సమాచారం, Fun

అపహాస్యం పాలవుతున్న హాస్యం

నవరసాలలో ఒకరకంగా ప్రధానమైనదీ ఆరోగ్యానికి కారణమయ్యేదీ కూడా హాస్యమే.
మిగిలిన ఏ పరిశోదనాంశాలకూ తగ్గనంత విశ్లేషణలూ, సిద్దాంతీకరణలూ, ప్రతిపాదనలూ హాస్యం విషయంలోనూ జరిగాయి. కానీ అవేమీ పట్టించుకోని ఇవ్వాల్టి రేటింగుల వేట ప్రోగ్రాములు (పైగా వాటిలో పెద్దస్థాయి వ్యక్తులూ, మహిళా నేతలు సైతం కూర్చునే వుంటారు) తోచి ఒక్క బాణీలోనే పోతున్నాయి.

హాస్యాన్ని ఉత్ప్రిరితం చేసేందుకు :: ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అసంబద్ధత (ఫార్స్), , సందర్భం మార్పు (reframing),సమయస్ఫూర్తి, శ్లేష, లాంటి వాటిని రాజకీయకోణంలోనూ సామాజిక స్థితిగతులలోనూ, పారడికల్ సిట్యుయేషన్స్ గా మలచటం ద్వారా ఇలా ఎన్నో పద్దతుల హాస్యాన్ని పుట్టించ వచ్చనేది ఇప్పటికే సిద్దాంతీకరించి వున్నా ఎవ్వడూ పట్టించుకునేలా లేరు నిజానికి ఇదో విషాద హాస్యం

హాస్యానికి అసంబద్ధత (Incongruity Theory) కారణం అని కాంట్ అంటే, ఒక నిశ్చితమైన ఫలితం లేని పరిస్థితి హాస్యం అవుతుందని హెన్రీ బెర్గ్‌సన్ మరింత విపులీకరించాడు. మోరియల్ అనే విశ్లేషకుడు “ఏకకాలపు కలగాపులగం” (simultaneous juxtapositions) అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు. లాట్టా (Latta) అనే శాస్త్రజ్ఞుడు మాత్రం ఒక పరిస్థితిలో ఒక పజిల్‌కు సమాధానం లభించినపుడు కలిగే దృక్పథపు మార్పు హాస్యానికి ప్రధానమైన అంశం అన్నాడు. ఇంకా ఇలాంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.

ఎలాగూ నవ్వించే విధి నిర్వహించటం వల్ల నాలుగు ముద్దలు నోట్లోకి వెడుతున్నాయి కాబట్టి, కనీసం దానికి గౌరవం ఇచ్చేందుకైనా కొంచెం అధ్యయనం చేయటం పాపమా? నేరమా ?

ఈ మధ్య కామెడీ అంటే మగవాళ్ళకి చీరకట్టెసి,గొంతు కీచు పెట్టి తన్నటమో తన్నించుకోవటమో చేస్తే చాలనే ఫార్ములాని వెగటు మితిమీరి విసుగొచ్చిన దాకా వాడుతున్నారు. పైగా అదే ఆడియో రిలీజుల్లో కూడా. చీర బ్యాచ్ ల పేరుతో కొందరు ట్రేడ్ మార్క్ చేసేసుకున్నారు.

అసలే సాంప్రదాయ వస్త్రాలపై చిన్నచూపు పెరుగుతుందేమో అనుకునే రోజుల్లో,
ఇప్పుడు మరింతగా దానిపై వ్యంగపు మరకలు.
గట్టిగా అవమానపరచే తిట్టు ఏర్పడాలంటే ‘ఆమె’ వుండాల్సిందే (స్వంతానికి ఎలాగూ సిగ్గులేదు కాబట్టి), ఇక పిచ్చి హాస్యానికి కూడా ‘ఆమే’ సమిధనా?
నడపండ్రా నాయినా నడపండి జనాలకి ‘చీరా’కొచ్చేదాకా నడపండి.
మీరు మారర్రోయ్.. మీ రేటింగ్ ఫార్ములాలని తగ…..

