదు ఇవ్వాల్టి మీరుకూడా మాకు అవసరమే, ఉండండిరా బతికుండండిరా అమ్మానాన్నల ఆశలు చిదిమేసి, రేపెప్పుడో దీపం పెడదామని చూడకండ్రా.

ఏదో జరగాలి ? ఎవరు తొలి అడుగెయ్యాలి ? 

Advertisements
Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s