Videos

1 లో అమ్మపాట రైమ్

1 (నేనొక్కడినే) సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే రైమ్ ఇది. స్కూల్ బస్ తప్పిపోతే ఇంటికి ఎలా చేరుకోవాలో కొన్ని కొండగుర్తులను కలిపి వాళ్ళమ్మ తయారు చేసిన రైమ్. పిల్లలకు న్యుమోనిక్ కోడ్స్ కొన్నిసార్లు బాగా ఉపయోగపడతాయి. నయమే ఈ సినిమాలో పిల్లాడు పెద్దయ్యేంత వరకూ హంసలున్న చెరువు, చెట్లూ వగైరా రోడ్ల వెడల్పులోనో, నగర బ్యూటిఫికేషన్ లో భాగంగానో కొట్టేసేయ లేదు.

0==========================0


పీటరు తాత స్ట్యాట్యూకీ
బై బై బై….. బై బై బై

హంసల ప్రెండ్సుకి హై చెప్పెయ్ 

హాయ్ హాయ్ హాయ్ ….. హాయ్ హాయ్ హాయ్


ట్రీస్ కి మధ్యన రోడ్డుంది
రన్ రన్ రన్…. రన్ రన్ రన్

స్ట్రెటుగ వస్తే టవరుంది… 

ఇట్స్ సో హై.. టిల్ ద స్కై


రైటుకి వెళ్తై హాంగిగ్ బ్రిడ్జ్..
ప్లై ప్లై ఫ్లై …. ప్లై ప్లై ఫ్లై

అది దాటొస్తే బ్యూటీ ఫామ్

 గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్

Peter Thatha Statue Ki 

Bye Bye Bye… Bye Bye Bye…!

Hamsala Friends ki Hai Cheppey… 
Hai Hai Hai … Hai Hai Hai…

Trees Ki Madyana Road Undi… 
Run Run Run … Run Run Run…

Straight ga vasthe tower undi…
Its So High .. Till The Sky

Right ki velthe Hanging Bridge…
Fly Fly Fly … Fly Fly Fly…

Adi Daatesthe Beauty Farm.. 
Green Green Green….
Standard
Videos

కవి సంగమం..కవితోత్సవం..


ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం తీరని దాహం అని అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇవాళ కవిత్వాన్ని తీరని దాహంగా భావించి సీనియర్ కవులతో పాటు కొత్తగా కలం పట్టి యువకవులు కూడా కవిత్యం రాయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అలాంటి వారికి చేయూతనిస్తూ కవిత్వాన్ని ఒక ఉద్యమంగా కవి సంగమం ముందుకు తీసుకెళుతోంది. కవిత్వం కావాలి కవిత్వం అన్న నినాదంతో రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో ప్రారంభమైన కవి సంగమం ఎంతోమంది యువ కవులను, కవయిత్రులను వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ లోని గోల్డెన్ త్రిశూల్ లో కవి సంగమం కవితోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సభకు ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షతన వహించారు. ప్రసిద్ధ గుజరాత్ కవి ప్రొ.శీతయశ్చంద్ర ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఆంధ్ర భూమి సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి, 10టివి సి.ఇ.ఓ, ప్రముఖ కవి అరుణ్ సాగర్, యాకూబ్, రాజేశ్వర్ రెడ్డి, కట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సంగమం కవులు, రచయిత్రులు రాసిన కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ కొత్తగా కవిత్వం రాస్తున్న కవులను వారి కవిత్వాన్ని మనం తక్కువ ఏమన్నా చూస్తున్నామా ? బహుశ వారు సాధించిన ఎక్స్ టెన్షన్ పాతకవులు అందుకోలేకపోతున్నారా ? ఆత్మ విమర్శ చేసుకోవాల్సినవసరం ఉందన్నారు.

