Technical

ఫేస్ బుక్ ఫోటో ఆల్పం ను మిత్రులతో షేర్ చేసుకోవడం ఎలా?

ఫేస్ బుక్ లో ఫోట్ ఆల్బంను మిత్రులు కూడా వాదిదగ్గర వున్న ఫోటోలు అప్లోడ్ చేసేలా పంచుకోవచ్చు.
అంటే అదే సమావేశంలో లేదా సందర్భంలో దిగిన ఫోటోలను వేరువేరు మిత్రులు తీసినట్లయితే అవన్నీ ఒకే దగ్గర ఒకే అల్పంగా సేకరించుకుని కలిసి పంచుకునే అదనపు అవకాశం అన్నమాట.


తెలుగులో నల్లమోతు శ్రీధర్ గారి విడియో వివరణ ఈ లింకులో చూడండి.
http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ


Standard
Technical

దొంగలు ఎలా వుంటారు ?

పాత సినిమాలలో బాగా గుర్తు ఒక గళ్ళ లుంగీ, బుగ్గన చుక్క, మెడలో ఒక కర్చప్పూ పైగా మధ్య మధ్య వికటాట్టహాసం దొంగల్ని గుర్తుపట్టడం భలే సులభంగా వుండేది. ఇప్పుడేంటో ఒక్కడూ డస్సు కోడు కోడు మెయింటైన్ చేసి చావడు. డబ్బు కూడా రూపం మరిందనుకోండి బంగారు, వెండి నాణాల నుండి కాగితం ముక్కల నుండి కార్డుల్లోకి వచ్చేసింది డబ్బుకూడా ఎవడి పర్సైనా కొట్టేస్తే ప్లాస్టిక్ ముక్కలు దొరుకుతాయి కానీ రంగుకాగితాలు దొరికేలా లేదు.

ఇప్పుడు దొంగలు కూడా కొత్త టెక్నాలజీకీ అనుగుణంగా ఎదుగుతున్నారు. ( సో గ్రేట్ కదా 🙂 )

మీరు పాస్ వర్డ్ల్ ల్లా, అంకెల్లా ఆన్ లైన్ సాగరంలో దాచుకున్న డబ్బుల్ని గాలాలో వలలో వేసి పట్టేందుకు రకరకాల టెక్నాలజీలను కనిపెట్టారు. దీన్నే ముద్దుగా ఫిషింగ్ అంటున్నాం.

పైన నేనిచ్చిన బొమ్మలో ఏకంగా జీ మెయిల్ మీ అకౌంట్ ని త్వరలో డీ యాక్లివేట్ చేయబోతోందంటూ బెదరగొట్టి వాడిచ్చిన లింకులో మిమ్మల్ని లాగిన్ come అంటాడు. మనం హడావిడిలో స్వీయ అకౌంట్ సంరక్షణా దురంధరులమై, శంకు చక్రాలను మర్చిపోయి మకరపు నోటిలో చిక్కిన గజేంద్రుడిని సంరక్షించేయాలన్నంత ఆతృతలో పరిగెత్తుకెళ్లి వాడి బుట్టలో దడాల్న పడిపోతాం. వాడికి నిజంగా కావలసింది కూడా అదే.

కొంచె ఆగండి పంపిన వాడెవడో వాడు క్రింద రాసిన పేరులో కాకుండా, పంపిన ఈ మెయిల్ లో చెక్ చేసి చూడండి. ఇలాంటివి చాలా పాత టెక్నిక్లే కావటంతో మీరు ఆ మెసెజ్ లోని వాక్యాలతో సెర్చ్ చేసినా ఇదే పేరుతో గతం లో రిజిష్టర్ అయ్యిన పిర్యాదులూ వాటికి సంభందించిన వివరణలూ వచ్చేస్తాయి.

ఆన్ లైన్ ప్రపంచంలో  కూడా జరభద్రం,
మెడలో గొలుసులు కొట్టేస్తారని తెలిసిన చోట్ల ఎంత భద్రంగా వుంటారో.
అంతకంటె కొంచెం భద్రంగా వుండాలి ఇలాంటి వాటికి స్పందించే ముందుకూడా.

