ఖమ్మంజిల్లా, History

నేలకొండపల్లి ఎంత తవ్వినా తరగని ఒక చారిత్రక గని

ప్రాచీన ఆదిమనవుని అడుగుజాడల నుంచి జైనం ఆనవాళ్ళు, అతిపెద్ద బౌద్ధస్థూపం, కోట్లాది రూపాయిల విలువైన బుద్ధవిగ్రహం బయటపడిన ప్రాంతం ఇదే. త్రిపీఠకాలలో ఒకటైన సుత్తపిటకములోని ఐదుమహా నికాయల్లోని మజ్జమ నికాయాన్ని ప్రతిబింబించే ప్రాచీన ప్రాకృతపదాన్ని గుండెల్లో పొదువుకున్న మజ్జిగూడెం వున్నదీ ఇక్కడే. నాసిక్ శాసనం ద్వారా గౌతమీపుత్రశాతకర్ణి ఆధీనంలో వున్న రాజ్యాలలో అస్మకకు చెందిన రాజ్యాభాగాల్లో ఇదొకటి. ఇదే. దక్షిణాపథపతి అనిపిలువబడ్డ ఇక్షాకుడు శాంతమూలుని పాలనలో క్రీస్తుశకం ప్రారంభదశల్లో వున్న ప్రాంతాల్లో ఒకటి. క్రీశ 591 ప్రాంతంలో మహదేవ వర్మ ఖమ్మం దుర్గాన్ని ఏలుతున్న కాలాన్ని పొదువుకుంది. 950 ల నాటికి ఖమ్మం కోటకు తమ గుప్తధనాన్ని వెచ్చించిన ముగ్గురు రెడ్డి సోదరులు(రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి) పాలనాదశలను చూసింది. ముదిగొండ చాళుక్యుల్లో రణమర్ధనుడి కుమారుడు మొదటి కుసుమాయుధుడి రాజకీయ కార్యకలాపాలను ప్రస్తావించిన బెజవాడ తామ్రపత్రశాసనంలో ప్రస్తవించబడిన ప్రాంతం. వేంగిదేశ సరిహద్దుప్రాంతంగా కొన్నాళ్ళు కొరవి కొండపల్లి వున్నట్లు పేర్కొన్నారు.

విదేశీయుల దృష్టిని సైతం అత్యంతంగా ఆకర్షించిన ప్రాంతం అప్పుడెప్పుడో మరీ ఒకటవ శతాబ్దం కాలంలోనే ptolemy (టోలమీ) రాసిన Ancient India లో పేర్కొన్న ‘‘Nelkynda ’’ గా తన వ్యాపార కార్యకలాపాలను మసలీపట్నం వరకూ నిర్వహించుకున్నప్రాంతం. ఏడవశతాబ్దంలో హర్షవర్ధనుడి కాలంలో చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తన పర్యటన డైరీలో ప్రస్తావించిన ప్రాంతం. 12 వ శతాబ్దంలో ప్రఖ్యాత ఇటలీ యాత్రికుడు మర్కోపోలో చూసుకుంటూ వెళ్ళిన ప్రాంతం.

చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాలస్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయములను ఇప్పటికీ తన గుండెల్లో పొదవుకునే వున్న ప్రాంతం. భక్తరామదాసును కన్నతల్లిగా భద్రాద్రిరాముడి ముందు మోకరిల్లిన ప్రాంతం. ఇప్పుడంటే ఒక చిన్న ఆవాసంగా ఖమ్మంనుంచి కోదాడ వెళుతున్న రహదారిలో ఒకానొక పల్లెటూరుగా మాత్రమే ఉండొచ్చుగాక. ఇంత చరిత్రా కాలగర్భంలో మాయమై పోతుందా? లేదు ఒక్కోకాలానికీ సంభందించిన గుప్పెడు ఆధారాలను జాగ్రత్తగా తన దేహపైనే జ్ఞాపకంబొట్లుగా నిలుపుకోనే వుంచింది. వెతుక్కునే మనసూ తీరికా మనకే వుండాలి కానీ.

సరే ఇప్పటికే దొరకిన అపార సంపదగురించి రాస్తే అదే పెద్ద పుస్తకం అవుతంది కానీ ఈమధ్య గమనించిన మరికొన్ని ఆధారాలను మీముందుంచుతాను. రామదాసు ధ్యానమందిరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, గోపన్న సాహిత్యాన్ని వ్యయప్రయాలకోర్చి సేకరిస్తున్న విశ్రాంత అద్యాపకులు శ్రీయుతులు సాధురాధాకృష్ణమూర్తిగారు కాల్వొడ్డున ఒక శాసనం ఉన్నట్లుంది చూసిపోదురురమ్మని హరగోపాల్ గారినీ, నన్నూ పిలిచారు. 29నాటి తానా కార్యక్రమం ముగించుకుని హరగోపాల్ సార్ తిరుగుప్రయాణంలో వుండటంతో నేనొక్కడినే శాసనాన్ని చూద్దామని వారితో వెళ్ళాను. తీరాచూస్తే అక్కడ ఆ పాత కాల్వ ఒడ్డున, పందుల పెంపకం నడుస్తూ గందరగోళంగా వున్న ప్రదేశంలో శాసన స్థుపంతో పాటు ఆశ్చర్యపోయేంత అపార చారిత్రక ఆధారాలు నిరాధరణలో పడిపోయివున్నాయి. నల్లశానపురాయితో నిర్మించిన అమ్మవార్లవిగ్రహాలు తలలు తెగగొట్టబడివున్నవి. వేర్వేరు వీరగల్లులు అడ్డదిడ్డంగా పడేసివున్నాయి. శాసన స్థంభానికి పందులు వీపుగోక్కునేందుకు వాడుకుంటున్నాయి. చాలా కాలం క్రితం కవి బావ పోతగాని సత్యనారాయణ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి నువ్వెలాగైనా ఒకసారి వచ్చి చూడొచ్చుకదా అని అడిగారు కానీ పూర్వపు విజిట్స్ లో ప్రదేశాన్ని సరిగ్గా లొకేట్ చేయలేకపోయాను. నడుంనొప్పికోసమని పెట్టిన సెలవెటుపోయిందో కానీ ఒకపూటంతా గడిపినా నొప్పేమీ తెలీలేదు, సమయమూ సరిపోలేదనిపించింది. ఇంకా చెరువులోపట బురదమధ్యలో తూటికాడల పేరుకుని పున్న చోట్లలో కొన్ని ఇలాంటి బ్లాక్ గ్రానైట్ బండలూ, శిలలూ వున్నాయంట ఒకదానిలో అక్షరాలున్నట్లున్నాయి అని స్థానికులు చెప్పారు. కానీ సాయంత్రం వేళ వెళ్లేలా లేదు. మరికొంచెం నీళ్ళు తగ్గితే సులభం అవుతుంది అన్నారు. ఈ శాసనాన్ని మట్టిల్లోంచి బయటికి జాగ్రత్తగా పెల్లగిస్తూ శుభ్రంగా కడిగించి దానిని వైట్ ఫౌడర్ ఫోటోలుగా తీసుకున్నాను.ఇంతకు ముందే ప్రచురించిన శాసనాల్లో వుంటుందేమో నని తెలంగాణ శాసనాలు ఒకటి రెండు సంపుటాలను, ICHR ప్రచురించిన కాకతీయ శాసనాలు (SS రామచంద్రమూర్తిగారు) లో మాత్రం వెతికి చూసాను. మొదటి దాన్లో నేలకొండపల్లివి రెండు శాసనాలు వున్నాయి కానీ ఇది లేదు. రెండవదానిలో నేలకొండపల్లి శాసనాలేవీ చేర్చబడిలేవు. మరికొంత సరిచూడాలి కానీ అప్పటివరకూ ఏం రాసివుందోనన్న ఆతృత ఆగదు కాబట్టి వాటిని అచ్చుగా తీసుకున్నాను. కాకతీయుల పాలన నాటివని అయితే స్పష్టంగా తెలిసింది. కొండపల్లిఅంటూ ఊరిపేరు ప్రస్తావించబడింది. మరికొంచెం పరిశీలనగా చూసేందుకు సీనియర్ల సహకారాన్నీ కూడా తీసుకోవాలి. ఆ ఫోటలను ఇక్కడ జతచేస్తున్నాను ఒకసారి పరిశీలించండి. నేలకొండపల్ల వాస్తవ్యులు సహకరిస్తే త్వరలోనే ఈ శాసన స్థంబాన్ని రామదాసు ధ్యానమందిరం ఆవరణలోకి చేర్చాలి. ఈ విగ్రహాలను సైతం సరైన పద్దతిలో బౌధ్దస్థూపం ఆవరణలో ఒక గది కేటాయించి అమర్చగలిగితే ఇదే ఒక చారిత్రకమ్యూజియంలా వుంటుంది. వీటికి తోడు మరెన్నో ఆధారాలనూ, వాటి రెప్లికాలనూ సైతం నేలకొండపల్లి బౌద్ధస్థూపం ఆవరణలో ఏర్పాటుచేసే మ్యూజియంలో వుంచవచ్చు. స్థూపం సందర్శనకోసం వచ్చేవారికి ఏదో చూసాం వెళ్ళాం అన్నట్లు కాక నేలకొండపల్లి చారిత్రక నేపద్యాన్ని కాలానుగుణంగా అర్ధంచేసుకునే అవకాశం వస్తుంది. చూడాలి చరిత్ర గురించి నిజంగా ఆమాత్రం పట్టించుకునే శ్రద్ద ఈ నూతన సంవత్సరానికైనా వుంటుందా లేదా అన్నది.

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ కట్టా శ్రీనివాస్.

ఫోటోలను ఈ లింకు నుంచి చూడొచ్చు

from Blogger http://bit.ly/2iOU4rj
via IFTTT

Standard
ఖమ్మంజిల్లా, History

కొత్తగూడెం జిల్లాలోని కారుకొండ బుద్ద గుహలయాలు

తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు, కొత్తగూడెం జిల్లాలో గుహాలయం జాడలు
కారుకొండ ధ్యానబుద్ధ శిల్పం ఈశాన్య దిశలోని చిత్రం
ఖమ్మంజిల్లా నేలకొండపల్లిలో బౌద్ధస్థూపం వుంది,పైగా ఇది చాలా పెద్దది కూడా, బౌద్ధం ఈ ప్రాంతంలో ఒక వెలుగు వెలిగింది అనడానికి గొప్పఆధారం. మరి అక్కడొక్కచోటనే వుండి చుట్టుపక్కల లేదా మనకు ఆధారాలు దొరకటం లేదా అని చూస్తే తుడిచిపెట్టబడిన ఆధారాలు ఫినిక్స్ లా అదే చారిత్రక బూదిలోంచి రెక్కలు విప్పార్చుకుంటూ బయటకు వస్తున్నాయి. మొన్నీమద్య నాగులవంచ దగ్గర రామసముద్రంలో దొరికిన నాలుగు పాలరాతి బుద్దప్రతిమలు, ధమ్మ పదానికి గుర్తుగా నిలచిన ధమ్మపేటలోని నాగుపల్లిలో దొరికిన బుద్ధ విగ్రహాలూ ఇదే విషయాని రూఢి పరుస్తున్నాయి. 