స్థాయి పెరిగిన కవులు ఫేస్ బుక్ లో చొరబడి నాయకత్వం వహించే ప్రయత్నం చేయరాదని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు.
నేటి కవిత్వంలో లోపం కనిపిస్తోందని, వస్తువు, శిల్పం, అభివ్యక్తి భాగానే ఉన్నా డ్రైవింగ్ ఫోర్స్ గా కవిత్వంలో ఒక ఫైర్ కనిపించడం లేదని ఆంధ్రబూమి ఎడిటర్ ఎం.ఆర్.శాస్త్రి ఆధునిక కవిత్వ స్వరూప భావాలను విశ్లేషించారు.
గత 30-40 ఏళ్లుగా పొయెట్రి ఒకే తరహాలో వస్తోందని, ఒక కొత్త ఎడిషన్ ను కొత్త పదజాలాన్ని ఎన్ వి రాన్ మెంట్ నుండి స్వీకరించి పోయెట్రీలను పెట్టడమనే విషయంలో కొంత మిస్సవతున్నామేమో అంటూ ప్రముఖ కవి 10టివి సిఇఓ అరుణ్ సాగర్ అభిప్రాయపడ్డారు.
ఉద్యమాల సాహిత్యం కన్నా సినీ సాహిత్యం ఎక్కువగా వస్తోందని విద్యావేత్త రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న గుజరాత్ కవి ప్రొ.శీతాంశు యశస్ శ్చంద్ర మాట్లాడుతూ పాత రోజుల్లో కవులు గుర్తింపులేని శాసనకర్తలనే వారని..అయితే ఇవాళ ఎలా ఉన్నా పొయెట్స్ ప్రజల రీప్రెస్ మెంట్ అన్నారు. కవి సంగమంలోని కవులను అందరూ ప్రోత్సాహించాలని రాబోయే తరాల ప్రతినిధులైన కవులకు చేయూతనివ్వాలని కవి సంగమం క్రియేటర్, ప్రముఖ కవి యాకూబ్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో నగ్నముని తదితరులు ప్రసంగించారు..
కవిత్వపఠనం…
అక్షరం లక్ష మెదళ్ల కదలిక అన్నారు ప్రజా కవి కాళోజి. కవిసంగమం ఆధ్వర్యంలో పాతకొత్త కవుల మేలు కలయికతో కవి సమ్మేళనం జరిగింది. మధ్యాహ్నాం 2గంటలకు ప్రారంభమైన ఈ కవి సమ్మేళనంలో ఫేస్ బుక్ లోని కవులతో పాటు ప్రముఖ కవులు పాల్గొని తమ కవితలు వినిపించి శ్రోతలను అలరించారు.

తొలుత రాళ్లబండి కవితాప్రసాద్ ‘అగ్నిహింస’ కవితా సంపుటి నుండి ఒక కవితను వినిపిస్తూ చెట్లన్నీ విరామ చిహ్నంలా మనుషులంతా మాట్లాడుతున్న కవిత్వంలో ఉండేవారని చమత్కరించారు.

మొదటిసారి అన్ని మిగిలాయి. రెండోసారి ప్రాణాలు మిగిలాయి మూడోసారి ఊరుపేరు లేకుండా చెరిపివేస్తాం అంటూ గుజరాత్ గోడ మీది వ్యాక్యాల కవిత్వాన్ని ప్రముఖ కవి స్కైబాబా వినిపించారు.

నిజం నిపై కాల్చింది..నీరై ముంచింది..కాషాయమై మదింపు గుళ్లు లేకుండా చేసిందంటూ బలమైన అభివ్యక్తితో కవితను వినిపించారు షాజహాన.

అతడొక భక్త..అతడొక కొడుకు..అతడొక మనిషి..నడిరోడ్డు పక్కలో తెగిపడ్డ చెట్టులా కూలిపోయి ఉంటాడు.. అతడు మాత్రం సంసారాలను తెగనరికిన గొడ్డలిలా పడి ఉంటాడు. అంటూ తాగుబోతు గురించి ఓ అద్భుత కవితను వినిపించారు రేణుకా అయోలా.

కవి నిద్ర పోతాడా నిద్రను కలలకు కాపలా పెడుతాడు.. రెప్పల మీది బరువును అక్షరాల్లో దింపి అలసిపోతాడు.. అయినా విశ్రమిస్తాడా అంటూ ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి. కవితో పెట్టుకోకు అన్న కవితను వినిపించారు బి.ప్రసాదమూర్తి.

ఇళ్లను అద్దాలు చేసి తడిచిందే తుడిచి మసిబారిన గిన్నెల్ని మెరిపించేసి మురికి కొడుతున్న దుస్తులను తళతళలాడి చిన్నా చితక పనులెక్కెట్టు కోకుండా చేసిన పనిమనిషి కష్టాల్ని ఆర్ధ్రతతో వర్ణిస్తూ శిలాలోలిత ఓ మంచి కవితను వినిపించారు.