ఈ విషయాన్ని మీ మిత్రులకు చెప్పటం మర్చిపోకండి.

Standard
Technical

జిమొయిల్ రిమోట్ లాగ్ అవుట్

ఆఫీసులోనో, మిత్రుల ఫోన్లలోనో మీరు జిమెయిల్ లాగ్ ఇన్ అయ్యి అలాగే మర్చిపోయారా. ఇప్పుడు అసలు ఏయో అకౌంట్లలో లాగిన్ అయ్యారో తెలుసుకుని వాటినుంచి లాగ్ అవుట్ అవ్వాలనుకుంటుంన్నారా ?
దానికీ ఓ పద్దతి వుంది చూడండి.

1. gmail అడుగు భాగంలో Last account activity అని వున్న దగ్గర Details అని వుంటుంది దానిపై క్లిక్ చెయ్యండి.
2. మీకు పిక్చర్ లో చూపినట్లు పూర్తివివరాలు వస్తాయి.
3. మొత్తం అన్ని సెషన్ల నుండి వెంటనే లాగ్ అవుట్ కావచ్చు.

ఏదైనా అనుమానాస్పదంగా వేరే ip ల నుండి లాగిన్ అయ్యినట్లు అనిపిస్తే వెంటనే పాస్ వర్డ్ మార్చటం లాంటి రక్షణ చర్చలు చేపట్టవచ్చు

Standard
Technical

సిమ్ము కార్డు సిల్లీయేం కాదు

Subscriber Identity Module
చందాదారు గుర్తింపు గుళిక గురించి కొన్ని మాటలు….

ఇంత చిన్న ముక్క ఎంతగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటోంది.
మళ్ళీ ఇప్పుడు మరింత స్లిమ్ముగా మారిపోయి మిని సిమ్, మైక్రో సిమ్, నానో సిమ్, ఎంబెడెడ్ సిమ్ గా కనిపిస్తున్నాయి. జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ లు 2జి, 3జి ఇప్పుడిక 4జి కూడా నట జనరేషన్ కీ జనరేషన్ కీ మధ్య ఎంతో ఎదుగుదల.

వర్చువల్‌ సిమ్‌ పేరు విన్నారా ?

A virtual SIM is a mobile phone number provided by a mobile network operator that does not require a SIM card to connect phone calls to a user’s mobile phone.
ప్రపంచ సాంకేతిక రంగంలో ఇదో అద్భుతం. ఈ సరికొత్త ఆవిష్కరణ పేరులో సిమ్‌ అనే పదం ఉన్నా ఇది సిమ్‌కార్డ్‌ కాదు. ఇప్పటి వరకూ సిమ్‌కార్డ్‌ తీసుకోవాలంటే అనేక రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ తప్పనిసరి. కానీ వర్చువల్‌ సిమ్‌కు అలాంటిది లేదు. అయితే ఈమెయిల్‌ ఐడీ తప్పక ఉండాలి. దాంతో కేవలం మీ యూజర్‌ నేం, పాస్‌వార్డ్‌ టైప్‌ చేసి కొత్త నెంబర్‌ పొందవచ్చు. పోయిన సిమ్‌కార్డ్‌ నెంబర్‌నూ తిరిగి పొందవచ్చు. అంతేకాదు పోయిన మీ సిమ్‌కార్డ్‌లో డేటా కూడా తిరిగి సంపాదించవచ్చు. 2009 సంవత్సరం వరకూ డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌ అనే పదం చాలా మందికి తెలీదు. అంటే ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌కార్డ్‌లు వాడటం. అసలు అలాంటి మొబైల్‌ వచ్చిందన్న విషయాన్ని చాలా మంది నమ్మలేదు. ఇదే వింత అనుకుంటే…. ప్రపంచంలోనే మొదటిసారిగా నాలుగు సిమ్‌కార్డులతో ఉపయోగించే మొబైల్‌ ఫోన్‌ విడుదలైంది. దీనిపేరు ‘ఎఫ్‌ 160 క్వాడ్‌ సిమ్‌’

A SIM card contains its unique serial number Integrated Circuit Card Identifier (ICCID), international mobile subscriber identity (IMSI), security authentication and ciphering information.