http://bit.ly/2gZywu5

తెలంగాణలో భౌద్ధం

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రస్థానాన్ని పొందినవాడు. ఆరాధనీయుడు. అటువంటి బుద్ధుని ధర్మప్రభోదాలు జీవన మార్గదర్శకాలుగా దేశ విదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించాయి. జనులకు నైతిక జీవనాన్ని ధర్మాచరణను ప్రభోధించటంలో ప్రముఖ పాత్రవహించింది బౌద్ధం. నియమబద్దమైన వ్యాప్తికోసం గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని పరిఢవిల్లజేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తను పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956నుంచి మరోకసారి పునర్వికాస దశ పొందింది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యమైనప్పటికీ, ఆ ఆధారాలను మిగుల్చుకోవడంలో వెతుక్కోవడంలో తగినంత శ్రద్ధ ఇప్పటివరకూ చూపలేదనేది ఒప్పుకోవలసిన నిజం. 
ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ- నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- నేలకొండపల్లి, అశ్వారావుపేట(?), కాపవరం. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. ఇటువంటి కొండలున్నా గుహా విహారాలు ఆధారాలను దొరకలేదు. కానీ కొత్తగూడెంలో వున్న ఈ భౌద్ధ ఆనవాలు గుహాలయమనేందుకు సరిపోయేలా వుంది. దీనివివరాలను చూద్దాం. 
ఎక్కడుంది ఈ భౌద్ద గుహాలయం?
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్ళే బైపాస్ రహదారిలో 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడినుంచి కేవలం ఒక్కకిలోమీటరు ఎడమపక్కగా వున్న కచ్చా రోడ్ లో వెళితే క్వారీగా తొలుచుకుంటూ వచ్చిన కారుకొండ పర్వతం కనిపిస్తుంది. దానికి పడమటి దిక్కున కారుకొండ చెరువు కనిపిస్తుంది. కొండను బలమైన రాళ్ళుదొరుకుతున్నాయని చుట్టూతా పండుని కొరుక్కుంటూ వచ్చినట్లు తొలుచుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి కూడా ముప్పు పొంచి వున్నప్పుడు, స్థానికుల నిరసన వెల్లువెత్తింది. తమ ఆరాధ్య దైవం సడాలమ్మ గుడిని, ఆనాదిగా వస్తున్న బుద్దుని రాతిగుండు, దెబోగా గుహలను కూల్చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ కొంచెం ప్రాంతం వరకూ క్వారీ పనులు నిలిపివేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుహల అభివృద్దికి స్వల్పంగా నిధులు కేటాయించడంతో వాటికి రక్షణగా చుట్టూతా ఇనుపవల వేసారు. రక్షిత కట్టడంగా ప్రకటిస్తూ ఆర్కియాలజీ వారు బోర్డును కూడా ఏర్పాటు చేసారు. 

ఏమున్నాయక్కడ ?
చతుర్ధిశ బుద్ధప్రతిమలతో ఏకశిలా నిర్మిత గోళాకార గుహదేవళం
కారుకొండ గుట్టకు పడమట దిక్కున ఈశాన్య దిశగా పది అడుగుల పైబడిన ఎత్తులో పాతిక అడుగుల పైగా చుట్టుకొలత వున్న ఇసుకరాతిగుండు ఒకటుంది. దానికి నాలుగు దిశల్లోనూ ధ్యానముద్రలో వున్న రూపం వుంది. రాతి గుండులో నాలుగు ముఖాలుగా ఎంచిన దిశల్లో అడుగులోతు గుంటలుగా తొలిచి దానిలోపట ఈ రూపాన్ని మలచారు. బహుదళ పద్మాన్ని ఆసనంగా తీసుకుని ధ్యానస్థితిలో నిర్మలంగా కూర్చుని వున్న ఒకేరకమైన రూపాలు నాలుగువైపులా వున్నాయి. మూర్తి కుడిభుజం వైపున్న దిశలో దీపం వెలిగించే గూడును ఏర్పాటు చేసారు. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలకు అత్యంత పురాతనమైన సహజరంగులను వేసారన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మహాయాన బౌద్ధానికి చెందిన శిల్పాలయివుండొచ్చనిపిస్తున్నాయి. 

Borobudur_ Buddha Statue
Dhyana Mudra, Amitabha is similar to
karukonda buddha silpam

ధ్యానముద్రలో ఎడమ చేతిపై కుడిచేయి
ఎడమ కాలుపై కుడికాలు వేసి వుండటాన్ని గమనించవచ్చు
ధ్యానభంగిమ ప్రత్యేకతలు : భౌద్ధ ప్రతిమాశాస్త్రాన్ని (Buddhist iconography) పరిశీలిస్తే ప్రతిభంగిమకూ ప్రత్యేకమైన అర్ధం వుంది. నిలబడే, కూర్చునే భంగిమలకే కాక చేతివేళ్ళను వుంచే విధానికి కూడా దీనిలో ప్రత్యేకమైన వివరణలు వున్నాయి. ధ్యాన స్థితిలో వున్న బుద్దుడి విగ్రహాల్లో ఎక్కువగా భూస్పర్శాముద్ర కనిపిస్తూ వుంటుంది కానీ ఇక్కడి విగ్రహలలో మాత్రం ధ్యాన సమహిత ముద్ర కనిపిస్తుంది. ఒడిలోకి చేర్చుకున్న ఎడమ చేతిని వెల్లకిలాతిప్పివుంచి దానిపై కుడిచేతిని వెల్లకిలా తిప్పిసున్నితంగా ఆనించివుంచిన ముద్రలో గమనించ వచ్చు. ధ్యానసమాధిస్థితికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ముడుచుకున్న కాళ్ళుకూడా పద్మాసన స్థితిలో కాక ఎడమముంగాలిపై కుడముంగాలు చేర్చిన స్థితిలో వున్నది. తిన్నగా వుంచిన వెన్నెముక, పైకెత్తిన తల, ప్రశాంతమైన ముఖం నిటారైన మెడతో తలెత్తికనిపిస్తోంది. ఇటువంటి ఆసన స్థితి ప్రశాంత ధ్యానానికి అత్యంత అనుకూలమైనదిగా చెపుతారు. రావిచెట్టుక్రింద జ్ఞానోదయం అయినప్పుడు సైతం బుద్ధుడు అవలంభించిన ధ్యానపద్దతి ఇదే స్థితిలోనే అని యోగసాధకులు చెపుతారు. ఇటువంటి స్థితి జ్ఞానేంద్రయాలపై వత్తిడిపడకుండా శరీరాన్ని సమస్థితిలో వుంచేందుకు దోహదం చేస్తుంది. చైనాలో చియాంగ్ సేన్ పిరియడ్ లో తయారుచేయించిన బుద్ధప్రతిమలు బ్యాంకాక్ దగ్గర వాట్ బెంచంభోఫిట్ ప్రాంతలో ఇదే ఆసనస్థితిలో వుండటాన్ని గమనించవచ్చు. భారతదేశంలో సైతం అనేక చోట్ల ఇదే రకమైన ధ్యానస్థితిలో వున్న బుద్దప్రతిమలున్నాయి. ఒడిలో భిక్షాపాత్రనుంచుకున్న విగ్రహాలుసైతం భిక్షాపాత్రమినహా మిగిలిన రూపమంతా ఇలానే వుంటుంద. 
కొంత పొడవుగా సాగిన చెవులు, ఉంగరాలు తిరిగిన జుట్టు, బుద్దుని భారతీయ రూపానికి అచ్చమైన ప్రతీకలుగా వున్నాయి. మెడలో ఏదో కంఠాభరణం ఆనవాలు అస్పష్టంగా కనిపిస్తోంది. ఎడమభుజం వైపుకు వేసిన వస్త్రపుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఇసుకరాయికావడం వల్ల అనేక శతాబ్దాల కోరివేతతో నష్టపోయిన భాగం కొంత అయితే ప్రధానమైన రూపాన్ని మాత్రం ప్రత్యేకకారణాలతో మనుషసంభంధమైన ధ్వంసీకరణ జరిగివుండొచ్చన్నట్లే కనిపిస్తున్నాయివి. బుద్ధ విగ్రహం వున్న తొలచిన గూడుకు తోరణం మాదిరిగా ప్రత్యేకంగా గాడులను కొట్టి అలంకరించారు. అంతేకాకుండా గూడుకు అడుగు క్రిందనుంచి చుట్టూతా తిరిగొచ్చేలా రెండంగుళాల లోతుతో ఒకగాడిని కొట్టారు. రాతిగుండుకు పై భాగంలో ఖచ్చితంగా మధ్య భాగంలో అడుగు లేదా పద్నాలుగు అంగుళాల భుజం కొలతతో ఒక చతురస్రాకారపు గాడి, దానికి మధ్యభాగంలో మరికొంత లోతుగా వృత్తాకారపు గాడి కనిపిస్తున్నాయి. ఎత్తుగావున్న ఈ భాగంలో రాత్రిపూట దీపం వెలిగించే వారో లేదా. ధ్యానసాధనలో భాగంగా గుడ్రని ఆకారంలో వున్న ఈ రాతిని మొత్తంగా భుద్దుని శిరస్సుగా భావిస్తే ఆ మధ్యలో వున్న భాగాన్ని సహస్రారంగా పరిగణించేవారో, లేక ధాతుగర్భంగా మలచేందుకు ఇదేమైనా సూచనవుతుందో ఇతిమిధ్దంగా ఇప్పటికి దొరికిన ఆధారాలతో తేల్చలేము. ఈశాన్య దిశవైపు చూస్తున్న బుద్ధప్రతిమకు ముందువైపున వున్న రాతిబండకుమధ్యలో ఒక చెట్టుమొలవడం వల్ల నిలవుగా చీలి ఆ వైపు ఒక ప్రత్యేక ద్వారతోరణంటా కనిపిస్తోంది. ఆ మొక్క మొదలు ఇంకా పచ్చిగానే వుంది మళ్లీ మొలకెత్తితే అది ఈ బండలను మరింత చీల్చివేసే ప్రమాదంలేకపోలేదు. గొడ్డలితో నరకటం, పలుగుతో పొడిచిమొదలు తీయటం కంటే యాసిడ్ లాంటి రసాయనాలను వాడి చెట్టుని తొలగిస్తే రాతిగుండుకు నష్టం కలకుండా వాటిని తీసేయడం సాధ్యం అవుతుంది.

