Numismatics

దమ్మిడీ అంటే ఎంత ?

1 దమ్మిడీ ( pie) = 1/12 అణా
 ( ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 0.520833 నయాపైసలు )

స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పదేళ్ళవరకూ భారతీయ ద్రవ్య విధానం రూపాయికి 16 అణాల పద్దతిలో వుండేది. అర్ధ రూపాయంటే ఎనిమిది అణాలు,  పావలాకు నాలుగు అణాలు రెండు పరకలు అంటే ఒక అణా, నాలుగు కానీ (Pice) అయితే ఒక అణా అప్పుడు ఒక పైస్ అనేది ఇప్పటి 1.5625 నయాపైసలకు సమానం అప్పుడు అణాలో 12 వంతు భాగాన్ని దమ్మిడీ అనేవారు.

1 రూపాయి = 16 అణాలు ( తర్వాత 100 నయాపైసలు )
1 అర్ధ రూపాయి = 8 అణాలు లేదా 1/2 రూపాయి ( తర్వాత 50 నయాపైసలు )
1 పావలా = 4 అణాలు లేదా 1/4 రూపాయి ( తర్వాత 25 నయాపైసలు )
1 బేడా = 2 అణాలు లేదా 1/8 రూపాయి ( తర్వాత 12.5 నయాపైసలు )
1 అణా = 1/16 రూపాయి ( తర్వాత 6.25 నయాపైసలు )
1 పరక = 1/2 అణా ( ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 3.125 నయాపైసలు )
1 కానీ(pice) = 1/4 అణా ( ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 1.5625 నయాపైసలు )
1 దమ్మిడీ ( pie) = 1/12 అణా ( ఇప్పటి లెక్కల ప్రకారం  0.520833 నయాపైసలు )


ఇది గొప్పగానే అనిపిస్తుంది గమనించండి
కానీ రూపాయిని లెక్కలేనన్ని బాగాలుగా చేసుకున్నా ఆ భాగాలకూ మార్పిడిలో వస్తువులు వచ్చేవి. డాలరు కంటే రూపాయి విలువ ఎక్కువగా వున్న రోజులవి.

1957లో దశాంక విధానం అమలులోకి వచ్చింది. అప్పుడు రూపాయికి 100 పైసల లెక్క కాబట్టి అప్పటి నుంచీ లెక్క బెట్టే పైసలు వేరేవి అందుకే ఆర్ధం లోనే పైసలను నయా పైసలు (కొత్త పైసలు) అని పిలిచేవారు.

రెండు అణాలు అయితే ఒక బేడ (ఇప్పటి నయాపైసల కొలతలో 12.5)

Four Annas and Eight Annas Coins

అణాలో సగభాగం  పరక (ఇప్పటి నయాపైసల కొలతలో 3.125)

One Quarter Anna
One Pice
One Anna
అణా నాణెలపై తెలుగు భాష కూడా వుంది
గమనించారా?

   

Naya Paisa
One Pice 1943
వ్వవహారంలో నాణేల గురించి

పదహారణాల ఆడపిల్ల (ఒక్క అణాకూడా తగ్గకుండా నిండా రూపాయి అని)

క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు.(కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికేలేనట్లే కనిపిస్తారు, కానీ వారు చేసేపని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళను ఉద్దేసించి అనేదే ఈ సామెత)
దమ్మిడీకి కొరకాడు ( అణాలోనే పన్నెండవ వంతయిన అత్యంత తక్కువ విలువున్న దమ్మిడీకి కూడా పనికి రాడని)
ఆచారి పిలక ఆరణాలు ముడిప్పదీస్తే మూడణాలు ఎత్తేస్తే ఏడణాలు మొత్తం కలిపితే(6+3+7) రూపాయ్.

( నోట్ : పైన చిత్రంలో చూపిన నాణేల అసలు సైజుల వేరుగా వుంటాయి వాటి పరిమాణాలను అనుసరించి బొమ్మలను చూపలేదని గమనించగలరు)

Advertisements
Standard

5 thoughts on “దమ్మిడీ అంటే ఎంత ?