The first SIM card was made in 1991 by Giescke and Devrient of Sagem communications in France.

PIN AND PUK : Personal Identification Number or PIN and a Personal UnBlocking code or PUK for unlocking .

Location Area Identity or LAI- This the information stored in the SIM about the local network available.

Phone cloning is the transfer of identity from one cellular device to another.

►Typical Diagram of Sim Card

A Sim Card have six pads that also corresponds to the six SIM connectors pins, but only five has totally have connection on the entire layout.

SIM DATA – this is a digital data that being stored on a SIM memory

SIM Clock – this is a clock frequency signal that being synchronize to the digital data to create data signal in order transfer or sends and receive data information.

SIM Reset – this is also a frequency signal that triggers or reset all synchronization process.

VSIM B+ Supply Voltage- This a power supply voltage used to activated the SIM circuit.
SIM Ground – a ground line voltage

The smartcard with Subscriber identity module application is generally known as
SIMCARD. But, In reality, the SIM is effectively a mass-market smart card.

Standard
Technical

సెల్ ఫోన్ రేడియేషన్ : కొన్ని జాగ్రత్తలు

సెల్ ఫోన్లు వాడటం ఇవ్వాళ ఒక తప్పనిసని అవసరమైపోయింది. వాడుతూనే వాటిలో రేడియేషన్ గురించి కంగారుపడుతుంటాం. ఏయో ఫోన్ లు ఎంత రేడియేషన్ ప్రభావం ( స్పెసిఫిక్ అబ్జార్ ప్షన్ రేట్ లో కొలుస్తారు ) వుందో. ఈ వెబ్ సైట్ లో సెల్ మోడల్ ను ఎంటర్ చేసి తెలుసు కోవచ్చు.

http://sarshield.com/radiation-chart/

Specific absorption rate (SAR) is a measure of the rate at which energy is absorbed by the body when exposed to a radio frequency (RF) electromagnetic field; although, it can also refer to absorption of other forms of energy by tissue, including ultrasound. It is defined as the power absorbed per mass of tissue and has units of watts per kilogram (W/kg). SAR is usually averaged either over the whole body, or over a small sample volume (typically 1 g or 10 g of tissue). The value cited is then the maximum level measured in the body part studied over the stated volume or mass.

తెలిసినవే అయినా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన కొంతలో కొంత ఉపశమనం పొందవచ్చు.

1. తక్కువ రేడియేషన్ ప్రభావం ఉండే ఫోన్లనే కొనండి
వీలైనంత, అతి తక్కువ రేడియేషన్ విడుదల చేస్తూ, మీ అవసరాలను తీర్చ గలిగే దానితో మీ ఫోన్ ను మార్చుకోవడాన్ని పరిశీలించండి.

2. హెడ్ సెట్ ను లేదా స్పీకర్ ను ఉపయోగించండి
ఫోన్ల కంటే హెడ్ సెట్ లు అతి తక్కువ రేడియేషన్ ను విడుదల చేస్తాయి. సెల్ ఫోన్ హెడ్ సెట్ కు సంబంధించిన మార్గదర్శకాలను గమనించి, వైర్ తో ఉండే, లేదా వైర్‌లెస్ రకం హెడ్ సెట్ ను ఎంచుకోండి (ఎటువంటి రకం క్షేమకర మైనది అన్న విషయంపై నిపుణులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు). కొన్ని వైర్ లెస్ హెడ్ సెట్ లు తక్కువ స్ధాయి రేడియేషన్ ను తెంపులేకుండా విడుదల చేస్తూనే ఉంటాయి అందుచేత, మీరు ఫోన్ మాట్లాడనపుడు హెడ్‌సెట్ ను చెవిదగ్గరనుంచి తీసివేయండి. స్పీకర్‌ను ఉపయోగించి ఫోన్ మాట్లాడడంకూడా మీ తల రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.

3. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి
మీరు మాట్లాడేటప్పుడు, సందేశాలను పంపేటప్పుడు కూడా మీ ఫోన్ రేడియేషన్ ను విడుదల చేస్తూ ఉంటుంది కానీ , మీరు సందేశాలను అందుకునేటప్పుడు మాత్రం కాదు. అందుచేత ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం అన్నది మీరు రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.

4. ఫోన్ ను మీ శరీరానికి దూరంగా వుంచండి
మీరు మాట్లాడేటప్పుడు (హెడ్ సెట్ తో గాని లేక స్పీకర్ తో గాని) ఫోన్ ను మీ శరీరానికి, అంటే ఛాతిభాగానికి, మొండేనికి దూరంగా వుంచండి , చెవివద్ద వుంచుకోవద్దు జేబులో పెట్టుకున్నా, లేదా బెల్టుకు తగిలించుకున్నా , మీ శరీరంలోని మృదువైన కణాలు రేడియేషన్‌ను తమలో ఇముడ్చుకోగలుగుతాయి.

5. మాట్లాడటం కంటే, సందేశాలను పంపడాన్నే ఎంచుకోండి
మౌఖికంగా కంటే, లిఖితపూర్వకంగా సందేశాలను పంపడానికి ఫోన్లు తక్కువ శక్తిని వినియోగిస్తాయి (అంటే తక్కువ రేడియేషన్). మీ చెవిదగ్గర ఫోన్ ను పెట్టుకుని మాట్లాడటం కన్నా లిఖిత పూర్వకమైన సందేశాలను పంపడం మీ తలను రేడియేషన్ కు దూరంగా ఉంచుతుంది.

6. సంకేతాలు (సిగ్నల్సు) బలహీనంగా ఉన్నాయా? అయితే ఫోన్ ను దూరంగా పెట్టేయండి
మీ ఫోన్ మీద తక్కువ గీతలతో సంకేతాలు కనిపిస్తున్నట్లయితే, సంకేతాలనందుకునే స్ధంబానికి (సిగ్నల్ టవర్) మీ సంకేతాన్ని చేరవేయడానికి అది ఎక్కువ స్ధాయిలో రేడియేషన్ విడుదల చేయడం జరుగుతోందన్న మాట. మీ ఫోన్‌లో సంకేతాలు బలంగా వున్నప్పుడే ఫోన్ చేయండి, లేదా అందుకోండి.

7. పిల్లల ఫోన్ వాడకాన్ని పరిమితం చేయండి
పెద్దలకంటె , చిన్న పిల్లల మెదళ్ళు రెండింతలు రేడియేషన్‌కు గురవుతాయి. అత్యవసరమైన పరిస్థితిలో తప్ప పిల్లల ఫోన్ వినియోగాన్ని పరిమితంచేయాలని కనీసం 6 దేశాలలోని నిపుణులు చేసిన సిఫార్సులతో ఇ.డబ్ల్యు.జీ ఏకీభవిస్తున్నది.

8. ‘రేడియేషన్ కవచాన్ని (షీల్డ్)‘ తీసివేయండి
యాంటెనా క్యాప్స్ , కీ ప్యాడ్ కవర్స్ వంటివి సెల్ ఫోన్ అనుసంధానత (కనెక్టివిటి) నాణ్యతను తగ్గించివేస్తాయి. అందువల్ల అలాంటి ఫోన్లు మరింత శక్తితో , మరింత రేడియేషన్‌తో పనిచేయవలసి వస్తుంది.

9. ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ ధిరపీస్ అనే ఆర్టికల్ లో డేవిస్. ఫోన్ ఉపయోగంలో బ్రెయిన్ లేదా శరీరానికి దూరం పెట్టడం సురక్షితమని తెలిపారు. స్మార్ట్ సెల్ ఫోన్ ల తో వచ్చే పుస్తకాలలో ఇస్తున్న హెచ్చరికలు సైతం ఫోన్ ను బ్రెయిన్ లేదా శరీరానికి దగ్గరగా వుంచవద్దని, లేదా పాకెట్ లో పెట్టవద్దని చెపుతున్నాయని ఆమె తెలిపారు

ఈ సైటు కూడా చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా వుంది.
http://www.electricsense.com/

Standard
Technical

డిక్టేషను సెప్పరా ఢింభంకా

డిక్టేషను సెప్పరా ఢింభంకా …. సెపితే కూడా కంప్యూటర్ యింటాది ?

బ్రౌజర్ లోనే డిక్టేషన్ చెప్పొచ్చు తెలుసునా సోదరా … హుకుం వాయరా…

http://ctrlq.org/dictation/

మైక్రొఫోను, క్రోమూ వున్న వారు ఇది వెంటనే పరిక్షించవచ్చు

మీరు కూడా మీ Windows లేదా Mac కంప్యూటర్లో ఏదైనా ఇన్స్టాల్ లేకుండా ఇక ఇమెయిల్స్ మరియు ఇతర ఆంగ్ల సమాచారం వ్రాయడానికి ఒక ఉచిత వాయిస్ గుర్తింపు సాఫ్టువేరు ను Google Chrome ద్వారా ఉపయోగించవచ్చు.

ఇచ్చిన బొమ్మలో మైక్రోఫోన్ ఐకాన్ ను గమనించారా
గూగులో క్రోము కొత్త వెర్షన్లో ఆఫ్ లైనులో కూడా పనిచేసే మంచి మాటల గుర్తింపు ఇంజిన్ ఉన్నాయి ఇంతకు ముందు వాటికన్నా ఇది సమర్ధవంతంగా తయాలు చేసారు. ఇప్పటి వరకూ వాడుతున్న కంఠస్వర గుర్తింపు సాప్టువేరులు కేవలం టెక్ట్సట్ బాక్సులకు మాత్రమే పరిమితం అయ్యివుండేవి.

కాని Dictation, Chrome టెక్స్ట్ బాక్సులకు మాత్రమే పరిమితం కాదు. ఒక ఆధారిత, ఒక స్వర గుర్తింపు అనువర్తనం దీనిని వాడే విధానం చూడండి.
1. కీబోర్డు షార్ట్కట్ Ctrl + Shift + ఉపయోగించండి. ( లేదా dictation మోడ్ మరియు చర్యను ఉత్తేజపరచటానికి పెద్ద మైక్రోఫోన్ ఐకాన్ క్లిక్ చేయండి.)
2. మీరు మాట్లాడేప్పుడు కానీ టైపుచేయబడుతున్నపుడు కానీ ఏవైనా తప్పులు దొర్లాయని అనిపిస్లే ఇన్ లైను లోనే క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు
3. మీరు ఒక క్రొత్త వరుస కావాలంటే “new line” అని మొత్తం మొదలు పెట్టేందుకు “delete everything” లాంటి పదాలను కూడా చెపుతూ కంప్యూటర్ తో రాయించుకోవచ్చు.

Standard
Technical

ఫేస్ బుక్ ఫోస్టు Url ఎలా తీసుకోవాలి ?

ఫేస్బుక్ పోస్లుకు ‘‘ permalink….’’ ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? బ్లాగులు, వెబ్ సైట్లలోని పోస్లులను ఉదహరించాలన్నా వాటిని ఎవరికైనా పంపాలన్నా వాటి వాటి url ( Uniform Resource Locator ) ను ఉపయోగిస్తాము. మరి ఫెస్ బుక్ లో మనవి కానీ మనకి నచ్చిన పోస్లులను కానీ లింకు గా ఇవ్వాలంటే ఈ permalink ఉపయోగపడుతుంది. http://www.facebook.com/photo.php?fbid=506877246003465 నోటిఫికేషన్లదగ్గరినుండీ ఇలానే మనం లింకు దగ్గరకు వెళుతుంటాం. కానీ సరాసరి పర్మనెంట్ లింకు ని పొందేదుకు మరింత దగ్గరదారివుందని తెలుసా? టైమ్ స్టాంప్ ని చూసే వుంటారు. 2hours ago, yesterday అలా పోస్టుచేసిన సమయాన్ని చూపుతూ సమయ సూచిక వుంటుంది. దానిపై రైట్ క్లిక్ చెయ్యండి. ఆప్షన్లు వస్తాయి. copy link address , copy url, ఇలా కావలసిన దాన్నిఎన్నుకోండి. అవసరమైనదగ్గర పేస్లుచేసి ఈ పోస్టును అక్కడ అందించవచ్చు. ఈ పోస్లు ఉపయోగపడుతుందనుకుంటే దీనితాలూకూ permalink… ను మీ వాల్ పై/ కామెంటు ఏరియాలో పేస్టుచెయ్యండి.

