Hyderabad

భాగ్య నగర నిర్మాణం : కుతుబ్ షా ప్రార్ధన

మనకోసం స్వంత ఇల్లు కట్టుకునేందుకు పునాది రాయి వేసే రోజు ఏమని కోరుకుంటాం. బహుశా తక్కువ ఖర్చులో, నాకు అత్యంత సౌకర్యవంతంగా, పోరుగు వాళ్ళు ఈర్ష్య పడేంతా బాగా నా ఇల్లు వుండాలి అనేనేమో, మరి నగరాలనే నిర్మించాలనుకున్న మహారాజులు ఏమని ప్రార్థిస్తారు. అప్పటికే కట్టిన నగరాన్ని ఆక్రమించి తయారుగా వున్న సింహాసనంపై కూర్చోవటం కాకుండా కోటలే కాదు నీటి అవసరాలే కాదు స్వంత ఇల్లు కట్టుకున్నట్లు మొత్తం నగరాన్ని ఒక్కోక్కటిగా నిర్మించాలను కున్న వాళ్ళు ఏమని ప్రార్ధిస్థారు. 


అప్పటి రాజధానిగా వున్న గొల్కొండ జనాభా అవసరాలను తీర్చేందుకు చాలటం లేదని ఒక కొత్త నగరాన్ని మొత్తంగా నిర్మించాలనుకున్నాడు. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా.  నగరానికి పునాది రాయి వేసేరోజు ఆ ఐదవ నిజాం సుల్తాన్ ఏమని ప్రార్ధించాడో చరిత్ర తన మనసులో నాలుగు వందల సంవత్సరలకు పైగా ఇంకా పదిలంగా దాచుకునేవుంది.సముద్రంలోకి చేపలన్నీ ఏవిధంగా వచ్చి చేరతాయో అలా 

ఈ మహానగరానికి లక్షలాదిగా 

అన్ని కులాల, 
అన్ని మతాల, 
అన్ని రకాల సిధ్ధాంతాల 
స్త్రీలూ, పురుషులూ పిల్లాపాపలతో వచ్చి ఆనందంగా నివసించేలా ఈ నగరాన్ని ఆశీర్వదించు భగవాన్….అతని ప్రార్ధనను ఏ దేవుడో, లేదా ఆశీర్వదించగల మహత్తరమైన శక్తి ఏదో విన్నట్లే వుంది. ఆ ప్రార్ధనలో ఒక్క అక్షరం వృధాపోకుండా ఈ నాటి వరకూ నగరం దినదిన ప్రవర్ధమానమవుతూ కోట్లాది జనాలకు ఆవాసమై, ప్రపంచవ్యాప్త గుర్తింపుని పొందుతూ వస్తోంది.

అన్ని కులాలూ వున్నాయిక్కడ, అన్ని మతాలూ వున్నాయి. నిజానికి ఎక్కడో దేశం నుంచి వచ్చిన జొరాస్ట్రియన్లు సైతం ఇక్క గుండెల మీద చేయేసుకుని తమ సంతతిని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా తమతమ వారసత్వ చిహ్నలను నిర్మించుకున్నారు. భారతదేశంలో ఎంతైతే భిన్నత్వంలో ఏకత్వం వుందో అంతటి ఏకత్వాన్ని చూపుతూ మసీదులూ, గుడులూ, గురుగ్రంధ్ సాహెబ్ లూ ఇన్నీ అన్ని మతాల దేవాలయాలనూ తన గడ్డపై వెలుగొందుతుంటే తన నవ్వులతో ప్రకాశవంతం చేస్తోంది. ఒక స్వేచ్చానగరంగా ఎలా వుండాలని సుల్తాన్ తమ మనసులో అనుకున్నాడో అదే విధంగా సరిహద్దులెరగని విశాలతతో విలసిల్లుతూ వస్తోంది. 

చెరువులెండిపోయే రోజులు, గాలాలూ వలలూ మరబోట్లూ తిరుగాడే రోజులు, సమతుల్యతలు దెబ్బతింటున్న రోజులు ఏమో ఈ చెరువూ, ఈ చేపలూ మరెంత కాలం సంతోషంగా వుంటాయో, ఈ దీవెనకు కూడా ఎక్స్ పైరీ డేటు వుంటుందా? గోల్కొండ నిండితే భాగ్యనగరం నిర్మించుకున్నట్లు, ఇప్పుడు భాగ్యనగరం పొంగి పొర్లితే మరి కొన్ని నగరాలుగా పరావర్తం చెందనుందా? ఏమో ఎదురు చూడాలి కుదిరితే మనమూ ప్రార్ధించాలి రవీంధ్రునిలా where the mind is with out fear, అని. ఓ తండ్రీ అటువంటి శాంతి సమున్నత స్థితిని జనలందరికీ కల్పించు. 