బుద్దుడేనా  లేక జైన పార్శనాధుడా?
బహుదళ పద్మాన్ని ఆసనంగా, నాగపడగలను ఛత్రంగా వేసుకుని అచ్చంగా ఇటువంటి ధ్యానముద్రలో కంఠాభరణంతో సహాకనిపించే వారిలో జైనానికి సంభందించి పార్శనాధుడు పోలికలున్నాయి. జైనబసదుల్లోనూ ఇటువంటి పూజలు జరిగేవిధానం వుంది. అయితే జైనంలో దిగంబరత్వం వుంటుంది. బౌద్ధంలో వస్త్రధారణ కనిపిస్తుంది కానీ ఈ బొమ్మలలో వస్త్రదారణ వున్నది లేనిదీ స్పష్టంగా తెలియటం లేదు. 
దెబోగా [Dagobah] గుహలు :
రాతిగుండు నుంచి మరికొంత పడమటి దిశగా వెళ్ళి చూస్తే గుట్టపై కొంచెం ఎత్తులో ఈ రెండు గుహలూ కనిపిస్తాయి. దెబోగా గుహలు అంటే అదృశ్యశక్తులున్న మాంత్రికగుహలని నిజానికి అర్ధం స్టార్ వార్స్ సినిమాలో కూడా మాంత్రిక గుహలకు ఈ పేరే వాడటంతో ప్రాచుర్యంలోకి వచ్చిందీపేరు. ఇసుకరాతికొండలో తొలచిన ఈ గుహల్లో ఒకదానిపై 1986 లో గుట్టమీదనుంచి ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చిపడటంతో ఒక గుహ పాక్షికంగా ధ్వంసం అయ్యింది. 
ఎనిమిదడుగుల ఎత్తుతో పన్నెండడుగుల వెడల్పు ఆరడుగుల వెడల్పుతో గుహలు చక్కటి గదిలా వున్నాయి. ఆరడుగుల ఎత్తులో మూడున్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలున్నాయి. ద్వారాలు మూసేందుకు కూడా ఏదో ఇరుసులు లాంటివి తిప్పారనేందుకు గుర్తుగా రెండు పెద్ద గుంటలవంటివి కూడా వున్నాయి. ద్వారాలకు ఎదురుగా ప్రధాన విగ్రహరూపాలు ధ్వంసం తర్వాత కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే రూపం పోల్చుకునేలా తెలుస్తున్నాయి. వైష్టవ సంప్రదాయంలా కనిపిస్తున్న విగ్రహాలలో మధ్యలో పురుషదేవుడు ఆయనకు రెండువైపులా దేవేరుల విగ్రహాల్లాగా వున్నాయి. ఆభరాలు దండిగా వేయబడివున్నాయి. పైగా కుడిఎడమల వున్న గోడల్లో ద్వారపాలక విగ్రహాల్లాగా రెండు నిలువెత్తు విగ్రహాలున్నాయి. కానీ అవి తర్జని చూపిస్తూ ద్వారపాలన చేస్తున్నట్లుగా కాక ముకుళిత హస్తాలతో భక్తభంగిమలో కనిపిస్తున్నాయి. ఎక్కువగా జనసంచారమేమీ లేకపోవడం వల్ల పురుగులూ, పాములూ దీన్ని ఆవాసంగా చేసుకున్నట్లున్నాయి. నేను సందర్శనకు వెళ్ళినప్పడు విడియో తీస్తుండగా ఒక సన్నని పొడవాటి పాము కాప్ మీదనుంచి చేతిమీదకు జారి ప్రాణభయంతో హడావిడిగా పక్కనే వున్న పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వత చూస్తే అంతే మందం వున్న పాము కుబుసాన్ని కూడా ఆ గుహలో గమనించాను. రెండవ గుహలో కూడా దాదాపు అదేవిధమైన స్ట్రక్చర్ కనిపిస్తోంది. అక్కడక్కడ పురాతన సహజరంగుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. 
కొత్తగూడెం మండలంలోని కారుకొండ రామవరంలో దెగోబా గుహాల ప్రాంతంలో బంగారు నాణేలు దొరికాయని ఆర్కియాలజీ సైటులో పేర్కొన్నారు. 40 బంగారు నాణేల నిధి పగిలిపోయిన కాంశ్యపేటికలో దొరకాయట. ప్రాధమిక పరిశీలనలో ఇవి విజయనగర కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ మొత్తం నాణేలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1వ రకం శ్రీకృష్ణదేవరాయల కాలం(1530-1542) కాలం నాటివి రెండవ రకం తుళువ వంశానికే చెందిన అచ్యుతరాయని కాలం(1530-1542) కు చెందినవి. ఒక్కక్క నాణెం బరువు కనీసం 1650 మిల్లీ గ్రాముల నుంచి గరిష్ణంగా 3380 మిల్లీ గ్రాముల వరకూ వున్నాయి. అన్ని నాణేలు దాదాపు గుండ్రని ఆకారంలో వున్నాయి. మొత్తం నాణేల బరువు 117.840 గ్రాములుగా వుంది.   1994-1995 సంవత్సరం కాలంలోనే కాలచక్ర పేరుతో వీటిని విజయవాడ బౌద్ధశ్రీ ప్రదర్శనశాలకు తరలించారు నేలకొండపల్లిలో దొరికిన కోట్లాది రూపాయిల విలువచేసే బుద్దవిగ్రహంతో పాటు ఇవికూడా. ఇప్పటికి అక్కడే ఉన్నాయి. ఆ నాణేలు విజయనగర కాలం నాటివని వాటిపైనున్న లిపి మరియు సంకేతాల ఆధారంగా నిర్దారించారు. అంటే విజయనగర రాజ్యపు కాలంలో ఇక్కడ విరివిగా పూజాదికాలు జరిగేయని భావించవచ్చు. బహుశా ముడుపులుగా వేసినవో లేదా ఏదైనా నిర్మాణం కోసం వాడిన నాణేలో భూగర్భంలో కలిసి ఇప్పటికి దొరికివుంటాయి. విగ్రహాలు శిధిలమైన విధానం చూస్తే కేవలం వాతావరణ కోరివేత వల్లమాత్రమే అవిధ్వసం అయినట్లనిపించదు. ప్రత్యేకంగా శత్రుమూకల దాడిలో ధ్వంసం అయినట్లు సులభంగా అర్దం అవుతుంది. 
శిల్పం మధ్యలో ఇరుక్కున కుబుసాన్ని కూడా చూడండి
ప్రస్తుతం నిరుపయోగంగా వున్న పాఠశాల భవనం ఇదే

శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందిన నాణేలు బాలకృష్ణ భగవానునికి సంభందించినవి, బొమ్మవున్న వైపు బాలకృష్ణుడు కూర్చుని వున్న భంగిమ కనిపిస్తుంది. ఎడమకాలుని పూర్తిగా వంచి కింద కూర్చుని వుంటాడు. కుడికాలను మాత్రం కొంతవంచి ఎడమకాలుకి క్రింద పెట్టడం గమనించవచ్చు. కుడి చేతిలో వెన్నముద్దను పెట్టుకుని ఎడమ చేతిని ఎడమ మోకాలుకు ఆనించి వుంచిన భంగిమను గమనించవచ్చు. నారాయణావతారం అనిచెపుతున్నట్లు శంఖ చక్రాలను ఎడమ కుడి పక్కలలో గమనించవచ్చు.
ఇక బొరుసు వైపు శ్రీ ప్ర తా ప కృ ష్ణ రా య అనే అక్షరాలను గమనించ వచ్చు. 

రెండవరకమైన బంగారు నాణేలు రెండుతలల గంఢభేరుండ పక్షి రకానికి చెందినవి. బొమ్మ వైపు దీనిలో రెండుతలల గంఢభేరుండ పక్షి
పైపైకి ఎగురుతున్నట్లుగా చిత్రించి వుంది. ఇవి కూడా గుండ్రని నాణేలే, గంఢభేరుండ పక్షికి రెండు వైపులా ఒక్కో ఏనుగును చిత్రించారు.
పక్షి తన తోకను కాళ్ళను క్రిందవైపున ఆనించి వుంచింది. రెండు మెడలనూ కలుపుతున్న దగ్గర ఒక కంఠాభరణం వంటి నిర్మాణం వుంది.
బొరుసు వైపు గమనిస్తే శ్రీ ప్ర తా పా చ్యు త రా య అనే అక్షరాలున్నాయి. 

గుట్టకు వేరే దిక్కుల్లో ఆధారాలుండేవా?
కారుకొండ గుట్టకు పటమటి దిక్కు పల్లంగా వుంది ఆ వైపునే కారుకొండ చెరువు కూడా వుంది. అప్పట్లో ఏ బౌద్ధ ఆరామాన్ని లేదా చైత్యాన్ని గమనించినా నీటివసతిని ఆదరవుగా చేసుకునే వాటిని ఏర్పాటు చేసినట్లు గమనించవచ్చు. అదే విధంగా ఈ నిటివసతిని ఆధారంగా చేసుకున్నారని భావిస్తే. ఇక్కడ నివసించే వారి అవసరాలకు తటాకం వినియోగపడేదని భావించవచ్చు. పైగా చెరువునుంచి ఉదయం పూట తూర్పు దిశగా తిరిగి సూర్యనమస్కారం వంటివి చేస్తే అదే దిశలో ఈ బుద్ద శిలాగోళం కూడా కనిపిస్తూ వుంటుంది. అంతమాత్రాన మిగిలిన దిశల్లో ఎటువంటి ఆధారాలు ఉండవు అనుకునేందుకు ఏమీ లేదు. బౌద్ధారామాలు విలసిల్లిన చోట పెద్దపెద్ద నగరాలవంటి నిర్మాణాలే వుండేవి. భూగర్భంలో మరింకేమైనా చారిత్రకఆధారాలు దాగున్నాయేమో మరింత లోతుగా గమనించాల్సిన అవసరం కూడా వుంది.
కారకొండ చెరువు ఇదే
కారుకొండ తటాకం నుంచి కనిపిస్తున్న గుట్ట
సీతమ్మ పాదాలు
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళుతున్న బైపాస్ రోడ్ లోనే కారుకొండ గుట్టకు ఉత్తరదిక్కున రోడ్డుమీద సీతమ్మ పాదాల పేరుతో రాతిమీదున్న ముద్రలను పూజిస్తున్నారు. పెద్ద రాతిమీద వస్తువులను అరగదీయటం వల్ల ఏర్పడిన నున్నటి గుంటలు మూడు వున్నాయి. వాటి పక్కనే నునుపు దేలిన పొత్రంవంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాతిపనిముట్లకాలంలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లమాదిరిగా ఇవికనిపిస్తున్నాయి. ఈ క్యుప్యూల్స్ గురించి మరికొంత లోతుగా అద్యయనం చేయవలసివుంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎప్పటినుంచో జీవరాశివుండేదని ఆదిమానవులు ఈ ప్రాంతమంతా తిరుగాడారని ఇప్పటికే అనేక నిర్ధిష్టఆధారాలతో నిరూపించబడింది. మన రైల్వే మార్గమంతా సిస్టులు, కైరెన్లు అనబడే రాక్షసగుళ్ళమీదుగానే వెళ్ళిందని ప్రఖ్యాత చరిత్ర కారులు ఆదిరాజువీరభద్రరావుగారు పలుమార్లు పేర్కొన్నారు. అటువంటి ఆదిమానవుల ఆవాసాలకు జంతువులనుంచి ఎండావానలనుంచి రక్షించుకునేందుకు ఇలా చక్కటి కొండ పక్కనే వాగు వుండటం ఎంతైనా ఉపయోగకరమైన అనువైన ఆవాసం అవుతుంది. సహజంగా జైనం కానీ ఆ తర్వాతి బౌద్ధం కానీ ప్రాధమిక ఆవాసాలను ఆధారంగా ఆలంబనగా చేసుకునే వారివారి బసదులను పునర్నించారు. వాటిని ధ్వంసం చేస్తూ ఆ తదనంతర కట్టడాలు ఏర్పడ్డాయని చరిత్ర చెపుతున్న నిజం. 

సీతమ్మ పాదాలుగా పిలువబడుతున్న ప్రాంతం 
ఆదిమానవుల ఆవాసంగా ప్రతీకాత్మక చిత్రం

హేమచంద్రాపురం

కారుకొండ గుట్ట వున్న ప్రాంతం హేమచంద్రాపురం అనిపిలుస్తున్నారు. ఈ పేరురావడం వెనక వున్న కథను స్థానికులు చెప్పినదాని ప్రకారం. గతంలో ఈ ప్రాంతపై జమిందారుగా అధికారాలను స్వంతంగా 700 ఎకరాలను కలిగివున్న కొండపల్లి గోపాలరావుగారి అబ్బాయిపేరు హేమచంద్రరావు, ఆ హేమచంద్రరావుగారి పేరుమీదుగా ఏర్పడినదే హేమచంద్రాపురమట. అట్లాగే కారుకొండ గుట్టకు దక్షిణం వైపున వున్న జుబ్లీపురానిది మరో చిత్రమైన కథ స్థానిక CSI చర్చి జుబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా బిషప్ హజరయ్యగారిచ్చిన స్థలంలో ఏర్పాటయిన వాడకట్టుకు జుబ్లిపురంగా నామకరణం చేసారట. ఈ వివరాలను జూబ్లిపురం గ్రామస్థుడు శ్రీ కనక సుందరం తెలియజేసారు. ఈయన కొన్నాళ్ళు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారట. మొదట్లో ఎక్కువ కుటుంబాలుండేవి వారికోసం ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేసారు అయితే కాలక్రమంలో రోడ్డుకు దగ్గరగా వుండటం కోసం వారి ఇండ్లను హేమచంద్రాపురం వైపుకు మార్చడంతో జూబ్లిపురం జనాభా దానితోపాటే బడికొచ్చే పిల్లలు ఎవరూ లేకపోవడంతో బడి భవనాలు పూర్తిగా శిధిలాలుగా వదిలేసారు. నిజానికి వాటిని కారుకొండ గుహాలయాల విశిష్టతను తెలియజేసే మ్యూజియం వనరుగా అదేసమయంలో తాత్కాలిక వసతిగృహంగా కూడా వినియోగించుకునే ఏర్పాట్లు చేయవచ్చు. దానివల్ల అంత ఖర్చుతో నిర్మించిన భవనాలు వృధాగా శిధిలమైపోవడం కాకుండా సరైన పనికి ఉపయోగపడ్డట్లవుతుంది. అన్నట్ల ఈ భవనానికి నీటి వసతి, విద్యుత్తు కూడా అందుబాటులో వున్నాయి. 
గ్రామదేవతగా సడాలమ్మ పూజలందుకునేది ఇక్కడే
గిరిజనుల కొలుపులు ప్రతీకాత్మక చిత్రం