 1. Find the time stamp (it will say 3 hours ago, or something like that) under the post.
 2. Right click on the time stamp and select, copy link address
 3. Paste the URL into your entry comment on the blog!

Standard
Technical

కావలసిన ఫేస్ బుక్ వీడియోలను మీ వెబ్ పేజీలలోకి బ్లాగులోకి తీసుకోవటం ఎలా ?

ఈ వ్యాసం ద్వారా మీరు సులభంగా మీ వెబ్ పేజీలను మరియు బ్లాగ్ లో ఫేస్ బుక్ లోని విడియోలను పొందుపర్చటం తెలుసుకుంటారు.. మీరు కూడా ఫేస్ బుక్ లో ఒక ఖాతాను లేకుండానే ఫేస్ బుక్వీడియోలను చూడవచ్చు.

ఎవరైనా ఫేస్ బుక్సైట్ వీడియో క్లిప్లు అప్లోడ్ చేయవచ్చు కానీ YouTube మరియు ఇతర ఆన్లైన్ వీడియో షేరింగ్ సైట్ లు వలె కాకుండా, ఫేస్ బుక్(అధికారికంగా) వారి వీడియోలను కోసం ఒక ఎంబెడెడ్ కోడును అందించడం లేదు. ఆ రెండు కారణాల వలన ఒక సమస్య ఉంది.

1. మీరు ఫేస్ బుక్ లో ఒక ఆసక్తికరమైన వీడియో ను చూస్తారు దాన్ని మీ బ్లాగులో కూడా వుంచుకుంటే బావుంటుందని బావిస్తారు కానీ దానికి సంబందించిన కోడ్ మీకు దోరకదు. దాన్ని ఎలా పంచుకోవాలో అర్దం కాక తల పట్టుకుంటారు.

 2. మరో ముఖ్యమైన సమస్య మీరు పేస్ బుక్ లోని లాగిన్ అయిన తర్వాత మాత్రమే అందులోని విడియోలను చూడగలుగుతారు. మరి పేస్ బుక్ ఎకౌంట్ లేని మీ మిత్రులకు మీకు నచ్చిన విడియో మీ బ్లాగు ద్వారా చూపటం ఎలా ?
మీ వెబ్ సైట్ లోకి Facebook వీడియోను చేర్చుటం ఎలా

ఒక సాధారణ ట్రిక్ ద్వారా మీరు మీ వెబ్ పేజీల లోకి ఏ Facebook వీడియో నైనా ఎంబెడ్ చేసుకోవచ్చు.
విడియోను ప్లే చేస్తున్నపుడు బ్రౌజర్ చిరునామా చోటులో V= xxx లా విలువ వుంటుంది గమనించండి.

దానిలోని కోడ్ ను జాగ్రత్తగా కాపీ చేసి క్రింది కోడ్ లోని xxx విలువ దగ్గర దానికి బదులుగా విడియోకు సంభందించిన కోడ్ ను పేస్టు చేయండి.

ఇప్పుడు మీరు ఏ వెబ్ పేజీలలో కావలసిన దగ్గర ఈ కోడ్ ను ఉంచాలి. అంతే ఇతర ప్లాష్ విడియోల లాగానే ఈ ఫేస్ బుక్ విడియోను కూడా మీరు చూడగలుగుతారు.

Standard