ఫేస్ బుక్ వాల్ పై జరుగుతున్న చర్చలో కుదిరితే మీరు పాలుపంచుకోండి.
ఏమో ఈ నిరసన ఒక్క కార్యక్రమంలో మార్పుకు కారణమయినా మంచిదే కదా?

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
సమాచారం, Fun

రోటి టైం : అప్పడాల కర్ర తిరగేస్తారా?

ఈ మధ్య తీయని భాదల నేపద్యంలోనో, కొవ్వుని కరిగించే కార్యక్రమంలోనో రోటీకి బాగానే డిమాండ్ పెరిగింది. తినడానికేం భేషుగ్గా వుంటుంది. అసలు రోటీలో నంజుకునేందుకు కూరలు చెయ్యాలా? కూరలు తినేందుకు నంజుగా రోటీ వండుకుంటామా ? అనే భేతాళ ప్రశ్నకు సమాధానం వెతికే విక్రమార్కుడే దొరకలేదట.

ఆట పింటని పిలుచుకునే గోధుమపిండి, లేదా మరికొన్ని పిండ్లతో కలిసిన పిండిని నీళ్ళనుకావలసినంతే కలిపి చేతివేళ్ళకు కావలసినంత ఎక్సర్ సైజ్ చేయించి,  దెబ్బలూ, మొట్టికాయలూ, పిడిగుద్దులూ, కసితీరా వేసేది. అప్పుడిక అప్పడాల కర్ర అందుకుంటే నా సామిరంగా సాఫయి పోవాల్సిందే కదా. ఇక వీటికోసం ఎన్ని రకాల పీఠలూ, ఎన్నెన్ని రకాల కర్రలు. క్రిందనో పైననో అంటుకోకుండా నొక్కగానే సరిపోదు దానికి అందమైన ఆకారం రావాల్సిందే. పైగా రౌండు గుండ్రమయితేనే ప్లేటుకి సరిపోనూ సరిగ్గా అమర్చేందుకు బావుంటుంది.

ఇక పెనం బాధలుచెప్పేదేముంది. ఆయిల్ తక్కువ వేయాలి. మాడిపోకూడదు. రోటీలూ, పుల్కాలూ, చపాతీలూ, చుక్కారోటీలూ, నాన్ లు, బటర్ నాన్ లు, పరాటా, పూరీ, ఆలూ స్పెషల్ పూరీ భారతీయ బ్రెడ్డుకు కావలసినన్ని రూపాలు.

ఇక జోన్ పిండి రొట్టెలైతే పీటలూ, కర్రలూ ఏంలేకుండా చేతులతోనే సమానంగా నైపుణ్యంతో వత్తేస్తారు. రుమాల్ రోటీ తినటం కంటే అది చేసేప్పుడు చూడటమే వింతగా వుంటుంది. సర్వపిండి రొట్టెలు పప్పుబద్దలతో హట్ హాట్ గా తెలంగాణాకి ఫేవరెట్,

సరే కానీ ఇంతకీ విషయం ఏంటంటే వీటిని పెద్దమొత్తంలో చేయడానికీ, సులభంగా చేసుకోవడానికీ చాలా రకాల యాంత్రిక పద్దతులొచ్చాయి. సరదాగా కొన్ని చూస్తారా మరి.

పిండి, నీళ్లూ వగైరా వేసేసి ఎన్ని రోటీలు కావలి? ఎంతమందంతో కావాలి లాంటి వివరాలు ఫీడ్ చేసి మనం డైనింగ్ టేబుల్ అమర్చుకునే లోగా నిమిషానికొకటి చొప్పున జిరాక్స్ మెషిన్లోంచి పేపర్లు పడ్డట్లు ప్లేటులోకి వచ్చేస్తున్నాయి. 