సడాలమ్మ దేవత

ఏదో రాయితెచ్చి పసుపుకుంకుం బొట్లు పెట్టి దణ్ణం పెట్టేస్తున్నారు పైగా కనీసం ఆకారం అందంగానైనా చెక్కిలేదు. తొచినదేదో చేస్తున్నారు గ్రామస్థులు అనుకుంటూ చాలా మంది సులభంగా ఈ గ్రామదేవతను తీసేస్తుంటారు కానీ కొంచెం లోతుగా పరిశీలస్తే గ్రామదేవతలు చాలా పురాతన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలు. మాతృస్వామ్య వ్యవస్థకాలంలో ప్రారంభమైన అమ్మదేవతల ఆరాధన పురుషాధిక్య సమాజపు కట్టడులనుతట్టుకుంటూ నిలబడి అనేక ఆనవాళ్ళను మనకోసం అందించేలా చేసింది ఈ గ్రామదేవతలు, సప్తమాత్రుకలు, గిరిజన దేవతలు వంటి వారే. అలాగే సమ్మక్క, సారలమ్మలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఎదిరించి నిలబడిన శౌర్యాన్ని రెండెళ్ళకొకమారు వచ్చే జాతర ఆధారంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ముసలమ్మ, నాగులమ్మ, సడాలమ్మ, బాపనమ్మ వంటి కోయ నారీమణుల గురించిన కథలు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆ సరిహద్దుల్లో వున్నాయి. కానీ ఆ కథలను చెప్పేవారు దొరకటం లేదు. పటం కధలు కులపురాణాల్లాగా కోయలలో డోలీలు కోయభాషలో ఆయాకథలను చెప్పేవారు. కానీ ఇప్పుడు అటువంటి వారే కనిపించడం లేదు. పైగా పోలవరం పేరుతో అత్యంత ఆదివాసులను ఉన్నచోటునుంచి తరలిస్తున్నాం. తిండి నీరు ఆవాసం దొరికేలా చేయగలమేమో కానీ వారి నరనరాల్లో ఇంకిపోయివున్న సంస్కృతి వారి తరంతోనే చచ్చిపోకుండా కాపాడగలమా. డిష్ యాంటెన్నా మధ్య, టెలిఫోన్ వైర్ల వలల్లో వారి జీవితాలు చిక్కుబడి గందరగోళపడిపోకుండా సాఫీగా నడిచేలా చేయగలమా? ఈ సడాలమ్మ కథకూడా ఎక్కడో ఏ గిరిజన డోలీ మెదడులో బ్రతికుందో వెతికి చెప్పించుకోలేకపోతే అది అతనితో పాటే చితిలో నిశ్శబ్దంగా కాలిపోవడం ఖాయం. పినపాక ప్రాంతంలోనూ సడాలమ్మ జాతర వసంతకాలం ఆరంభం అంటే మార్చినెలలో జరుగుతుంది. వనదేవత రాక సందర్భంగా లక్ష్మీదేవిని తోడ్కొని వెళ్లి కొండ ప్రాంతంలో వన దేవతకు ఎదుర్కోలు పలికి డప్పువాయిద్యాలతో గద్దెకు తరలించడం.. వనదేవత రాక సందర్భంగా పెద్దవాగు వద్ద సంతాన ప్రాప్తి కోసం అధిక సంఖ్యలో మహాళలు వేచి ఉండగా గిరిజన పూజారి వడ్డే వన దేవతను గిరిజన మహిళల పైనుంచి తోడ్కొని వెళ్లారు. తమకు ఆ వనదేవత దీవనెలు అందినట్లు భావిస్తారు. ఆ తర్వాత భక్తులు కానుకలు, బెల్లం, మొక్కుబడులను దేవతలకు సమర్పించుకుంటారు. రాత్రి వనదేవతను, సడాలమ్మ తల్లిని గోదావరికి తరలించి అక్కడ పుణ్య స్నానాలు చేయించి మళ్లి గద్దె పైకి తోడ్కొని రావడం అనేది గిరిజన ఆచారంగా పినపాక ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకోవడం మనం గమనించవచ్చు. 
ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రణాళిక 
తెలంగాణలోని బౌద్ధమత అవశేషాలన్నీ ఒకచోట చేర్చి అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. గత మే నెలలో నాగార్జునసాగర్‌లో ప్రజాప్రతినిధులకు శిక్షణా శిబిరాలు నిర్వహించినపు సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అక్కడ నిర్మాణంలో ఉన్న థీమ్ పార్కును సందర్శించి అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. ఇక్కడ ప్రపంచస్థాయి మ్యూజియంను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మ్యూజియంతో పాటు సుమారు 500 ఎకరాల్లో మైసూరు బృందావనం మాదిరిగా ధీమ్ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం యాదగిరిగుట్టలాగే ఒక ప్రత్యేక అథారిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇపుడు ఈ మ్యూజియంలోకి వివిధ బౌద్ధమత అవశేషాలను తరలించాల్సి ఉంది. సాగర్ డ్యామ్ పక్కన ఏర్పాటవుతున్న ఈ మ్యూజియంలోకి ఇంతకుముందు డ్యామ్ గర్భంలో లభించి తరలించిన పురాసంపదను వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది. అలాగే కాలచక్ర పేరుతో తరలించిన స్థూపాలు శిల్పాలు ఇతర ఆనవాళ్లను కూడా తీసుకురావాలి. నల్లబంగారంతో రాష్ట్రానికి సిరులవన్నెలద్దే ఈ ప్రాంతం ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా మారింది. దీనికి సహజంగానే వున్న అత్యంత అరుదైన పర్యాటక ఆకర్షణలను వెలుగులోకి తీసుకు రావడం వల్ల ఖ్యాతితోపాటు, పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది. 
Referance

ఈ గుహల గురించి ఆర్కియాలజీ వారు అధికారికంగా ప్రచురించిన సమాచారం ఇది
తెలంగాణ మ్యూజియం లో పొందుపరచిన బొమ్మ. రాతిగోళం చుట్టూ పిచ్చిపిచ్చిగా
మొక్కలూ వృక్షాలూ పెరగటాన్ని గమనించవచ్చు.

@ సడాలమ్మ : బుద్ద విగ్రహం దగ్గర్లో కొలువొందిన దేవత, సమ్మక్క సారలమ్మల లాగానే గిరిజన వీరవనిత కావచ్చని ఒక కథనం. పాండవులలో చిన్నవాడైన సహదేవుని పేరుమీదుగా ఈ సడాలమ్మ పేరు వచ్చి వుండొచ్చని మరొక కథనం 
@ దెగోబా : విచిత్ర మాంత్రిక గుహలు అన్న ఉద్దేశ్యంతో పెట్టిన పేరు. Dagobah is a solar system in the Star Wars films, The Empire Strikes Back and Return of the Jedi. It also appears in a deleted scene from Revenge of the Sith. Yoda went into exile on Dagobah after a lightsaber battle with Darth Sidious.
“That place… is strong with the dark side of the Force. A domain of evil it is. In you must go.” “What’s in there?” “Only what you take with you.”
The Cave of Evil, also known as the dark-side cave, was a large, dark side-infested hollow located under a gnarltree on the swamp planet of Dagobah. Entering the cave gave an individual the ability to see an apparition of a possible dark future.
@ గవిడి మంగయ్య గారు శ్రీకంఠ ఉమామహేశ్వరుని ఆలయం కోసం స్థల దానం చేసిన వ్యక్తి
@ కె సాయి గోపాల్ గారి తండ్రిగారి పేరుమీదుగానే హేమచంద్రాపురాన్ని గోపాలరావు జమిందారు గారు కట్టించారట. సాయిగోపాల్ గారు ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ లో మేనేజర్ గా చేస్తున్నారు నంబరు 9394775014
@ కనకసుందరం : మాజీ సింగరేణి ఉద్యోగి, జుబ్లీపురం వివరాలను తెలిపిన వ్యక్తి.
@ శ్రీ హరిప్రసాద్ : వృత్తిరీత్యా హిందీపండిట్ నాతోపాటు ఈ వివరాల కోసం పర్యటించిన మిత్రులు.

@ G.Chandra Reddy, ‘Rock-cut Buddhist Monuments of Karukonda’, PAPHC.
vol.12, 1988 (ఈ మెటీరియల్ ఇంకా దొరకవలసి వున్నది మిత్రులెవరిదగ్గరయినా అందుబాటులో వుంటే దయచేసి వివరాలివ్వగలరు)