Let millions of men and women of all castes, creeds, and religions make it their abode, like fish in the ocean.


Standard
telugu poetry

ఖాళీలను పూరించొద్దు

మంచి జీర్ణానికైతే
పదార్ధమూ, ద్రవమూ కాకుండా సంచిలో

కొంత ఖాళీ వుంచాలి.

మంచి జీవితానికేమో
పని, విశ్రాంతే కాకుండా మదిలో

కొంత ఖాళీ వుండాలి.మంచి వ్యక్తీకరణకూ అంతే
అక్షరమూ,పదమే కాకుండా

సరైనా ఖాళీ వుంటుండాలి.

బంధానికీ ఎదుగుదలదగ్గరా,
స్నేహానికీ మలుపున్న తోవన
వ్యసనానికీ గతితప్పే తావున
అందానికీ విలువందని చోటున,
విలువకూ బ్రతుకెళ్ళని మూలన,
సంఘర్షణలో రాపడి క్షయంచేయనంత దూరంగా
ఆనంతానందంలో …………………….
.
.
.

అవసరమైన చోట   ఖా   ళీ   లు     ఉంటుండాలి.

కవిసంగమంలో

Standard
సమీక్ష, telugu poetry

గోండి భాషా దినోత్సవం : గిరిజన భాషలకు లిపి వుంటే లాభం ఏమిటి?

గొండ్లి అంటే అది గోండులచే చేయబడే నృత్యంగా పేర్కొన్నారు
ఖర్మ నృత్యమంటే వర్షరుతువు ప్రారంభమయ్యే రోజుల్లో 
పంటలు బాగా పండాలని రైతులు చేసే ధర్తీమాత ఆరధనా నృత్యమిది.
ఖర్మ నృత్యంలో బాగా చిరురించినవిప్ప కొమ్మను తీసుకువచ్చి, 
ఇల కొత్త గుడ్డలో వుంచి వారి వారి ఇళ్ళలో వుంచుతారు, 
వారు అనుకున్న రోజున పెద్ద పండగ చేస్తారు. 
అందరూ ఆనందంగా విందు భోజనాలు చేస్తారు. 
తరువాత, జంత్ర వాయిద్యాలు, మృదంగ శబ్దాలు మ్రోగు తుండగా, 
స్త్రీలూ పౌరుషులూ కలిసి ఆ విప్ప కొమ్మల చుట్టూ తిరుగుతూ, 
ప్రేమ గీతాల్నీ, ప్రకృతి రామణీయక గీతాల్నీ పాడుతూ 
అద్భుతంగా నృత్య చేస్తారట. 
దీనిని వారు ఖర్మనృత్య మంటారు

గుంజాల గోండి లిపి దినోత్సవ సందర్భంగా

గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.

గోండులు అతి ప్రాచీనమైన తెగకు సంబంధించిన వారు. వీరిది ప్రాచీనమైన సంస్కృతీ వికాసం గల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో రాజ గోండులు ముప్పై ఆరు సంస్థానాలను స్థాపించుకుని చత్తీసు ఘడ్ పేరుమీద రాజ్యపాలన చేశారు.

ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఘడ్ గా పిలువబడుతూ వుంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోడులు పాలించారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నె మండలం గుంజాల అనే గ్రామంపై ఇప్పుడు అనేకమంది భాషా పరిశోధకుల దృష్టి పడింది. ఓ పది రాత పుస్తకాలతో ఆ ఊరిప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ రాత పుస్తకాలు ఏమిటి? అందులో ఏముంది? గిరిజన గోండులు ఐదారు రాష్ట్రాలలో ఉన్నారు. చాలా గిరిజనజాతులకు అత్యంత ప్రాచీన భాష ఉంది. కానీ లిపులు లేవు. అందుకే అవి చాలా వరకు నోటి భాషలే. ఆ నోటి భాష కూడా అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తరువాత సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. గత యాభై ఏళ్లుగా చదువుపేరిట ఇంగ్లిషు కూడా దానిపై స్వారీ చేస్తున్నది.
మైదానప్రాంతాల ప్రజలకు దూరంగా, నాగరిక వాతావరణానికి భిన్నంగా, అడవుల్లో నివసించేవారు గిరిజనులు. నిజాం నవాబు అమల్లోకి తెచ్చిన అటవీ చట్టాల ఫలితంగా గిరిజనులు సాగుచేసుకున్న భూమి కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల వారు తాము ఉన్న చోటినుండి మరింత అడవి లోతట్టుకుపోయారు గిరిజనులు సాగుచేసిన భూముల్ని, మైదాన ప్రాంత భూస్వాములు హస్తగతం చేసుకున్నారు. భూస్వాములు, ఆ భూములపై పట్టాలు సంపాదించుకున్నారు. ఈ తతంగానికి వ్యతిరేకంగా భూమిపై అధికారాన్ని వదులుకోకుండా వుండడానికి గిరిజనులు అడవిని అంటిపెట్టుకుని ఉండడానికి రాజ్యాధికారం కావాలని భావించారు. అందుకే కొమురంభీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. అనంతరకాలంలో పోరాటం అణచివేయబడింది. హైమన్ డార్ఫ్ అనే శాస్తవ్రేత్తను నివేదిక తయారుచేయమని నిజాం కోరాడు. అతని సంస్కరణల మేరకు గిరిజనులకు భూముల పట్టాలు దొరికాయి. లోతట్టు అడవిలోని భూములపై గిరిజనులకు అధికారం లభించింది. ఆ విధంగా అడవిలో గిరిజనులు, గిరిజనేతరులు కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమాయకులైన గిరిజనులను మైదాన ప్రాంత షావుకార్లు మోసం చేసేవారు.
అయినా అది తట్టుకుని నిలిచింది. చాలా గిరిజన భాషలు మార్పునకు లోనై సాంకర్యంతో కళవెళ పడుతున్నాయి. ఈ సందర్భంలో గుంజాలలో పది రాత ప్రతులు లభించాయి. అదీ గోండీ లిపిలో చేతితో రాసిన ప్రతులు. దీనికే ‘గుంజాల గోండీ లిపి’ అని పేరు. వందేళ్ల క్రితం ఆ ఊరిలో ఈ లిపి ప్రచారంలో ఉండింది. ఈ లిపి సృష్టికర్త ఎవరన్నది నిర్దిష్టంగా చెప్పలేం. ఆ సమాజమే దీన్ని సృష్టించుకున్నది. అయితే మూడు తరాల కింద ఈ లిపిని ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం గుంజాలకి చెందిన పెందూర్ లింగోజి, కుంరా గంగోజి. వీరు ఒక పాఠశాల ఏర్పాటు చేసి దీన్ని నేర్పారు. అలా 60-80 ఏళ్ల కింద నేర్చుకున్న కోట్నక్ జంగు, కుంరా విఠల్, అర్క జైవంత్, కంరా లాల్‌షావు, అర్క కమలాబాయి ఇప్పటికీ ఉన్నారు.
వారు చదవగలరు, రాయగలరు. కమలాబాయి వయస్సు ఇప్పుడు తొంభై ఏళ్లు పైనే ఉంటుంది. దృష్టి మందగించినా ఆ రాతను చూసినప్పుడు ఆమె కళ్లల్లో మెరుపులు. ‘మా భాష మాకు కావాలి. అది మాకు గర్వకారణం’ అంటుందామె. పదేళ్ల వయసులో ‘బిడ్డా! ఇది మన లిపి. దీన్ని చదువు. కాపాడు’ అని ఆమె తండ్రి చెప్పాడట. అందుకే ఆమె ఈ లిపిని కొడుక్కి, మనవరాలికి కూడా నేర్పింది. గిరిజనులకు విద్య దూరం అనుకునే శిష్ట సమాజం నివ్వెరపోయే విషయం ఇది.
ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఆరు వేల భాషలున్నాయి. మన దేశంలో పదహారు వందల యాభై భాషలు ఉన్నట్లుగా అంచనా. ప్రస్తుతం అవి ఎనమిది వందలకు చేరిందని భాషావేత్తల అభివూపాయం. సుమారు ఇరవై ఐదు భాషలకు మాత్రమే లిపి, సాహిత్యం ఉంది. మిగితావన్నీ మౌఖికంగానే ఉన్నాయి. ఒక భాషకు లిఖిత రూపం రావడమంటే అంత సులువైన పని కాదు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక సాంస్కృతిక జీవనానికి నిలు నిదర్శనంగా లిఖిత రూపం వుంటుంది.

గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక 

ఈ రాత ప్రతులను మొదట చూసినప్పుడు మరాఠీనో, దేవనాగరి లిపో అనుకున్నాం. కానీ, అది ఒక విలక్షణమైన లిపిగానే కనిపించింది. అందుకే ఆ లిపిని గోండు పిల్లలకు నేర్పించాలని భావించాం. ఏడాదికింద అఖిల భారత గోండ్వానా గోండి సాహిత్య పరిషత్ జిల్లా మహాసభ జరిగింది. ప్రతి ఏడాది జనవరి 27 గుంజాల గోండీ లిపి దినోత్సవం జరపాలని అప్పుడు నిర్ణయించారు. ఈ ఏడాది కూడా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు తరవాత భాషా దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత గోండులదే. గుంజాల లిపే వారికి ఆ ప్రేరణ.

‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఐటీడీఏ ఉట్నూరు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్’ (సిడాస్ట్) సహకారంతో మొదటిసారిగా గోండీ లిపిలో మొదటి వాచకం అచ్చేస్తున్నారు. గుంజాల గ్రామంలో లిపి అధ్యయనం కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ఆఫీసర్ జే. నివాస్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ లోగా సిడాస్ట్ గుంజాలకి ఒక పరిశోధక బృందాన్ని పంపింది. జయధీర్, ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో గోండీ లిపిలోని రాత ప్రతులను హిందీ, తెలుగు భాషలలోకి అనువాదం చేసే పని అక్కడ జరుగుతోంది. ఈ లిఖిత సమాచారంలో గోండీ ప్రజల ఆచారాలు, చరిత్ర వెల్లడవుతున్నాయి. ఈ లిపిపై గోండీ పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. ఆరో తరగతి చదివే విఠల్ రెండో తరగతి చదివే పిల్లలకు, ఈ లిపిలో అక్షరమాలను, గుణింతాలను నేర్పుతున్నాడు. లాల్‌షావు (75) కోట్నక్ జంగు (72) తమ ఆత్మకథలను గుంజాల గోండి లిపిలో రాస్తున్నారు. వాటిని శ్రీధర్ శ్రీకంఠం తయారుచేసిన సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ లిపిలోనే డీటీపీ చేసి పుస్తకం ముద్రించేందుకు రంగం సిద్ధమైంది.

అంటే గోండీ లిపిలో, గోండీ భాషలో అవి మొదటి ఆత్మకథలు అవుతాయి. ఎం.ఏ (తెలుగు) చదివిన కోట్నక్ వినాయక్ తెలుగు నుంచి గుంజాల లిపిలోకి అనువాదం చేయగలడు. అతని సహాయంతో గుంజాల గ్రామంలో లిపి అధ్యయన కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఒక గోండీ భాషా పాఠశాలకు అంకురార్పణ జరుగుతున్నది. అనువాదం పనిలో ఉండగా గోండీ-తెలుగు భాషలకున్న అనుబంధాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. వందలాది గోండీ పదాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా మూలాలే కాదు, సాంస్కృతిక, చారిత్రక లోతులు కూడా తెలుస్తాయని నమ్మకం. బౌద్ధుల నలందలాగా గోండీ లిపి భాషా విషయాలకు గుంజాల కూడా విశ్వవిద్యాలయంగా ఎదగాలని కోరుకుందాం.

కొన్ని గోండీ భాషా పుస్తకాలను ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ధన్యవాదాలు
 సాక్షి పత్రికలో  జయధీర్ తిరుమలరావు గారి వ్యాసం
కొండ బతుకులు.. గోండు కథలు బివిఎన్ స్వామి గారి వ్యాసం
ఆదివాసీ భాషల మాటేమిటి? – ప్రొ. భంగ్యా భూ

Standard
Videos

1 లో అమ్మపాట రైమ్

1 (నేనొక్కడినే) సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే రైమ్ ఇది. స్కూల్ బస్ తప్పిపోతే ఇంటికి ఎలా చేరుకోవాలో కొన్ని కొండగుర్తులను కలిపి వాళ్ళమ్మ తయారు చేసిన రైమ్. పిల్లలకు న్యుమోనిక్ కోడ్స్ కొన్నిసార్లు బాగా ఉపయోగపడతాయి. నయమే ఈ సినిమాలో పిల్లాడు పెద్దయ్యేంత వరకూ హంసలున్న చెరువు, చెట్లూ వగైరా రోడ్ల వెడల్పులోనో, నగర బ్యూటిఫికేషన్ లో భాగంగానో కొట్టేసేయ లేదు.