న్యూస్ పేపరు అచ్చుకోసం వెళ్ళినట్లు దుప్పటి లాగా, ద్రౌపతికి కృష్ణుడు ప్రసాదిస్తున్న కోకలాగా ఓ క్రమంలో వస్తున్న రోటీ బెల్టుని చక్కని గుండ్రని ఆకారంలో కత్తిరించటం, అదే వరుసలో వాటిని వేడిచేయటం బెల్టు చివరికెళ్ళేసరికి తయారైన రోటీలను కుప్పలుగా వచ్చేస్తుంటే ప్యాక్ చేసుకోవడం… బహుశా కటింగ్ లో మిగిలిన పిండి ముక్కల్ని మళ్లీ రౌండ్ లో కలుపుతారేమో.

కొద్దిగా మనుషుల అవసరం ఎక్కువ కావలసిన రొట్టలు తయారు చేసే మినీ పరికరం.
పిండి వృధాకావడం లేదు. యాంత్రిక శక్తికూడా మరీ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు.

సరే మీరు ఓపిగ్గా రోటీ మేకింగ్ మెషిన్ల కోసం వాటి వివరాల కోసం వెతుక్కుంటే చాలా దొరుకుతాయి.
చివరిగా ప్రపంచంలోనే పెద్ద రోటీ ఎలా తయారు చేసారో చూడండి. మనం రుమాల్ రోటీ అన్నట్లే దీనికి కూడా పేరుపెట్టాలంటే లుంగీ రోటీనో, పంచె రోటీ అనో పెట్టాలేమో.. చూడండి చేతులతోనే సాగదీసి ఎంతబాగా ఆరేస్తున్నాడో

Standard
Fun

మనసు చదవొచ్చా ?

ఇది ఎలా ప్రోగ్రాం చేసారు? నమ్మలేనంత చిత్రంగా వుంది?

మనసుని చదివేస్తుందేమో అనిపించే The Flash Mind Reader ఒక సారి చూడండి.

10 నుంచి 99 వరకూ ఒక అంకె ఏదైనా సరే అనుకోండి

దానిలోని అంకెలను కూడి వచ్చిన సంఖ్యను
మీరనుకున్న అంకెనుండీ తీసేయండి.
తీసివేయగా వచ్చిన సంఖ్య ముందు ఏ చిహ్నం వుందో గమనించండి.
ఎవరికీ ఏమీ చెప్పల్సిన పనిలేదు నోరు విప్పాల్సిన పనిలేదు.
ఇప్పడు మనసు చదివే గోళం పై క్లిక్ చేయండి

శ్ఛ
ర్యం

నిజం గానే మనం అనుకున్న అంకె ముందున్న బొమ్మనే అక్కడ కనిపిస్తోంది.
నేను వేరు వేరు అంకెలతో ప్రయత్నించాను ఖచ్చితంగానే వచ్చింది
మీరూ చూడండి.

దీని వెనుక పనిచేస్తున్న సూత్రం ఏమిటసలు??????????
??
??
??
http://www.albinoblacksheep.com/flash/mind