నా జీవన సంద్రంలో అటుపోటుల వలయం..నాలో ఎన్నో సునామీలంటూ కటుకోజ్వల రమేష్ తన స్వీయ కవితను వినిపించారు.

రేకులు విప్పాల్సిన బాల్యం రెక్కలు రాల్చుకుంటున్నది. విశాల విధ్వంస గీతాలు నిర్విఘ్నంగా హోరెత్తిస్తుంటే…అంటూ రఘువీర ప్రతాప్ బాలకార్మికులపై ఓ కవితను వినిపించారు.

ఆమె ప్రతిరోజు ఒంటిరిగా వంటగదిలో దుఖం పొయ్యి మీద ఎసరులా మరుగుతుంటుందని…మౌనశ్రీ మల్లిక్ సింబాలిక్ పొయెట్రీ వినిపించారు.

అడవిలో నిదురించిన వారికి తెలుస్తుంది వృక్షం కూలుతున్న చప్పుడు.. అంటూ విమల అద్భుత భావ చిత్రాలు రమణీయ దృశ్యాలు బొమ్మ కట్టిన పోయేట్రి వినిపించారు.

అక్షరాలను వెలుగుపూలతో అందంగా గుది అపురూపమై కవితా మాలికలల్లే సాదాసీదా కవి మిత్ర గురించి సాహిత్య ప్రకాశ్ పోయెట్రీ వినిపించారు.

నమ్మకం కాదిక్కడ అమ్మకం ప్రధానం అంటూ….జీవన వ్యాపారాన్ని సెటైరికల్ ఎక్స్ ప్రెస్ పైడి తెరేష్ బాబు ఓ కవితని ఆవిష్కరించారు.

బాసింగం గట్టుకున్నంత మాత్రానా మల్లన్నకు బాంబు అని అంటూ జూపాక సుభద్ర తన కవిత వినిపించారు.

అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది పురిటి నొప్పులు పడుతూ కాకపోతే నా కుడి చేతి మీద ముద్దు పెట్టుకుని లాలనగా నిమిరిందే మో అందుకనే ఈ కవిత్వం… అంటూ ప్రముఖ కవి యాకూబ్ కూడా అద్భుత కవితను వినిపించారు.

 ఇంకా ఈ కవి సమ్మేళనంలో గోరెంటి వెంకన్న కవులను వినిపించారు. ఎందరో కవయిత్రులు, యువకవులు తమ కవితలు వినిపిస్తూ అలరించారు.

కర్టెసీ : 10టివీ

Standard
Videos

‘రీయూనియన్’ గూగుల్ యూట్యూబ్ విడియో : మంచి విషయం తో ప్రభంజనం

గూగుల్ తన మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే చేసి వుండొచ్చుగాక కానీ ఈ ‘‘రీయూనియన్’’ విడియో నిడివి చాలా చిన్నది. కేవలం మూడున్నర నిమిషాలు మూడుగంటల సినిమాకంటే పెద్దవిషయాన్ని చెప్పినట్లు అనిపిస్తుంది. మనసున్న ప్రతిఒక్కరికండ్లలో నీళ్ళు సుడులు తిరిగి పెల్లుబికేలా చేసేసింది.
1947 లో భారత్ పాకిస్థాన్ లు విడిపోయిన తర్వాత వేర్వేరుగా ఇండియాలో, ఒకరూ పాకిస్థాన్ లో ఒకరు స్థిరపడిపోయిన ఇద్దరు మిత్రులు కలయిన దీనిలో ప్రధానాంశం. అడ్రసులు వెతుక్కోవటం, రూట్ మాప్ చూడటం, వేర్వేరు ప్రాంతాల వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం లాంటి విషయాలలో గూగుల్ ఇప్పుడు ఎంతలా ప్రధానాంశం అయ్యిందో అండర్ కరెంట్ గా చూపించటం ముఖ్యంశమే అయినప్పటికీ.విడియో చూస్తున్నంత సేపు అది గూగుల్ కోసం యాడ్ లా కాకుండా మామూలు విషయమే అన్నట్లు నడుస్తుంది.

ఇక కథాంశానికి వస్తే….