0==========================0


పీటరు తాత స్ట్యాట్యూకీ
బై బై బై….. బై బై బై

హంసల ప్రెండ్సుకి హై చెప్పెయ్ 

హాయ్ హాయ్ హాయ్ ….. హాయ్ హాయ్ హాయ్


ట్రీస్ కి మధ్యన రోడ్డుంది
రన్ రన్ రన్…. రన్ రన్ రన్

స్ట్రెటుగ వస్తే టవరుంది… 

ఇట్స్ సో హై.. టిల్ ద స్కై


రైటుకి వెళ్తై హాంగిగ్ బ్రిడ్జ్..
ప్లై ప్లై ఫ్లై …. ప్లై ప్లై ఫ్లై

అది దాటొస్తే బ్యూటీ ఫామ్

 గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్

Peter Thatha Statue Ki 

Bye Bye Bye… Bye Bye Bye…!

Hamsala Friends ki Hai Cheppey… 
Hai Hai Hai … Hai Hai Hai…

Trees Ki Madyana Road Undi… 
Run Run Run … Run Run Run…

Straight ga vasthe tower undi…
Its So High .. Till The Sky

Right ki velthe Hanging Bridge…
Fly Fly Fly … Fly Fly Fly…

Adi Daatesthe Beauty Farm.. 
Green Green Green….
Standard
Hyderabad

హైదరాబాద్ లో మెదటి రిపబ్లక్ డే ఎలా జరిగింది?

ఏడివ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వాహనంలో 

అప్పటికి భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేత్రుత్వంలోనే నడుస్తోంది. భారత ప్రభుత్వం ఈయనను ‘‘రాజ్ ప్రముఖ్ ’’ గా సత్కరించింది.

ఏడవ నిజాం, రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ ముఖ్యమంత్రిగా నియమింపబడిన యం.కె.వెల్లోడి తో కలిసి 1950 జనవరి 26 నాటి రిపబ్లిక్ డే ఉత్సవాలను పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. కింగ్ కోఠీలోని తన భవంతినుంచి ప్రయాణమై పబ్లిక్ గార్డెన్ చేరుకున్నారు. తను రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించేలా అప్పటికప్పుడు ఒక నజం (nazm – గజల్ లాంటి ఒక ఉర్ధూ కవితా ప్రక్రియ వచనమూ, పద్యమూ కలగలిసినట్లువుంటుంది.)ను తయారు చేసుకున్నారు.
 ఆ పద్యం దేశంలోని ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలలో ప్రింటుకావాలని కోరుకున్నారు అందుకోసం ఆ పధ్యాన్ని ఆంగ్లాను వాదం చేయించవలసినదిగా కోరుతూ బొల్లారం లో వున్న అప్పటి ముఖ్యమంత్రి వెల్లొడి నివాసానికి పంపించారు. “I would like this poem to be published in English papers in India in commemoration of that historic declaration as it was an unique event in the annals of India,”. అంటూ సమాచారాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా చేరవేశారు. దేశ ప్రధాని నెహ్రూకూ, హోం మినిష్టర్ కూ దీనిని వినిపించవలసినదిగా కోరుతూ దేశ మంత్రిత్వశాఖా కార్యదర్శి వి.పి. మీనన్ కు కూడా పంపించారు. నెహ్రూ ఈ పద్యాన్ని ఆంగ్లాను వాదంతో కలిపి ప్రచురించవలసినదిగా పత్రికలను కోరారు.