పైలింకులో వున్న తమాషా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

సంఖ్య
కూడి తీసేయండి
రిజల్ట్
ఇవే వస్తాయి
99
(
9
+
9
)
18
=
81
81
98
(
9
+
8
)
17
=
81
97
(
9
+
7
)
16
=
81
96
(
9
+
6
)
15
=
81
95
(
9
+
5
)
14
=
81
94
(
9
+
4
)
13
=
81
93
(
9
+
3
)
12
=
81
92
(
9
+
2
)
11
=
81
91
(
9
+
1
)
10
=
81
90
(
9
+
0
)
9
=
81
89
(
8
+
9
)
17
=
72
72
88
(
8
+
8
)
16
=
72
87
(
8
+
7
)
15
=
72
86
(
8
+
6
)
14
=
72
85
(
8
+
5
)
13
=
72
84
(
8
+
4
)
12
=
72
83
(
8
+
3
)
11
=
72
82
(
8
+
2
)
10
=
72
81
(
8
+
1
)
9
=
72
80
(
8
+
0
)
8
=
72
79
(
7
+
9
)
16
=
63
63
78
(
7
+
8
)
15
=
63
77
(
7
+
7
)
14
=
63
76
(
7
+
6
)
13
=
63
75
(
7
+
5
)
12
=
63
74
(
7
+
4
)
11
=
63
73
(
7
+
3
)
10
=
63
72
(
7
+
2
)
9
=
63
71
(
7
+
1
)
8
=
63
70
(
7
+
0
)
7
=
63
69
(
6
+
9
)
15
=
54
54
68
(
6
+
8
)
14
=
54
67
(
6
+
7
)
13
=
54
66
(
6
+
6
)
12
=
54
65
(
6
+
5
)
11
=
54
64
(
6
+
4
)
10
=
54
63
(
6
+
3
)
9
=
54
62
(
6
+
2
)
8
=
54
61
(
6
+
1
)
7
=
54
60
(
6
+
0
)
6
=
54
59
(
5
+
9
)
14
=
45
45
58
(
5
+
8
)
13
=
45
57
(
5
+
7
)
12
=
45
56
(
5
+
6
)
11
=
45
55
(
5
+
5
)
10
=
45
54
(
5
+
4
)
9
=
45
53
(
5
+
3
)
8
=
45
52
(
5
+
2
)
7
=
45
51
(
5
+
1
)
6
=
45
50
(
5
+
0
)
5
=
45
49
(
4
+
9
)
13
=
36
36
48
(
4
+
8
)
12
=
36
47
(
4
+
7
)
11
=
36
46
(
4
+
6
)
10
=
36
45
(
4
+
5
)
9
=
36
44
(
4
+
4
)
8
=
36
43
(
4
+
3
)
7
=
36
42
(
4
+
2
)
6
=
36
41
(
4
+
1
)
5
=
36
40
(
4
+
0
)
4
=
36
39
(
3
+
9
)
12
=
27
27
38
(
3
+
8
)
11
=
27
37
(
3
+
7
)
10
=
27
36
(
3
+
6
)
9
=
27
35
(
3
+
5
)
8
=
27
34
(
3
+
4
)
7
=
27
33
(
3
+
3
)
6
=
27
32
(
3
+
2
)
5
=
27
31
(
3
+
1
)
4
=
27
30
(
3
+
0
)
3
=
27
29
(
2
+
9
)
11
=
18
18
28
(
2
+
8
)
10
=
18
27
(
2
+
7
)
9
=
18
26
(
2
+
6
)
8
=
18
25
(
2
+
5
)
7
=
18
24
(
2
+
4
)
6
=
18
23
(
2
+
3
)
5
=
18
22
(
2
+
2
)
4
=
18
21
(
2
+
1
)
3
=
18
20
(
2
+
0
)
2
=
18
19
(
1
+
9
)
10
=
9
9
18
(
1
+
8
)
9
=
9
17
(
1
+
7
)
8
=
9
16
(
1
+
6
)
7
=
9
15
(
1
+
5
)
6
=
9
14
(
1
+
4
)
5
=
9
13
(
1
+
3
)
4
=
9
12
(
1
+
2
)
3
=
9
11
(
1
+
1
)
2
=
9
10
(
1
+
0
)
1
=
9

అంటే మీరు రెండంకెల ఏం సంఖ్యను తీసుకుని చెప్పిన పద్దతిలో కూడి ఆ సంఖ్యనుంచి తీసివేస్తే వచ్చే సమాధానం 9 యొక్క గుణిజం అవుతోంది. అంటే తొమ్మిదవ ఎక్కంలోని సంఖ్య అవుతోంది.