 1. పాత కాలపు నాణేల బొమ్మలన్నీ సేకరించి వ్రాసేరు.బాగుంది. కాని వ్యాసంలో కొన్ని తప్పులు దొర్లేయి.రూపాయకు 100 పైసల లెక్కన దశాంశ మానం మనకి 1956 ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వచ్చింది.అణాకు ఆరు పైసలంటూ ప్రారంభించేరు.పాత పధ్ధతిలో పైసలే లేవు.అణాకి నాలుగు కానులు.కానీకి మూడు దమ్మిడీలు. ఈ దమ్మిడీలు మనకి స్వరాజ్యం వచ్చేనాటికే చలమణీలోంచి కనుమరుగయిపోయాయి. లెక్కల్లో మాత్రమే మిగిలాయి.రూపాయకు పదహారణాలు కనుక 64 కానులు లేక 192 దమ్మిడీలు.మీరు ఏడో బొమ్మలో చూపించినవి పెద్ద కానీలు.దమ్మిడీలు వ్యవహారంలో లేవు కనుక కానీలే అతి చిన్న నాణేలు.రాగితో చేయబడి ఇప్పటి మన రూపాయ కాసంత ఉండేవి.రెండవ ప్రపంచ యుధ్దకాలంలో రాగి వాడకం తగ్గిచడానికి దాని సైజు తగ్గించి మద్యలో చిల్లి పెట్టారు. అవే మీ బొమ్మ లో ఉన్న చిల్లి కానీలు.ఇవన్నీ వాడిన వాళ్ళం కనుక ఈ విషయాలు చెప్ప గలుగుతున్నాను

 2. Pantula gopla Krishna rao garoo మీరు సహృదయంతో స్పందించినందుకు ధన్యవాదాలు కానీ మీరు అనుకున్న ఆదారాలను మరోసారి సరిచూసుకోవాలి. పొరబడ్డారు రెండు విషయాలలోనూ
  1) దశాంశ పద్దతి 1956 నుంచి కాదు 1957 నుంచి అమలులోకి వచ్చింది.
  2) వందపైసల లెక్క అప్పటి నుండే వచ్చినప్పటికీ పైసా అనే ప్రమాణం అంతకు ముందు నుంచీ వుంది. దీని మరీ ప్రభలమైన ఆధారంగా 1957 కంటే ముందునాటి పైసాలను కూడా పైన పిక్చర్ లో కూడా ఇచ్చాను గమనించండి. బహుశా మీ దగ్గర వున్న పైసలలోకూడా స్వాతంత్రానికి ముందునాటి పైసలు కూడా దొరక వచ్చు చూడండి.

  A pie was a unit of currency in India that is no longer in use. It was the smallest currency unit, equal to 1/3 paisa, 1/12 anna or 1/192 rupee.

  ఈ పైసా అనే పదం మనదేశం లోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా ఒక యూనిట్ గా చలామణీలోవుంది. poisha (Bengali: পয়সা, in Bangladesh) and baisa (Arabic: بيسة‎, in Oman) అనే పదాల ఆధారంగా ఏర్పడి వుండవచ్చని చెపుతారు. సంస్కృతంలో పదాంశ (padāṁśa ) అంటే పావుభాగం నుంచి కూడా వచ్చి వుండొచ్చంటారు.

  In Hindi, Afghan Persian, and other languages, the word paisa often means money or cash

  The word pesa as a reference to money in East African languages

  స్వాతంత్య్రం రాక పూర్వం వున్న పైసల విలువకూ, అనంతరం రూపాయిలో వందో వంతుగా మరిన పైసకూ మధ్య వ్యత్యాసం వుందని చెప్పేందుకే నయాపైసా అనే పదం వాడుకలోకి వచ్చిందండీ.