from Blogger http://bit.ly/2hxMx2G
via IFTTT

Standard
History

తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు -మలయశ్రీ

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రేశరుడు. ఆరాధనీయుడు. ఆ మహనీయుని ధర్మప్రబోధం బౌద్ధం- దేశ విదేశాల్లో వ్యాపించింది. జనులకు నైతిక జీవనాన్ని ప్రసాదించుటతోపాటు గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని వ్యాప్తి చేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తన పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956నుంచి పునర్వికాస దశ పొందుతున్నది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యం.
అందుకు ఆధారాలు-
1. అశ్మక దేశ (మహాజనపదం) గోదావరి నదీ తీర (ద్వీప) కపిత్ధ వన నివాసి ‘బావరి’ ముని శిష్యులు 16 గురు, గురుని కోరికగా మగధకు వెళ్లి బుద్ధునితో సంభాషించి బౌద్ధులుగా మారి వచ్చి తమ గురువు బావరికి బౌద్ధ దీక్ష ఇచ్చిన కథ బౌద్ధ సుత్త పిటిక ‘సుత్త నిపాత-పారాయణ వగ్గ’లో ఉంది. అది క్రీ.పూ 6వ శతాబ్ది సంగతి. బావరి నాడు నివసించిన ప్రదేశం ‘బావన కుర్తి’ నేటి ‘బాదనకుర్తి’. (ఈ ఊహ ఠాకూర్ రాజా రాంసింగ్‌గారిది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి బాదవకుర్తి బావరి నివాస ప్రదేశమని నిర్ణయించింది నేను-2001. ఇది నా ‘కొండన్న కథ’లో ఉంది. బావరి విషయం ‘బుద్ధ బోధ’ పేరుతో మిసిమిలో వ్యాసం రాసిన, ‘తెలంగాణా సర్వస్వం’లోనూ నా ‘బావరి’ వ్యాసముంది. బుద్ధ-బావరి శిష్య చర్చను ‘బుద్ధ బోధ’ గేయకావ్యంగా ముద్రించిన-2010. ‘నిజమైన బౌద్ధం 2007 వ్యాసముంది)
2. ఆంధ్ర నటులు బింబిసారుని (మగథ-రాజధాని రాజుగృహ) సమక్షాన బుద్ధ జీవితం ‘మహాబోధి’ నాటకాన్ని ప్రదర్శించినట్టు ‘లలిత విస్తర’ గాథ పేర్కొంది. ఆంధ్రుల రాజధాని కరీంనగర్-కోటి లింగాల. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు.
3. బుద్ధుని శిష్యుడు మహా కాత్యాయనుడు అశ్మక రాజుకు బౌద్ధ ధర్మ దీక్ష ఇచ్చినట్టు ‘విమానవత్తు’లో ఉంది. అశ్మక రాజధాని పోతలినగరం-బోధన్ నిజామాబాద్. (పోతలి మొదటి తీర్ధంకరుడైన రిషభనాధుని రెండవ కుమారుడు బాహుబలికి రాజధాని. 24వ తీర్ధంకరుడు బుద్ధుని కాలపు వర్ధమాన మహావీరుడు. అంటే అశ్మక పోతలి అంతకు పూర్వపుదన్నమాట.
4. బుద్ధుని శిష్యుడు కొండన తెలుగు వ్యక్తి.
5. సెరివణిజు జాతకం ‘తెలివాగ’ నది దాటితే వచ్చే ఆంధ్ర నగరిని పేర్కొంది. తెలివాగ ఒరిస్సాలోని మహానదికి ఉపనది. కాని, దాని తీరంలో ఆంధ్రనగరం లేదు. అది ఓడ్రదేశం. తెలివాక-తెలివాగ, వాహ, అంటే తెల్లని ప్రవాహం-పాలేరు వలె. అది ఏ నదికైనా వాడవచ్చు. గోదావరిని తెలిగాహ-తెలివహ అనీ అనిరేమో నాడు. ఆ నది దక్షిణ తీర ప్రాచీన పట్టణం- కోటినగరం కోటిలింగాల-కరీంనగర్. కోట లింగాల తర్వాతి పేరు ఇప్పటి కోటి లింగాల. బౌద్ధ స్థూపాలు హిందువులకు శివలింగాలే. ఈ కోటి లింగాలలో దొరికిన ఆంధ్ర రాజుల (గోబధ, కంవాయ సిరి, నారన, సామగోప)నాణాలు భారతదేశంలోనే మొదటివి. శాతవాహనుల తొలిరాజధాని (చిముక) ఇదే క్రీస్తు తర్వాతనే కోస్తాంధ్రకు వారి వ్యాప్తి-్ధరణి కోట. కోటిలింగాల కొండాపురం తర్వాత ప్రతిష్ఠానం వారి రాజధాని. మగధను కూడా జయించి కొన్నాళ్లు పాలించి, కాలం కలిసిరాక వెనుతిరిగి స్థిరపడింది ధరణికోట-అమరావతిలో క్రీస్తు తర్వాత ఆచార్య మొదటి నాగార్జునునిది క్రీశ ఒకటవ శతాబ్ది. రెండు నాగార్జునుడు రెండవ శతాబ్ది. అమరావతి స్థూప ప్రాకారం ఇతని కాలపు నిర్మాణమే యజ్ఞశ్రీ శాతకర్ణికి ‘సుహృల్లేఖ’, కావ్యం రచించింది ఇతడే. ఈ ఇద్దరు బౌద్ధాచార్యులు నాగార్జున కొండ-విజయపురి నివాసులే.
తెలంగాణలో జిల్లాలవారీగా బౌద్ధ కేంద్రాలు- ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. మిగతా జిల్లాల వివరాలు ఇవి.
నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ- నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- న్యాలకొండపల్లి, అశ్వరావుపేట, కాపవరం.
ఇటు కొండలున్నా గుహా విహారాలు లేవు. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. వీటిలో కొన్ని నగరాలు మిగిలినవి స్తూప-చైత్యాలు. పై వాటిలో బాదనకుర్తిని కూడా చేర్చవచ్చు.
విశేషాంశాలు
కొటిలింగాల స్తూపం. ఇటీవల వెలువడిన చైత్య సూపం అమరావతి స్తూపం కన్నా పూర్వపువి. ఈ అభిప్రాయాన్ని బి.ఎన్.శాస్ర్తీ ఒప్పుకున్నారు. ధూళి కట్ట స్థూపమూ అంతే. ఇవి రెండూ కోట నగరాలు. కోటి లింగాలలో శాత వాసనులకు, పూర్వాంధ్ర రాజుల నాణాలు దొరికినై. కోటి లింగాల, ధూళికట్ట, కొండాపూర్ శాతవాహన చక్రవర్తుల పట్టణాలు. నాగార్జున కొండ మలి శాతవాహనుల కాలంలో, 3వ శతాబ్ది ఇక్ష్వాకుల కాలంలో అభివృద్ధి చెందింది.
గోదావరి తీర బౌద్ధ స్థావరాలు ధీరవాద బౌద్ధానివి, కృష్ణానది ప్రాంతానివి మహాయాన బౌద్ధ కేంధ్రాలు అనేది విశేషాంశం.కరీంనగర్ జిల్లా కప్పారావుపేట మునుల కొండకు, మంధని అడవి సోమనపల్లి గుహాలయాలున్నా మొదటిది జైనులది, రెండవది శైవులది.
న్యాలకొండపల్లిలో బుద్ధుని లోహప్రతిమ లభించింది. ఫణిగిరి విలువై న శిల్పాల స్తూపవిహారం. అది మహాయాన కేంద్రం మీర్జాపురం స్తూపం చిన్నదైనా దానిలో ధాతుపేటిక  దొరికింది.
పాశిగాం-పాయసి గ్రామం అయి ఉంటుందేమో. ఇదే దిజ్నాశుని నివాసం అని డా.వి.వి.కృష్ణశాస్ర్తీ అభిప్రాయం.
ధూళికట్ట నాగముచిలింద స్తూపం. ఆచార్య 2వ నాగార్జునుడు ప్రజ్ఞాపారమత గ్రంథాన్ని పొందినది ఒకానొక నాగరాజునుంచే. నాగార్జునుని జన్మస్థలం వేదలి. అది కృష్ణా జిల్లా యాజులి కావచ్చునని చరిత్రకారుల ఊహ. కాని ధూళికట్టకు సమీపంలోనే వెల్ది అనే పురాతన గ్రామం ఉంది. వేదరికి వెల్ది దగ్గరి పదం.
సాహిత్యాధారాలు
పాల్కురికి సోమనాధ బసవ పురాణంలో శైవేతర మతాల నిందలో బౌద్ధం పేరుకూడా ఉంది. ఎంతో కొంత వ్యాప్తిలో లేనిదే ఆ పేరు ఫ్రసక్తి ఉండదుకదా. కల్యాణి చాళుక్యుల కాలపు బెక్కండి మల్లారెడ్డి ఇక్కడి మతాలను పేర్కొంటు బౌద్ధాన్ని కూడా స్మరించారు.
కాకతి మొదటి రుద్రుని మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్‌లోని నగరూప త్రికూటాలయ శాసనంలోతాను బుద్ధదేవుని మందిరం నిర్మించినట్టు చెప్పాడు. అయితే అతని అభిమానం గౌతమ బుద్ధుడు విష్ణుమూర్తి దశావతార బుద్ధుడనే.
రామప్ప దేవాలయ గర్భగుడి గోడ వెనుక భాగాన ఒక బౌద్ధ సాధు శిల్పముంది.
రంగనాధ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డివరంగల్- నర్సంపేట వద్ద ‘బుద్ధారం’ ఊరుంది. ఇవి తెలంగాణలో బౌద్ధ మత వ్యాప్తికి నిదర్శనాలు.
14 అక్టోబర్ 1956న డా. బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారంతోనే భారతదేశంలో బౌద్ధానికి పునర్వికాస దశ. కానీ తెలంగాణలో ‘నవ దీక్షిత బౌద్ధులు’ తక్కువ. హైదరాబాద్‌లో కొందరు బౌద్ధులున్నా వాళ్లు కోస్తావాళ్లే. ఆదిలాబాద్ జిల్లాలో కొంతవరకు నవబౌద్ధం ప్రభావముంది. ఇటీవల 5,6 ఏండ్లనుంచి ఇటు బౌద్ధ సంఘాలు ఏర్పడుతున్నవి.
రచయిత ఫోన్ నంబరు : 

9866546220

from Blogger http://bit.ly/2gVSqaZ
via IFTTT

Standard
వివరణ, సమాచారం, History

మొహర్రం అనేది పండుగ కాదా?

మొహర్రం వేడుకల ఉత్సవం కాదు, వర్ధంతి విషాద జ్ఞాపకాలు,ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభం.
పీర్లు, నిప్పులగుండాలు, మాతమ్ ఏడ్పులు షియాల సాంప్రదక సంతాప పద్దతులు.
క్రీ.శ. 622 లో మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కానుండి మదీనా కు వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. “హిజ్రీ శకా”నికి మూలం ఇదే అంటే ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) ‘యస్రిబ్’ నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా(తెలుగార్థం: నగరం) లేదా “మదీనతున్-నబీ” లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు.
ఇస్లాంను కాపాడుకోవడం కోసం జరిగిన పవిత్ర యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ మోహర్రం నెలలో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందుతాడు. అప్పటి నుంచీ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూమ పది రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తారు. ప్రతిమా మూర్తులుగా పీర్లు ఊరేగింపు, న్యాయపోరాటానికి శరీర కష్టాన్ని లెక్కజేయమన్న నిప్పుల గుండాలు తొక్కటం, రక్తాన్ని చిందించటం “షహీద్ ” (అమరవీరుల ) నెల సందర్భంగా షియాలు గుండెలు బాదుకుంటూ మాతమ్ (శోక ప్రకటన) జరుపటం, నల్లటి వస్త్రాలను ధరించడం లాంటివి చేస్తారు. కానీ ముస్లిం సంప్రదాయాలకు హిందుత్వాన్ని పోలి వుండే ఈ పద్దతులు వ్యతిరేకం, ఈ విధానాలకు వ్యతిరేఖంగా పత్వాలను సైతం చేసారు. అయినప్పటికీ ప్రాధమికంగా మొహర్రం ముస్లింలకు సంబంధించింది అయినా కాలక్రమంలో భారతీయ సంస్కృతిలో భాగమైంది. తెలంగాణలో పీర్ల పండగగా ప్రాచుర్యం పొందింది. 
మొహర్రం వెనకున్న కథ
క్రీ.శ. 632లో మహమ్మద్‌ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) మనవలు. హజ్రత్‌ అలీ తనయులు. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమామ్‌ హసన్‌ను గద్దెదించాలనుకొన్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమామ్‌ హసన్‌ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్‌ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చలకోసం ఇమామ్‌ హుసైన్‌ రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్‌కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమామ్‌ హుసైన్‌ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్‌ పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని 4000 సైన్యంతో వచ్చిన సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలసి మొత్తం 108 మంది లోపు జనాలు ఇమామ్‌ హుసైన్‌ వెంట ఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్‌ హుసైన్‌ పరివారం స్వల్పమైనా వీరోచితంగా పోరాడి అశువులు బాసింది. యూఫ్రటీస్ నదీ తీరాన కర్బలా మైదానంలో జరిగిన ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా ‘షామ్’ (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు. పదోరోజు హుసైన్‌ ఒక్కరే మిగిలారు. ‘యజీద్ సైన్యం దాడి చేసి ఈయనను కూడా పట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమామ్‌ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజులు విషాద దినాలు.అప్పటి నుంచీ…ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మొహర్రం చేసుకుంటారు.
మొహర్రం నెలలో ఇమామ్ హుస్సేన్ ఆత్మ శాంతి కోసం ఉపవాసాలు ఉంటారు. నమాజ్ చేస్తారు,ఫాతెహా ఇస్తారు.షియా ముస్లింలైతే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రక్తం చిందిస్తారు. దీన్నే మాతం అంటారు. 
పీర్ల పండుగ 
మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన అయిదవ అరోజు రాత్రి పంజోఁ కా పిఠారా లేదా తాబూత్ అనే పంజాల నుంచిన పెట్టెను, ముజావిరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ పంజాలకు విగ్రహాలకు పది రోజులు ఫాతిహాలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తాకృతిలో మరియు పంజాల రూపంలో కొలుస్తారు. ఊరేగింపు అయిన తరువాత రాత్రికి ఊరు మధ్యలో నున్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కణకణ మండే బొగ్గులుగా తయారౌతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది.
హసన్, హుస్సేన్ పేరులతో పాటు, వారితో పాటు ప్రాణా లర్పించిన వీరుల పీర్లను కూడా పట్టుకుని హసన్, హుస్సేన్ …. హైసాయి, జూలోయ్ అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేత బట్టి వుదృతంగా మారు మోగే సన్నాయి , డప్పు వాయిద్యాల మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ నిప్పుల గుండం మధ్య నుంచి నడచి పోతారు. ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చికితుల్ని చేస్తుంది. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడ కేకలతో మద్దతు నిస్తారు. ఆ విధంగా మృత వీరులైన హసన్, హుస్సేన్ లకూ తదితర అమర వీరులకూ జోహార్లు ఆర్పిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడచి వెళ్ళడం పీర్ల మహాత్యంగా కీర్తిస్తారు. ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాహాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. ఆలా హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీక. పేటికలో వుంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది. ఆంధ్ర దేశంలో వున్న ముస్లిములు అన్ని ప్రాంతాల లోనూ ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్బంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు
పీరుల్ని పీర్ల చావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. ఇస్లాంలో ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించే ముస్లిముల సంఖ్య తగ్గుతోంది. “ఊదు వేయందే పీరు లేవదు”. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి. 
పీరు
మొహరం నెలలో పదవ రోజు షహాదత్ ను సంతాప దినంగా పాటించ వలసిందిగా హుసేన్ అనుచర వర్గం నిర్వచింది. ఆ రోజున పీర్లు అనే హస్త్గాకృతులను ఊరేగించి, ఊరి యందు గల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్ర పరచి నిర్ణీత పేటికలో వుంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది. ముస్లిములు ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్బంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు. మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. 
పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా: టి. దోణప్ప గారు కూడ తమ జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు. పీరు అనే పదం సూఫీతత్వాని కి సంబంధించినది. పీరు అనగా గురువు, “ఆధ్యాత్మిక గురువు”. కానీ కొద్ది మంది ఈ “పంజా” లేదా “నిషాన్” లేదా “అలం” (జెండా) ను “పీరు” అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది. ఈ పంజా (పీరు) మొహర్రం నెలలోని మొదటి ‘అష్రా’ (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, ‘పంజా’ లేదా ‘అలమ్’ (జెండా). ఒక రాతిపై వున్న ఇటువంటి పంజా గుర్తు మేరకే హైదరాబాదులోని ఒక ప్రాంతానికి పంజాగుట్ట అనే పేరు వచ్చింది. ఇత్తడి పళ్ళాల్లాంటివి కర్ర లకు తొడిగి పీర్ల పండుగ లో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో, ఇమామ్ హుసేన్ మరియు వారి కుటుంబీకులు ఉపయోగించిన, కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు, ఈ రోజుల్లో, వారి అమరత్వాన్ని గుర్తించుకొంటూ, స్మరించుకొంటూ ఊరేగిస్తారు.
నిప్పుల గుండం