చూడండి సమాదానాలు కేవలం = 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81 ఇవి మాత్రమే వస్తున్నాయి. (ఎందుకలా చెప్పగలరా? )

అలాగే బొమ్మలో మీరు లెక్క ప్రారంభించే ముందు గమనించండి ఈ సంఖ్యల దగ్గర ఒక్కటే సింబల్ వుంటుంది.
మీరు ఏ సంఖ్య కూడినా అదే వస్తుందన్నమాట.
ప్రోగ్రామర్ తెలివిగా మరో పని కూడా చేసారు. మీరు మరోసారి ప్రయత్నించే సమయంలో ఈ ప్రదేశాలలో మరో బొమ్మ వచ్చేలా చేస్తున్నాడు. ఒక్క అంకె వున్న సంఖ్యలను ఇలాగే కూడితే సున్నా (0) సమాధానం వచ్చివుండేది. కాకుంటే సున్నాదగ్గరున్న బొమ్మ మారుతుంటే పరిశీలకులు సులభంగా గమనిస్తారని ఈ ప్రొగ్రాం తయారు చేసిన వారు ఒక్క అంకె సంఖ్యలను కోరుకుంటే చెపుతాం అనేలా చెయ్యగలిగినా చెయ్యలేదు.

మొత్తం మీద గణిత శాస్త్ర తమాషా భలే గా మనసు చదువుతున్న బ్రమకలిగించేలా చేశారు.

క్రింద బొమ్మఆటలో వున్న మెజీషియన్ తమాషాకూడా చూడండి.
0 నుంచి 85 వరకూ ఏదైనా ఒక అంకె అనుకోండి మెజీషియన్ స్క్రీన్ మీద ఆ అంకెవుంటే యస్ నొక్కండి లేకుంటే నో నొక్కండి వాడు మీకు సమాధానం ఇస్తేస్తాడు. ఒకసారి ప్రయత్నించి చూడండి.

if (WIDGETBOX) WIDGETBOX.renderWidget(’61f444a1-cdad-4a39-9760-db6d1b8e7d08′);Get the The Mind Reader widget and many other great free widgets at Widgetbox! Not seeing a widget? (More info)

if (WIDGETBOX) WIDGETBOX.renderWidget(’70e3c785-21e0-48ad-afb1-9eaf2cfeebb3′);Get the The Mind Reader widget and many other great free widgets at Widgetbox! Not seeing a widget? (More info)

Standard
Fun, Videos

ఇండియన్ పాలిట్యూన్స్ : సో సారీ

ఇండియన్ పాలిట్యూన్స్ రాజకీయ వ్యంగ్యాస్త్రాలను చక్కటి గ్రాఫిక్ జోడించి తక్కువ నిడివిలో తమాషా వెనుక నిజాలను ప్యాక్ చేసి భలే అందిస్తున్నారు.
మన టెలివిజన్స్ విజువల్ టెక్నాలజీలో కూడా మరింత మెరుగుదల వస్తే బావుండును.Standard
Fun

ఫేస్బుక్ పేరడీలూ.. రడీలూ…ఢీలూ

FBలో రౌండప్ చేసి నన్ను కన్స్యూజ్ చెయ్యెద్దు.
ఎందుకంటే కన్పూజన్ లో నేనెక్కువ అప్డేట్స్ రాసేస్తాను.


ఒక్కసారి రాద్దామనుకున్నాక నా కీబోర్డే నా మాట వినదు. ( దానికెట్లాగూ మైక్రోఫోనులేదుగా)
……….
ఎప్పుడు చూసారన్నది కాదన్నయ్యా….
లైకారా, కామెంటారా లేదా….

…………..
కామెంటుని చూద్దాం అనుకోండి తప్పులేదు,
కామెంటలోడిని చూద్దామనుకోకండి బుర్రవాచిపోద్ది.

Standard