 3. శ్రీనివాస్ గారూ, దమ్మిడీ అంటే ఎంత అనే మీ పోస్టుమీద నా స్పందన (30.8.2013) కు మీ ప్రతిస్పందనను నేను ఇన్నాళ్లూ చూడలేదు. మా అమ్మాయి సుధారాణి ఈ రోజు మనం చెప్పిన వాటిల్లో ఏది సరైనది అని అడిగితే ఇటు వచ్చి చూసేను. నాకు తెలిసిన సరైన వివరణ ఇస్తున్నాను.
  దశాంశ పధ్ధతి అమలులోకి రావడం 1956 కాకుండా 1957 కావచ్చును.నేను గుర్తు మీద వ్రాసేను. మీరు ఎక్కడైనా చూసి వ్రాసి ఉంటే మీరే కరెక్టు కావచ్చును.నాకేమీ పేచీ లేదు.
  పైసల విషయంలో మాత్రం ఇంకా మీరు పొరబడుతున్నారేమో నని చెప్పక తప్పదు.
  వివరిస్తాను.
  మీరు అణాకు ఆరు పైసలంటూ మొదలెట్టారు.అంటే అవి రూపాయకు 96 కావాలి. అటువంటి లెక్క ఏనాడూ లేదు. మీరు మీ వ్యాసం చివర్లో ఇచ్చిన పట్టికలో Paisa అనీ Pie అనీ పేర్కొన్నవి వరుసగా కానీ దమ్మిడీలను సూచిస్తాయి. రూపాయకు 16 అణాలు, 64 కానులు 192 దమ్మిడీలు.మీ పట్టిక కూడా ఇదే చెబుతోంది.కనుక మీరు Paisa-పైసా- అన్నది కానీని, Pie-పై- అన్నది దమ్మిడీని.మీరు చిత్రంలోే చూపించిన One Quarter of Anna అన్నది కానీయే. అది పెద్ద కానీ. Pice అని మధ్యలో చిల్లులో ఉన్నవి చిల్లు లేక కన్నం కానీలు. ఇవి అణాకి నాలుగే. (అణాకు ఆరు చొప్పున) రూపాయకు 96 (16 X 6) వచ్చే ఏ నాణెం బొమ్మనీ మీరు చూపించలేదు. అసలు అటువంటి నాణెమే లేదు. దశాంశ మానం అమలు లోేకి రాక పూర్వం లెక్కల్లో రూపాయలు అణాలు పైసలే ఉండేవి. పైసలంటే దమ్మిడీలే. రూపాయలోే 192 వ భాగం. ఇవి అణాకు పన్నెండు.లెక్కల్లో ఇవి ఉన్నా ఇవి స్వతంత్రం రాకముందే వాడుకలో కనుమరుగయ్యాయి.కానీ లే ( అణాలో నాలుగో వంతు) చలామణీ లో ఉండేవి. తెలుగు వాళ్ళం మనం వీటిని దమ్మిడీలని పిలుచు కున్నాఉత్తరాదిలోే అంతా వీటిని పైసా లనే వారనుకుంటాను.( ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.దమ్మిడీల కంటే పూర్వం ఠోలీలనే నాణేలు వాడుకలో ఉండేవిట.ఇవి కానీకి రెండో దమ్మిడీకి రెండో ఉంటేవిట.వాటిని డభ్భయి యేళ్ళ క్రింతం నా చిన్నప్పుడే నేను చూడలేదు వినడమే కాని.),
  అణాకి ఆరు లెక్కన వచ్చే పైసల గురించి నేను వినలేదు. చూడ లేదు. మీ పట్టిక లో కూడా అటువంటివి లేవు.అణాకి ఆరు పైస లంటే నయా పైసలే.పాత కొత్త నాణేల వినిమయంలో అణాకు 6 నయా పైసలిచ్చే వారు. నయా పైసతో సరిపోయే పాత పైసలేవీ లేవు. ఉన్నవి దమ్మిడీలే.అవే ఆ కాలం నాటి పైసలు.

 4. పంతుల గోపాల కృష్ణా రావు గారికి నమస్తే
  ముందుగా పోస్టును శ్రధ్దగా పట్టించుకుని మీ అనుభవాల నేపద్యంలో సరిచూసినందుకు ధన్యవాదాలు. నిజమే మా వయసుకు ఆధారాలను వెతుక్కుని మాత్రమే రాయగలం కదా. దశాంశ మానానికంటే ముందు నుంచే పైసలున్నాయనేది సరైన ఆధారమే అని నేననుకుంటున్నానండీ. కాకపోతే మీరన్న రెండవ విషయం పైస్, పై, నయాపైసల మధ్య సరిపోల్చటం అనవసరపు గందరగోళం అవుతుంది. ఆ భాగాన్ని తొలగించి మిగిలిన డినామినేషన్లకు కూడా ఇప్పటి దశాంశ విధానం ప్రకారం (నయాపైసలలో ) ఎంత విలువ వుంటుందో అనేది మాత్రం ఇచ్చాను.

  ఇది కూడా గమనించండి. మీ దగ్గర మరింత రిఫరెన్స్ కి ఉపయోగపడే సమాచారం వుంటే దయచేసి పోస్టు చేయండి. ఒక వేళ అప్పటి ఠోలీ కాయిన్ లాంటివి వుంటే షేర్ చేయండి. మా తరానికి కొత్త విషయాలు అవుతాయి.
  ధన్యవాదాలతో మీ శ్రీనివాస్
  నా మొయిల్ nivas.katta74@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s