మొదటి రిపబ్లిక్ దినొత్సవం సందర్భంగా హైదరాబాద్ ఏడవ నిజాం రాసిన పద్యం
Text of the poem Translated by Sir Nizamat Jung.
What splendour for our eyes – suspicious, fair!
What fragrance wafted on the morning air!
The tidings that from Delhi’s wails rang wide
Brought solace to all hearts, and joy and pride
To hearts released from bonds of caste and race –
Yea, hearts that only bend before God’s Grace.
How wondrous is the bond of Love! No heart
Disowns the spell it works by mystic art.
“Karbalas’ martyrdom” – love’s glorious meed –
proclaims what blessings crown the pure heart’s creed

‘Tis not the throned seat, the waving plume;
The heart’s the throne that golden deeds illume.
The feast’s prepared, the sparkling bowl o’erflows!
What joyous strains towards thee the Zephyr blows!
The new Dawn’s greetings, “OSMAN”, rich and strange,
And the four quarters hail the promised change!

పర్శియన్ ఒరిజినల్ ప్రతి
Standard
వివరణ

భారతీయ ప్రతిభా విశేషాలపై శాస్త్రీయ వివరణలు

భారతీయ ప్రతిభా విశేషాలు హైదరాబాదులోని వివేకానంద లైఫ్ స్కిల్స్ అకాడమీ ప్రచురించిన, జయంతి చంద్రశేఖర్ మరియు మన్నవ గంగాధర ప్రసాద్ సంకలనం చేసిన ఒక ప్రచురణ ఆసక్తికరంగా అనిపించింది. ఇందులో భారతీయ వైభవానికి సంబంధించిన 108 నిజాలు వాటి వివరాలు తెలిపారు.

ఇప్పటి సైన్సుకు దగ్గరగా ఏవేవి పొసుగుతున్నాయో చూస్తున్నారా? వున్నవన్నీ సైన్సుకి అనుకూలంగానే వున్నాయి అని చెప్పబోతున్నరా? లేక సైన్సు ఇప్పటికీ సమాధానం పొందలేని వాటికి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అని కూడా చూపగలుగుతారా?
వికిలో 107 జీన్స్ లాంటి టాపిక్స్ లిస్టులో ఇచ్చారు కానీ అవి ఈ వ్యూహానికి తగిన విధంగా విస్తరించిన వ్యాసాలు కాదు. సూర్యునిలో సప్తవర్ణాలుంటాయని సప్తాశ్వాలను చెప్పారనే లాంటి పోలికలు బావున్నాయి.


108 సంఖ్య ప్రాముఖ్యతను కూడా తెలుపుతూ

Standard
telugu poetry

చిల్లుల బుడగ

అందరూ అంగీకరించరు కానీ
ఎవ్వరో కానీ సెలబ్రేట్ చేసుకోలేరేమో కానీ
మరణం నిజంగానే చాలా పెద్ద పండుగ

ఆశల వత్తి ఆరిపోకుండా వెలుగుతుంటే
ప్రవహించే కన్నీళ్ళు తెడ్డువేయకుండానే నావను ముందుకు తోస్తుంటే
ఆశలూ ఆందోళనల బంధాలను తెంచుకుంటూ నిశ్చలంగా మిగలటం
జీర్ణించుకోలేముకానీ అది ఆకలి మరచిన నిండు వేడుక.

నీవే మరింత బలంగా తెలివిగా యువ్వనంగా
మరో రూపాల్లోకి ఒదిగి
నెమ్మదిగా కుబుసాన్ని విడిచినట్లు
ఒక పోరను విడిపించుకోవడం
అరే అసలే పెద్ద సంబురం.

అందరూ ఆలోచించరేమో కానీ,
ఎవ్వరో కానీ గుర్తించరేమో కానీ,
వేస్తున్న ప్రతి అడుగూ అక్కడికి చేరుకునేవరకే
గమ్యం చేరాక బరువుదిగిన హాయిని పోందే శ్రమకూడా పడాల్సిన అవసరంలేకుండా.

అనుకోం కానీ
ఆదమరస్తుంటాంకానీ
గొట్టం ఒక పక్కనుంచీ మరో పక్కకు పదార్ధాన్ని తోసుకెళుతూ
అగచాట్లుపడుతూ
గొట్టం బతుకుని గిరిదాటకుండానే రంగుకాగితాలకు కట్టేస్తుంటాం.

రెండు దేహాల పోషణలో
తాకే దానినే గోకుతుంటాం కానీ
నిండా కాలినా నిలబడివుండే రెండోదానికసలు మేతే వేయం

అనుకుంటాం కానీ
అంగీకరించినా కానీ
అనుకుంటూనే వున్నకానీ
దీపం ఆగిపోయేలోగానే
వెలుతురు చేతల్లో వుండగానే
వస్తువులేమీ సర్దుకోం.

