ప్రక్రియ, షేర్

షేర్

షేర్ ఉర్దూలో కవిత లేదా పద్యం లోని రెండు పంక్తుల జోడి. మొదటి పంక్తికి ‘మిస్ర-ఎ-ఊలా’, రెండవ పంక్తికి ‘మిస్ర-ఎ-సాని’ అని అంటారు. ఈ షేర్ పద్యసాహితీ ప్రామాణికాలను గల్గివుండాలి. అనగా తఖ్తీ ఛందస్సు, బెహర్ (మీటర్), జమీన్, అర్కాన్, ఖాఫియా, రదీఫ్ లను కలిగి వుండవలెను.

షేర్ కు ఉదాహరణలు:

మిర్జా గాలిబ్
దిల్-ఎ-నాదాఁ తుఝే హువా క్యా హై
ఆఖిర్ ఇస్ దర్ద్ కీ దవా క్యా హై

ఈ హృదయం పిచ్చిది. దీనికేమయ్యిందో తెలియడం లేదు. ఈ వేదనకు మందేమైనా ఉందా?

మహమ్మద్ ఇక్బాల్
సారే జహాఁ సె అఛ్ఛా, హిందూస్తాఁ హమారా
హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్ కీ, ఏ గుల్ సితాఁ హమారా

ప్రపంచమంతటిలోనూ మా హిందూస్తాన్ ఉత్తమమైనది. ఈ పూదోట మాది. మేము ఇందులో పాడే పక్షులం

అహ్మద్ నిసార్
సారి తహ్ జీబేఁ మిట్ గయీఁ లైకిన్
మేరే భారత్ కి షాన్ బాఖీ హై
అన్ని నాగరికతలు సమసినాయి గాని, నా భారత ఖ్యాతి అలాగే నిలిచింది.

Standard