మొహర్రం పండుగలో ముఖ్యంగా మసీదుల ఎదుట అలాయి తవ్వుతారు. దానిలో అగ్నిగుండాన్ని రాజేసీ దాని చుట్టూ ప్రజలు, పీర్లు ఎత్తువారు, యువకులు అసోయి-దూలా ఆరతి- కాళ్ల గజ్జెల గమ్మతి, దూలదూలరే ఖాసీమా, దుమ్ము లేసరా ఖాసీమా, వివిధ పాటలతో నృతాలు

ఉపవాసాలు 
ఇస్లాం మతం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామె హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తారు. మొహర్రం 6,7,8,9న, 10న షహదత్ రోజు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. శోకమాసమని ముస్లింలు ఈ మాసంలో శుభకార్యాలు చేయరు. కొత్తదుస్తులు వస్తువులు ఖరీదు చేయరు. 
షర్బత్, రోటీలు 
కర్బాలా మైదానంలో ఇమామె హుస్సేన్, అయన అనుచరులు పిల్లలు, మహిళలకు యజీద్ సైన్యం కనీసం మంచినీరు కూడా ఇవ్వరు. ఆ పరిస్థితి నేడు ఎవరికీ రావొద్దంటూ ముస్లింలు నీళ్లు, లేక పాలలో బెల్లం తీపి, సోంపు కలిపి షర్బత్ తయారు చేసి తాపుతారు. ఆకలితో ఎవరూ మరణించరాదని చక్కర, ఎండు ఫలాలలతో రొట్టెలను తయారు చేసి దానం చేస్తుంటారు. ఆ కాలంలో హుస్సేన్ పెరుగు అన్నం సద్ది కట్టుకొని వెళ్లారంటూ నేటికీ పెరుగన్నం (బుత్తి) తయారు చేసి పంచుతారు. 
పులివేషాలు
పీర్లను పంజాలొ నెలకొల్పిన తరువాత ఆవేశ పరులైన ముస్లిం సోదరులు పులి వేషాలను ధరించి డప్పు ల వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి నృత్యం చేస్తూ, పులి చేష్టలను అనుకరిస్తూ, హుంకరిస్తూ పిల్లలను భయ పెడుతూ హంగామాగా వీధులన్నీ తిరుగుతూ పెద్ద పులి ఠీవిలో హుందాగా నడక నడుస్తూ పల్టీలు కొడుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి వ్వాచిస్తారు. ఈ ప్రదర్శనాన్ని అందరూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. పారితోషికాల నిస్తారు. ఇలా సంపాదించిన డబ్బును అఖరు రోజున ఆనందం కోసం ఖర్చు పెడతారు.
ధులా
ధులా అనే కళా రూపం, సర్కారు ఆంధ్ర దేశం లో కానీ, రాయలసీమ ప్రాంతం లో కాని ఎక్కడా కనిపించక పోయినా, తెలంగాణా ప్రాంతంలో మాత్రం అధిక ప్రచారంలో వుంది. ఇది ముఖ్యంగా శ్రమ జీవుల కళా రూపమనీ, అంత కంటే ముఖ్యంగా ముస్లింలు జరుపుకునే పీర్ల పండగకు సంబంధించిందనీ, జయధీర్ తిరుమల రావు గారు ప్రజా కళారూపాలు అనే తమ గ్రంధంలో వివరించారు. ఇది శ్రమ జీవుల కళారూపమైనా శ్రమ జీవులందరూ ఈ కళా రూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద అధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు, పాటకు సంబంధించిన ఆటకూ సంబంధించిన జానపద కళారూపం. ధులా కళా రూపానికి సంబంధించిన పాటల్లో గానీ, పదాల్లో గానీ అవి అతి చిన్నవిగానూ, అంత కంటే కథా వస్తువు అతి చిన్నది గానూ వుంటుంది. ముఖ్యంగా మొహరం పండుగల్లోజరిగే పీర్ల పండుగల్లో ధులా ఎక్కువ ప్రచారమైనా, ఆ కళారూపాన్ని తెలంగాణా పోరాట సమయంలో సాయుద దళాల్లో వున్న ముస్లిం సహోదరులూ, ఇతర శ్రమ జీవులూ కూడా ఈ కళారూపాన్ని బాగా ఉపయోగించు కున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపులలో వున్న వారందరూ వలయాకారంగా నిలబడి, ఒకరు పాటను ప్రారంభించి, ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒకే రీతిగా క్రమశిక్షణతో లయ బద్ధంగా ధులా పాటను పాడుకునే వారు

మొహర్రం గురించి చారిత్రక ఉటంకింపులు

తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య జూన్ 29, 1830న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహర్రం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు: షహరు(హైదరాబాదు)కు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆ తొమ్మిదో దినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు
హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ వూరేగింపు సాగుతుంది.
4వ నిజాం మీర్ అఫ్జలుదౌల్హా హయాంలో నిజాం పరిపాలన ప్రదేశంలో వర్షాలు పడక తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో ఆయన మతగురువులను, ప్రజలను ప్రత్యేక ఆరాధనలు చేయాలని, వర్షాలు పడాలని దేవుడిని వేడుకోవాలని కోరారు. ఆయన ఆదేశానుసారం మతగురువులు, ప్రజలు ప్రత్యేక ఆరాధనలు చేశారు. దీనితో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. కరువు పోయింది. 
దీనితో ఆయన తన సంస్థానంలోని అన్ని వర్గాల ప్రజల కోసం మసీదులు, దేవాలయాలు, ఆషూర్‌ఖానాలను నిర్మించాడు. అదే క్రమంలో డబీర్‌పూరలోని బీబీకా అలావా నిర్మించారు. అప్పట్లో గోల్కొండ ఖిల్లాలో ప్రతిష్ఠిస్తున్న ఆలంను డబీర్‌పుర బీబీకా అలావాకు మార్చారు. దీనితో షియా ముస్లింలు ఏటా 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు ఆలంను ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలావాను 1928లో 7వ నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ ఈ ఆషూర్‌ఖానాకు తుది మెరుగులుదిద్దారు. 
హిందూ ముస్లింలను ఏకం చేసే పండుగ
ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే తౌహీద్ (“లాయిలాహ ఇల్లల్లాహు”) అనగా సర్వేశ్వరుడైన అల్లాహ్ ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు. అరబ్బీ పదమైన ‘అహద్’ లేదా ‘వహద్’ అనగా “ఏక”, ‘వాహిద్’ అనగా ‘ఏక’ లేదా ఏకవచనము, దేవుడి విషయంలో ‘ఏక + ఈశ్వరుడి’ విశ్వాసం ఈ “తౌహీద్”.
తౌహీద్ కు వ్యతిరేకపదము షిర్క్, అనగా ఏకేశ్వరునికి భాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా బహుదైవారాధన . షర్క్, షిర్క్, షరీక్, షిర్కత్, ఇష్తెరాక్, ఇష్తెరాకియ, ఇష్తెరాకియత్ మొదలగు పదాలకు మూలం ష-ర-క. దీని అర్థం భాగస్వామ్యం, మిళితం, కలపడం, కలవడం, ఈ “షిర్క్”. షిర్క్ ను ఆచరించేవారిని ‘ముష్రిక్’లు అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు దర్గాలను సందర్శించి ఔలియాలతో నోములు, శరణుకోరటాలు, విద్యాబుద్ధులు, ఉపాధి, సంతానం, వివాహం మొదలగు విషయాల పట్ల తమ కోరికలు ప్రకటించి వాటిని పూర్తి చేయండని ప్రార్థనలు చేయడం మరియు వేడుకోలు చేసుకోవడం. అలాగే, పంజాకు (పీర్లకు), జెండాలకు, జెండామానులకు, జిన్నులకు, పాములకు (జిన్నులుగా భావించి), పాముల పుట్టలకు, ఔలియా నషానులకు ఫాతెహాలు చదువుతారు, నోములు నోచుతారు, ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం ఇది బిద్ అత్ మరియు షిర్క్ లు. ఈ విషయాలన్నీ అంధవిశ్వాసాలు, అంధ-శ్రద్ధల కోవలోకి వస్తాయి.
షియా నవాబుల కాలంలో ఈ సంప్రదాయం అన్నిచోట్లా ప్రాకింది. ఒకానొక కాలంలో ఈ పీర్లపండుగ ముస్లింల ముఖ్యమైన పండుగగా భావింపబడినది. కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడ పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. ముస్లిములలో ముఖ్యంగా దూదేకులా’ వారు ఆటలమ్మ, మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నారసింహులు, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ, అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి రెడ్డి, నబీగౌడు ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ, పరసలలోనూ పాల్గొనటం, దర్గాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు.
అరబ్బీ క్యాలెండర్ లోని నెలలు ఇవి
1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)
2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)
3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول
4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني
5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول
6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني
7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)
8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)
9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)
10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)
11. జుల్-ఖాదా: ذو القعدة
12. జుల్-హిజ్జా: ذو الحجة
హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.

ధన్యవాదాలు : ఈ సమాచారం అంతర్జాలంలోనూ, పత్రికలలోనూ ప్రచురితమైన వేర్వేరు ప్రదేశాలనుంచీ సేకరించినదే. మొత్తంగా ఒక క్రమంలో పెట్టడం మాత్రమే నేను చేసిన పని ఆయా సోర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు

from Blogger http://bit.ly/2dKIfly
via IFTTT

Standard
History

మరో శివాజీ సర్ధార్ సర్వాయి పాపన్న

సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా జనగాం దగ్గర కైలాస్ పూర్ గ్రామంలో గౌడ కులంలో  ఆగష్టు 18, 1650  లో జన్మించారు, తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవారు.పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు, తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు, కాని అతని మనసులో మాత్రం తెలంగాణా లో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని ఉండేది, అందుకోసం అతను గెరిల్ల సైన్యాన్ని తాయారు చేసాడు, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసే వాడు,1675 లో సర్వాయి పేట లో తన రాజ్యాన్ని స్థాపించాడు, తన సొంత ఊరు కైలాస్ పూర్ రాజధాని.
ఇతను శివాజీకి సమకాలికుడు, శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడాడు, 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు, పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు, 1678 వరకు తాటికొండ, వేములకొందాలను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు, 1700 – 1705 మధ్య కలం లో షా పుర లో మరొక దుర్గం నిర్మించాడు, అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీం నగర్ జిల్లా లోని హుసనాబాద్, హుజురా బాద్ విస్తరించింది, భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.

పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు, అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు, ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు, పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు, అతని రాజ్యం లో సామజిక న్యాయం పాటించేవాడు, తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు, అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు, అది నేటికి రూపం మారిన అలానే ఉంది.

పాపన్న గెరిల్ల సైన్యం తో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబ్ కు తెలిసింది, అతడు రుస్తుం దిల్ ఖాన్ కు భాద్యతలు అప్పగించాడు, రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసిం ఖాన్ ను పంపించాడు, శఃపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి, నెలలపాటు యుద్ధం జరిగింది, చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు, సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది, పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు, దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకున్నాడు, అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి, అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు, ఔరంగజేబ్ మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు, అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు.

1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వెల్లడ దీసారు.ఆదిలాబాదు జిల్లా నిర్మల్ లో జూలై 30, 2012 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టించబడింది.ఆగష్టు 18, 2012 నాడుకరీంనగర్ జిల్లా సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చే ఆవిష్కరించబడింది.

Standard
History

అష్ఠాదశ శక్తిపీఠాలు

దక్షయఙ్ఞ కార్యక్రమమే అష్ఠాదశపీఠాలకు ఏర్పడటానికి మూలం ఐనది. తాను జరపబోయే బృహస్పతియాగానికి దక్షుడు అందరిని ఆహ్వానిస్తాడు, తన కూతురు దాక్షాయణిని, అల్లుడు శివుడిని తప్ప. తన ఇష్టంతో సంబంధంలేకుండా దాక్షాయణి శివుడిని పెళ్ళాడటమే అందుకు కారణం. పిలుపు లేకుండానే, దాక్షాయణి యాగానికి వస్తుంది (పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవల్సిన అవసరంలేదు అనే ఉద్దేశ్యంతో ). అక్కడ దక్షుడు, ఇతరులు చేసిన శివనింద భరించలేక ఆమె యోగాగ్నికి ఆహూతైంది.

ఉగ్రరూపుడైన శివుడు, విషాదంతో దాక్షాయణి మృతదేహాన్ని భుజాన వేసుకొని, జగత్రక్షణ కూడా పక్కనబెట్టి, సంచరించసాగాడు. సృష్టి, స్థితి, లయంలో ఏ ఒక్కట్టి ఆగినా అనర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది అనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, విష్ణుదేవుడు, శివుడిని కార్యోన్ముక్తుడు చేయుటకై, తన చక్రాయుధంతో దాక్షాయణి మృతదేహాన్ని ఖండాలుగా చేస్తాడు. ఒక్కోభాగము ఒక్కోచోట పడ్డాయి అవి పడిన ప్రతీచోట శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి.
అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.

ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే 
అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా 
కొల్హా పురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా 
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా 
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ 
జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగల్య గౌరికా 
వారణాస్యం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ 
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనం 
సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం

శాంకరిదేవి శ్రీలంక (మొలభాగం)

శాంకరి – శ్రీలంక – అమ్మవారి మొలభాగము పడినచోటు త్రికోణమలై (ట్రికోమలీ) శ్రీలంక. త్రి =3, కోణ = కోణం, మలై = కొండ, త్రికోణాకారంలో ఉన్న కొండ మీద అమ్మవారు ఉన్నారు. గుడి భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది. కోణేశ్వరం దేవాలయాన్నే తిరు కోణేశ్వరం అని పిలుస్తారు. కున అంటే తమిళంలో తూర్పు అని అర్ధం. 2500 సంవత్సారలకు ముందు విజయుడు ఇక్కడికి రాజుగా రావడానికి ముందే దేవాలయం వుందని నమ్ముతారు. దేవాలయ పరిసరాలలో బయల్పడిన అనేక విగ్రహాల ఆధారంగా ఈ ప్రాంతం పల్లవులదే నని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని పరిరక్షించడంలో చోళ పాంఢ్యులు తమ వంతు కృషి చేసారు. తమిళ రాజు కులోత్తముడు ఈ దేవాలయానికి మరమత్తులు చేయించాడని ప్రతీతి.

కామాక్షీ దేవి, కంచి (వీపు భాగం)
కామాక్షి – కాంచీపురం, తమిళనాడు – మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగానూ, కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

 అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది అని చెపుతారు.  కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు.
శృంఖలాదేవి, పశ్చిమబెంగాల్ (ఉదరభాగం)

శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ – ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది. అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. పశ్చిమ బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లాలోని “పాండువా” అనే ప్రాంతాన్ని శక్తిపీఠంగా అందరూ విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ ‘మేళతాళలతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం ప్రత్యేకత.

మరొక కధనం ప్రకారం …ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరు, కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న ‘చోటిల్లామాత’ను అక్కడివారు శృంగళాదేవిగా ( శృంఖలాదేవి) భావిస్తారు.

చాముండి, మైసూరు, (కురులు)

చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక – అమ్మవారు చాముండేశ్వరీ దేవి. అమ్మవారి కురులు (శిరోజాలు) చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి పరమేశ్వరి, శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. “మహాబలాద్రి శిఖర” అనే కొండపై అమ్మవారు వెలిసారు కావున ఆ కొండ కాలక్రమములో చాముండికొండగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.  మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

జోగులాంబ, అలంపూర్ (పైదవడ)

జోగులాంబ – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది. మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు. జోగులాంబ ఉగ్ర రూపంలో ఉంటుంది, చతుర్భుజి గా కపాలము, గొడ్డలి, ఖడ్గము, పాన పాత్ర ధరించి, శవమును ఆశనముగా కలిగి, ఎడమవైపు తల తిప్పి మోకాళ్ళపై కూర్చొనిఉన్న ఒక శిరస్సు పై తన వృష్టభాగాన్ని ఆనించి, అరికాలు కనపడేలా ఎడమపాదం నేలపై ఆనించి, కపాలమును యఙ్ఞోపవీతంగాను, ఐదు ఆకులవలె వేలాడుతున్న కటిసూత్రం ధరించి ఉంటుంది. ఇది ఏడో అష్టాదశ పీఠం  పూర్వం హలంపురం అని పిలుపబడేదట. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.

భ్రమరాంబిక, శ్రీశైలం (మెడభాగం)

భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ – కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి. అమ్మవారి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెదరూపంలో (భమరము అంటే తుమ్మెద) అవతరించిందట. మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు. ఆ దేవి ముఖారవిందంపై వాలిన తుమ్మెదల గుంపు ఆ రాక్షసుడిపై దాడి చేయటంతో ఆ రాక్షసుడు మరణించాడు. ఆ తల్లి భ్రమరాంబికగా వెలసి, మల్లికార్జునుని వరించి శ్రీశైలంపై కొలువైందని పురాణాలు చెబుతున్నాయి.   శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన ‘సౌందర్య లహరి’ కూడా రచించారని చెబుతారు. దీనిని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. .

మహాలక్ష్మి, మహారాష్ట్ర ( నేత్రాలు)

మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర – కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నాలుగు చేతులతో అమ్మవారి నల్లరాతి విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉంటుంది. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకో కూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు.  అలనాటి కరవీర ప్రాంతమే ఈనాటి కొల్హాపూర్‌. అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశము. పూణెకు 240 కి.మి దూరంలో ఉత్తరాన కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయం ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి కొల్హాసుర రాక్షస సంహారం అనంతరం ఈ కరవీరప్రాంతం కొల్హాపూర్‌గా రూపాంతరం చెందింది. హిందూ ఆలయాలు సహజంగా తూర్పు ఉత్తరదిశగా ఉంటాయి. కాని ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమరదిశగా ఉంటుంది. ‘ఇక్కడ మరో ప్రత్యేకతేమిటంటే ఆలయంలో పశ్చిమాన ఒకచిన్న గవాక్షం ఉంది. సంవత్సరంలో మార్చి, సెప్టంబర్ నెలల్లో సూర్యాస్తమయ సమయంలో 3రోజులు సూర్య కిరణాలు ఈ కిటికీగుండా ప్రసరించి అమ్మవారి ముఖంపై ప్రకాశిస్తాయి. ఈ 3రోజులు ‘కిరణోత్సవాలుగా జరుపు కుంటారు. ఇది అష్టాదశ పీఠాల్లో ఆరోది

ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును. అమ్మవారి కుడిచేయి పడినచోటు, మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రం. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు.
ఇంకో కధనం కూడా ఉంది :
జమదగ్ని ఆఙ్ఞచే, తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు పరశురాముడు. ఆ శిరస్సు రూపంలో ఉన్న మాయా శక్తే ” ఏకవీర “,  పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అనికూడాఅంటారు. మిగిలిన రేణుకాదేవి శరీరం, భూదేవిగా పూజలు అందుకొంటోంది.

మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ – ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.

పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ – కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు… వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు.

కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.

గిరిజ – ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా – వైతరిణీ నది తీరాన ఉన్నది. అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ – కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం.

కామరూప/కామాఖ్యదేవి – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. శ్రీ కామరూపీ దేవి శక్తి పీఠం:
అస్సాం గౌహతి సమీపంలోని నీలాచలపర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు. అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వాడుకలోకి వచ్చింది. శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.

వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి. అమ్మవారి నాలుక పడినచోటు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతం. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన అమ్మవారు వైష్ణోదేవి. జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది.గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మూర్తిక్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ‘చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.

మంగళ గౌరి – గయ, బీహారు – పాట్నా నుండి 74 కిలోమీటర్లు. అమ్మవారి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఫల్గుణీనదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు. శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్. అమ్మవారి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి.

సరస్వతి – జమ్ము, కాష్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు. అమ్మవారి కుడిచేయి పడిన ప్రాంతం కాశ్మీర్లో ఉంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. పాకిస్తాన్ వాళ్ళు (పాక్ ఆక్రమిత కాష్మీర్) ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేసారు. చాల భాదాకరమైన విషయం :(. కాష్మీరీ పండితుల విన్నపంతో రోజూ ఆ శిధిలమైన గుడి దగ్గరక దీపం పెట్టడానికి ఒక పురోహితుడిని మాత్రం అనుమతిస్తారని వినికిడి. శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలు స్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.

అష్టాదశ శక్తి పీఠా ల్లో నాలుగు పీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
ఈ నాలుగు పీఠాలలోను అత్యుత్తమ మైనదిగా, బహుళ ప్రచారం లో ఉన్నది కర్నూలు జిల్లాలోని శ్రీశైలం. ఇది అమ్మవారి పరంగానే కాక శివుని పరంగా కూడా విశేష ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లిం గాలలో ఒకటిగా ఇక్కడ కొలువుదీరిన మల్లిఖార్జున స్వామికి విశేషమైన గుర్తిం పు ఉంది. తరువాత చెప్పు కోదగిన క్షేత్రం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జోగులాం బ ఆలయం. మిగిలినవి… తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వెలిసిన పురుహూతికా దేవి, అదే జిల్లా ద్రాక్షారామంలో కొలువైవున్న మాణిక్యాంబా దేవి.

from Blogger http://bit.ly/1oLFnBc
via IFTTT

Standard
History

మరో శివాజీ సర్ధార్ సర్వాయి పాపన్న

సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా జనగాం దగ్గర కైలాస్ పూర్ గ్రామంలో గౌడ కులంలో  ఆగష్టు 18, 1650  లో జన్మించారు, తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవారు.పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు, తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు, కాని అతని మనసులో మాత్రం తెలంగాణా లో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని ఉండేది, అందుకోసం అతను గెరిల్ల సైన్యాన్ని తాయారు చేసాడు, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసే వాడు,1675 లో సర్వాయి పేట లో తన రాజ్యాన్ని స్థాపించాడు, తన సొంత ఊరు కైలాస్ పూర్ రాజధాని.
ఇతను శివాజీకి సమకాలికుడు, శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడాడు, 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు, పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు, 1678 వరకు తాటికొండ, వేములకొందాలను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు, 1700 – 1705 మధ్య కలం లో షా పుర లో మరొక దుర్గం నిర్మించాడు, అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీం నగర్ జిల్లా లోని హుసనాబాద్, హుజురా బాద్ విస్తరించింది, భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.

పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు, అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు, ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు, పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు, అతని రాజ్యం లో సామజిక న్యాయం పాటించేవాడు, తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు, అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు, అది నేటికి రూపం మారిన అలానే ఉంది.

పాపన్న గెరిల్ల సైన్యం తో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబ్ కు తెలిసింది, అతడు రుస్తుం దిల్ ఖాన్ కు భాద్యతలు అప్పగించాడు, రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసిం ఖాన్ ను పంపించాడు, శఃపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి, నెలలపాటు యుద్ధం జరిగింది, చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు, సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది, పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు, దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకున్నాడు, అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి, అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు, ఔరంగజేబ్ మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు, అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు.

1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వెల్లడ దీసారు.ఆదిలాబాదు జిల్లా నిర్మల్ లో జూలై 30, 2012 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టించబడింది.ఆగష్టు 18, 2012 నాడుకరీంనగర్ జిల్లా సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చే ఆవిష్కరించబడింది.

from Blogger http://bit.ly/1k7qrwv
via IFTTT

Standard
History
మహిళ కాళ్ళవద్ద దేన్నో గుంచుతున్న మర్కటాన్ని చూడొచ్చు

బహుశా చాలామందికి తెలిసిన విషయాలే అయ్యుంటాయి. కానీ ఆశ్చర్యంగా అనిపించినవి కొన్ని పంచుకుందాం అనిపిస్తోంది.

1) 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా వుంటుంది. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. 

2) శిల్పాలనుంచి ఏం తెలుస్తుంది అనుకుంటాం కానీ, ప్రధాన ఆలయానికి ఇరుపక్కలా వున్న శివతాండవం 60 చిత్రాల వరుసలను అర్ధం చేసుకుంటూ నశించి పోయిందనుకుంటున్న నాట్య విధానాన్ని నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతి పేరుతో పునం రూప కల్పనచేసారు. 

3) ఇక్కడి నంది విగ్రహం స్పష్టంగా ” reef knot ” రెండువైపులా కనిపిస్తుంది. తాళ్ళని ఉపయోగకరంగా శాస్త్రీయంగా ముడివేయడం, మెలికలు వేయడం ఎప్పటినుంచో వాడుకలో వుందనే విషయాన్ని 800 సంవత్సారాల క్రితం నిర్మించిన ఈ ఆలయ శిల్పి స్పష్టం చెక్కి చూపించి నిరూపించినట్లయ్యింది. బహుశా ఇటువంటి ఆధారాలే లేకపోతే ఇవ్వన్నీ ఏ ఎంగిలీసు పద్దతులనుంచో అరువు తెచ్చుకున్నాం అటుండే వాళ్ళేమో.

ఇదే నందికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లు అచ్చంగా చూస్తుంటుంది. అలాగే ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. దాని శరీరం నునుపు, అలంకరించిన ఆభరణాలలోని నిశితత్వం స్పష్టంగా గమనించవచ్చు.

4) ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యిందట అయినా ఇప్పటికీ చాలా దృఢంగా కనిపిస్తోంది. 

5) శిల్పకళ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. హైహీల్స్ అప్పుడే వాడినట్లు చూపుతున్న శిల్పం ఒకటయితే, మహిళ యుద్దానికి వెళ్ళి వచ్చినట్లు ఆమె కాలి ముల్లుని ఒక పురుషుడు తొలగిస్తున్నట్లు చూపిన శిల్పం, అంటే జండర్ వల్ల కాకుండా చేసే పనిలో చొరవ వల్ల గౌరవం దక్కుతోందని అప్పుడే చెప్పినట్లయ్యింది. 
ముగ్గురు నాట్య కత్తెలకు కేవలం నాలుగు కాళ్లతోనే చెక్కేయటం, సంగీతాన్ని పలికించే రాతి నిర్మాణం (మేం తాకి చూసి ఆశ్చర్య పడ్డాం) స్థంభాలలోని సన్నని చెక్కుళ్ళ మధ్య దారం ఆడించేంత రంద్రాలను సుతారంగా ఏర్పాటు చేసారు. ఆలయం చుట్టూతా, స్థంభాలలోనూ కాకుండా రూఫ్ లో సైతం ఎన్నో పౌరాణిక చారిత్రక గాథలను చెప్పే వరుస శిల్పాలున్నాయి. వాటిని ఒక్కొక్కటి తీసుకుని వాటి అలంకరణ నేపద్యం, భంగిమలకు భాష్యం, సందర్భశిల్పాలలోని కథలు, చర్చించిన శాస్త్రీయ కళాత్మక అంశాలను పేర్చుకుంటూ వెళ్లే పనికి ఎవరన్నా పూనుకుంటే అదే పెద్ద పుస్తకం అయ్యేలాగా వుంది.

6) జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో కనిపిస్తుంటుందట, త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్నిచేసేంతలా ఫోటోలు లాంటి ఆధునిక ప్రక్రియలు లేని ఆ రోజుల్లోనే చెక్కారు.

7) ఇక్కడ వాడిన ఇటుకల గురించి కూడా ప్రత్యేకంగా చెపుతారు. అవికేవలం మట్టి కాకుండా ఏనుగు లద్దెతో మరికొన్ని పదార్ధాలు కలిపి తయారు చేసారట దాంతో గట్టితనం తగ్గకుండానే తేలికగా వుండే లక్షణాన్ని కలిగివుంటాయట. ఎంత తేలిక అంటే ఆ ఇటుకను నీటిలో వేస్తే తేలేంతగా.

8) దగ్గరలోనే కోట గుళ్ళు, రామప్ప చెరుపు, లక్నవరం వగైరా వున్నాయి.

9) ఒక ప్పుడు దాడులూ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఈ ఆలయసంపద ఇప్పుడు నిర్లక్ష్యపు దాడికి గురవుతోంది. నంబర్లు వేసి పీకేసిన భాగాలు చిందరవందరగా పడేసి వున్నాయి. ఎటువంటి ప్రత్యేక భద్రత ఆదరణ లేదు. మరింత శిధిలమయ్యే పరిస్థితులను నివారించి వాటికి భద్రత కల్పించే పనులు లేవు. కనీసం శాసనాలను శిల్ప సంపదను డిజిటైజ్ చేసి అధికారికంగా అందుబాటులోకి వుంచిన ధాఖలాలు లేవు.

ఈ రోజు పర్యటనలో తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

http://bit.ly/1e7kX4i

from Blogger http://bit.ly/1e7kX4k
via IFTTT

Standard
History

అలంపురం ఆలయాల కథలు

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె ప్రాణత్యాగం చేసింది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది.

ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడినది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం లు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి).

జోగులాంబ (ఐదవ శక్తిపీఠం) అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా అభివర్ణిస్తూ ఉంటారు.

ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.పాతకాలం నాటి జోగులాంబ గుడి 14 వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల దాడిలో శిధిలమయినది. కాగా, అమ్మవారి విగ్రహాన్ని మరియు అమ్మవారి శక్తులయిన చండి మరియు ముండి విగ్రహాలను బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలో 2005 వరకు భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతము శిథిలం కావించబడిన ప్రదేశంలోనే తిరిగి అమ్మవారి గుడిని పునర్నిర్మించారు. క్రొత్త గుడి చాల చక్కగా, అందంగా నిర్మించారు. అమ్మవారి గుడి చుట్టూ ఒక నీటి కోనేరు కట్టారు. ఆ గ్రామస్తులు చెప్పేదాని ప్రకారం జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రమయిన శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ కోనేరు ఆమెను శాంత పరుస్తూంటుంది.
అలంపురం జోగులాంబ విగ్రహం చాలా విచిత్రం గా ఉంటుంది. ఈమె కుర్చోని ఉంటుంది. తలలో చాలా జుట్టు ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు మనిషి పుఱ్ఱె ఉంటాయి.

నవబ్రహ్మ దేవాలయములు

నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు.

తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనేవి ఆ తొమ్మిది దేవాలయములు.వీటిలో బాల బ్రహ్మ పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించినారు.

తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉన్నది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు కలవు.
స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్ నందలి దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు కలవు.
పద్మ బ్రహ్మ దేవాలయం. ఇది కూడా పాక్షికంగా శిథిలమైపోయినది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం కలదు.
విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు.

ఆలయాల పట్టణం

పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి . 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

పురావస్తు ప్రదర్శనశాల

ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉన్నది. దీనిని 1952 లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి.

సప్త మాతృకలు

ప్రాచీన కాలంనాటి ఇటువంటి ఆలయాలను దర్శించినప్పుడు, సప్త మాతృకల ప్రతిమలను మలచడంలో వాళ్లు తీసుకున్న శ్రద్ధాసక్తులు స్పష్టమవుతాయి. ఒకే వరుసలో పద్మాసనంలో కూర్చున్నట్లుగా కనిపించే ఈ సప్త మాతృకలు ఆనాటి శిల్పకళా వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి

బ్రహ్మణి’ … ‘మహేశ్వరీ ‘ … ‘కౌమారి’ … ‘వైష్ణవి’ … ‘వారాహి’ … ‘ఇంద్రాణి’ … ‘చాముండి’ దేవతలను సప్త మాతృకలు అంటారు.

దేవీ పురాణం … బ్రహ్మవైవర్త పురాణం … స్కంద పురాణం … సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి.

పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా ఆ రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించిన శివుడు … మహేశ్వరిని రంగంలోకి దింపాడు. ‘వృషభ’ వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించింది.

దాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి ‘హంస’ వాహనంపై … విష్ణుమూర్తి పంపిన వైష్ణవి ‘గరుడ’ వాహనం పై … కుమార స్వామి పంపిన కౌమారీ ‘నెమలి’ వాహనం పై … వరాహమూర్తి పంపిన వారాహి ‘మహిష’ వాహనం పై … ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ‘ఐరావతం’ పై … యముడు పంపిన చాముండి ‘శవ’ వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి. ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరించాడు.

కూడలి సంగమేశ్వరాలయం

మరోకటి కూడలి సంగమేశ్వరాలయం ఇది 1980 కి పూర్వం కృష్ణా తుంగభద్రల సంగమప్రాంతమైన కూడలిలో వుండేది.

తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలయాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా? అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి, విగ్రహాలు, గంగ, యమున, అర్ధనారీశ్వర , హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ అవస్థలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చర్యాన్ని గొల్పుతుంది.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రాజెక్టు ముంపుప్రాంతంలో వున్నందున. మొత్తం ఆలయాన్ని అలంపురానికి తరలించి పునర్నిర్మించారు. ఒక కట్టడం మొత్తాన్నీ అవే ఆధారాలతో నిర్మించటం దేశంలో ఇది తొలిసారి. ప్రపంచంలో ఇది రెండవది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులలో రెండవ పులకేశీ సమయంలో నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి అంచనాకు వచ్చారు కానీ ఇది 5200 ఏళ్ళకు పూర్వపు గుడి అని ద్వాపర యుగంలో ధర్మరాజు నింబదారు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పౌరాణికంగా నమ్ముతారు.ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి, లింగాల కోసం భీముడిని కాశికి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది
ఇక్కడ అపురూపమైన శిల్ప సంపదా దేవతా విగ్రహాలూ వున్నాయి.కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కాని వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ గ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణం వల్ల కర్నూలుకు ఆ పేరు వచ్చిందని చెప్పే ఒక ఆసక్తికరమైన కథ ఒకటి వుంది.

ఆలయ నిర్మాణాలకవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలంచే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారి కొక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలు గా మారింది.

శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా….. పురావస్తు శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని , పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ గ్రహాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాతం హైదరాబాదు లోని పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాలలో ఉన్నది. ఇది పబ్లిక్ గార్డెన్ లో ఉన్నది. నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉన్నది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

మొలక సీమ వైపు ‘నివృత్తి సంగమం’ కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని’ నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనదీ సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు.ప్రజల పాపా ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం.

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు.

from Blogger http://bit.ly/Mi5kw0
via IFTTT

Standard