22-01-2013   అక్కినేని గార్కి అశ్రునివాళి
Standard
History, Hyderabad, Personalities

మహాలఖా బాయి చాందా

నిజాం రాజ నర్తకీమణులు
నిజాం నవాబుల కాలంలో ప్రముఖ ఉర్దూ కవయిత్రి మహలఖబాయి. ఆమెను ‘చందాబీబి’ అని కూడా పిలిచేవారు. 

భారతదేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రిగా ఆమెకు పేరుంది.

నిజాం నవాబుల రాజనర్తకి, గాయని, కవయిత్రి మహాలఖా బాయి చాందా (మాహ్ అంటె చంద్రుడు, లఖా అంటె వదన = చంద్రవదన).
ఆమె వంశీయులు గుజరాత్‌కు చెందినవారు. 1వ శతాబ్దంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. మాహ్‌లఖా బాయి చందా తల్లి రాజ్‌ కన్వర్‌ బాయి. ఆమె హిందువు. ఆమె అన్న నైజాం సైన్యంలో ఉన్నతాధికారిగా పని చేసేవాడు. నృత్యం ఆమెకు ఆరో ప్రాణం. ఆస్థాన నర్తకిగా వున్నా వివాహం చేసుకుంది. భర్త తాజ్‌ అలీ షా. విభిన్న రంగాలలో ప్రతిభాశాలి. చిత్రకారుడే కాదు, చరిత్రకారుడు కూడా. వారి ఏకైక సంతానమే మాహ్‌లఖా బాయి. తల్లి నుండి నృత్యాన్ని, అందాన్ని తండ్రి నుండి కళాత్మక హృదయాన్ని, చరిత్ర గ్రంథాల యెడల మమకారాన్నే గాక మేన మామ నుండి ధైర్యాన్ని, వీరత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకుంది.
క్రీ.శ. 1764 ఏప్రిల్ 4న మహాలఖా బాయి హైదరాబాద్ నగరంలో జన్మించింది

. మాహ్‌లఖా బాయి జననమే ఒక వింత కథ.  ఆమె తల్లి ఆర్నెల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మౌలాలీ గుట్ట మీద ఉన్న ఒక సూఫీ సాధువు దర్గా సందర్శనకు పోయింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. భర్త తాజ్‌ అలీ షా ఒక్కడే పరిగెత్తి పైకి పోయి అక్కడి ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయింది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డ ‘మాహ్‌లఖా బాయి’ని కన్నది. ఆమె అసలు పేరు ‘చాందా బీబీ’. మహాలఖా బాయి ప్రతిభను గుర్తించిన అప్పటి నిజాం ప్రధాని అరిస్తు జాహ్ రెండవ నిజాంకు ఆమెను పరిచయం చేసారు. దీంతో నిజాం ఆమెను రాజనర్తకిగా నియమించారు. అనతికాలంలోనే నిజాంకు నమ్మకస్తురాలైన సలహాదారుగా మారింది. ఆమె విశ్వసనీయతకు మెచ్చి నిజాం అపార భూములను మహాలఖా బాయికి కానుకగా ఇచ్చారు. అందులో నేడు నగరంలో ఉన్న పురానా హవేలీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కార్యాలయ ప్రదేశాలు ఒకప్పటి మహాలఖా బాయి ఎస్టేట్లే. అంతేకాదు, నిజాం ఆమెకు అనేక సౌకర్యాలు కల్పించారు.ఆమె తన జీవితకాలంలో మౌలాలీ గుట్టపై ‘ఉర్సులను’ ప్రతి యేటా ఘనంగా జరిపించేది. గుట్ట కింద ఒక పెద్ద పూలతోటను నిర్మించింది. అందులో తన తల్లిని సమాధి చేసింది.

రాజనర్తకీమణుల నాట్యవిన్యాసాలు
చందా 1824 లో సుమారు 55 సంవత్సరాల వయస్సులో మరణానంతరం  మౌలాలీ కొండపైన ఆమె జ్ఞాపకార్థం నిర్మించిందే మక్‌బారా. ఆమె బతికున్న సమయంలో ఇక్కడ ముషాయిరా నిర్వహించేదట. అందుకే, ఇక్కడే ఆమె సమాధి నిర్మించారు.
మౌలాలీ గుట్టపై వున్న మహాలకా చందా సమాధి
మౌలాలీ, అధికమెట్ట (అడిక్‌మెట్‌) నేటి ఉస్మానియా యూనివర్శిటీ, సీఫెల్‌ నుండి బాగులింగంపల్లి వరకూ ఈమె జాగీరులోని ఇలాఖాలు. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్శిటీ, వివిధ విదేశ భాషలను అభ్యసించే ‘సీఫెల్‌’(ఇప్లూ), ఆంధ్ర మహిళా కళాశాలతో పాటు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలగు విద్యాకేంద్రాలన్నీ మాహ్‌లఖా బాయి చందా భిక్ష పెట్టిన స్థలాలే.

మహాలక చందమెట్ల బావి ఉస్మానియా యూనివర్సిటీలోని ఇప్లూ వద్ద ఉంది. చుట్టూ ఉండే భవనం మధ్యలో బావి ఆకారంలో ఉండడంతో దీనిని ‘మహాలక బావి’ అనేవారు.

ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణ సమయంలోనే దీనిని నిజాం కట్టించినట్లు చెబుతారు.

మహాలక చందమెట్ల బావి

మహ్ లకా భాయి పద్యాలున్న పేజీ
Ratika Sant Keswani enacts the role of Mah Laqa Bai Chanda
Show at Taramati Baradari
‘చందా’ అనే కలం పేరుతో దక్కనీ ఉర్దూలో ఆమె అనేక పద్యాలు, గజల్స్ రాశారు. ఆమె స్వయంగా గజల్స్ రాసిపాడేది. చందా అన్న తఖల్లూస్‌తో (కలంపేరు) ఆనాటి దక్కన్‌లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ‘తవాయఫ్‌’ (కళావంతురాలు) ఆమె. ఇట్లా, తన ఆటపాటలతో నిజాం నవాబులను అలరించిన మహాలఖా బాయి చివరికి 124లో తుదిశ్వాస విడిచింది. మహాలఖా బాయి మరణం తర్వాత ఆమె రచనలు ‘గుల్జారీ-ఇ-మహాలఖా’ పేరుతో అచ్చయినవి. ఆమె సమాధి నగరంలోని మౌలాలీలో ఉంది.

ఆమె గజల్స్ 39 వ దివాన్ సంకలనంలోని ఒక గజల్ ‘‘ మొగ్గవికసించాలనే ఆశ’’ “Hoping to blossom (one day) into a flower” కు ఆంగ్లాను వాదం

Hoping to blossom (one day) into a flower,Every bud sits, holding its soul in its fist.

Between the fear of the fowler and (approaching) autumn,
The bulbul’s life hangs by a thread.

Thy sly glance is more murderous than arrow or sword;
It has shed the blood of many lover.

How can I liken a candle to thy (glowing) cheek?
The candle is blind with the fat in its eyes.

How can Chanda be dry lipped. O Saqi of the heavenly wine!
She has drained the cup of thy love.ఆమె సమాధిమందిరం టేకు తలుపుపై చెక్కన పద్యం అనువాదం ఇలావుంటుంది. 

Cypress of the garden of grace and rose-tree of the grove of coquetry,
an ardent inamorata of Hydar and suppliant of Panjtan.

When the tidings of the advent of death arrived from God,
she accepted it with her heart, and heaven became her home.

The voice of the invisible speaker called for her chronogram,
Alas! Mah Laqa of the Deccan departed for heaven 1240 A.H.


 ఆధార సూచికలుStandard
సమాచారం

జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం: 

సంకల్ప మంత్రంలో భాగంగా వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. 

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి? 

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) . పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనే ఆధారాలుగా వీటిని పేర్కొంటూ ఉన్నారు.  ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదనేది ఒక వాదన.

 అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవట.

( సోషల్ నెట్ లో ప్రచారంలో వున్న ఈ వ్యాసంలోని సారాంశ రూపాన్ని మాత్రం సమాచారం గా తీసుకున్నాను. శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయనేది దీనికి అనుభంధంగా లభించలేదు. అటువంటివి దొరికితే ఇక్కడే పోస్టు చేస్తాను. మీకు తెలిసి వుంటే కామెంటుగా పోస్టు చేయండి )

Standard