మిస్టర్ మొహ్రా ముసలి తనం లో తన చిన్నప్పటి పాత జ్ఞాపకాలను మనవరాలు సుమన్ తో పంచుకుంటాడు.తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు యూసఫ్ గురించి చెపుతాడు.  పార్క్ గేటు ముందు గాలిపటాలను ఎగరేస్తూ ఆడుకునే వాళ్ళమని, తర్వాత యూసఫ్ వాళ్ళ స్వీట్ షాప్ లో జఝరియా స్వీట్ (ఇది కూడా భలే ఎన్నుకున్నారు, భారతీయ పద్దతిలో తయారు చేసే పాకిస్థానీ తీపి) తినే వాళ్ళమని చెప్పిన ఆధారాలు షాప్ అడ్రస్ ను గూగుల్ పట్టిస్తాయి. మొహ్రా 60వ పుట్టిన రోజు (లాజికల్ గా ఇది తప్పు ఎందుకో మీకు సులభంగానే తెలిసిపోతుంది) బహుమతిగా ఆ ఇద్దరు స్నేహితులనూ కలపాలనుకుంటుంది. సుమన్.
గుగుల్ సహాయంతో అడ్రస్, కాంటాక్ట్ వివరాలు కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడుతుంది.( ఇక్కడ కూడా గూగుల్ చాట్ లాంటిది వాడి అతి కమర్షియలైజ్ చేయకుండా సహజంగా ఏంచేస్తామో అదే చూపగలగటం కూడా గూగుల్ గొప్పతనమే). యూసఫ్ మనవడు ఆన్ లైన్ టికెట్ బుక్ చేసి, ఢిల్లి వాతావరణం ఎలావుంటుందో గూగుల్ లో చెక్ చేసుకుని వస్తారు.
చివరికి ిఇంటి తలుపు కొట్టి ముందునిల్చున్న వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడే ననే విషయం తెలుసుకున్న విస్మయంలోంచి వచ్చిన ఆనందం. ఆ ఇద్దరు పెద్దవాళ్ళను కలపగలిగామన్న సంతృప్తినిండిన గర్వంతో సుమన్ కళ్ళు చెమ్మగిల్లటం ఖచ్చితంగా ప్రేక్షకులను కదిలిస్తుంది.
ఏమో ఇలా నన్నా పెద్దవాళ్ళ కోరికలకూ, జ్ఞాపకాలకూ విలువ వుంటుందనే స్పృహ పెరుగుతుందనే, యూట్యూబ్ లో ఈ విడియోను చూస్తున్న మిలియన్ల మిత్రుల సాక్షిగా అనపిస్తోంది.

ఎవరన్నారు మంచికి ఆకట్లుకునే స్వభావం లేదని……

This isn’t the first time Google has used a heart-wrenching story from the subcontinent to advertise its products. You may remember the true story of an Australian man adopted from India who used Google Maps to reconnect with his birth family.

ఇటువంటి చక్కటి విడియో తయారు చేయటం యూట్యూబ్ కు ఇదే మొదటి సారి కాదు గతంలో మనసుని మెలిపెట్టే ఖండాంతర కథనం ఒకటి గతంలో తయారు చేసిన విషయం గుర్తుండే వుంటుంది. భారత దేశం నుంచి దత్తత వెళ్ళిన ఆస్ట్రేలియన్ గూగుల్ మేప్ ల సహాయంతో తిరిగి తన పుట్టిన గడ్డకు చేరుకోవడం అనే కధాశం ఇది. అలాగే అది కూడా అంతే కేవలం మూడు నిమిషాల మూడు సెకన్ల విడియో అంటే ిఇప్పటి విడియో కంటే 30 సెకన్లు తక్కువ.

Standard
Videos

దాడులను శాస్త్రీయపద్దతిలో నియంత్రించలేమా?

కేవలం కడుపుమంటతోనో, ఆవేశంతోనే దూసుకొచ్చే మామూలు జనం తాలూకూ సెగలు కావచ్చు,
వారిలో కొంతమంది కావాలని చేరిన విద్వంసకారులున్న గుంపులు కూడా అయ్యి వుండవచ్చు.
ఏమాత్రం శిక్షణలేని పద్దతులు తెలియని గుంపులను ఎదుర్కొనేందుకు మన దళాలకు వున్న శిక్షణ ఎలాంటింది.
బషీర్ బాగ్ లాంటి, ముదిగొండలాంటి ఘటనలు జరిగినపుడు, ప్రభుత్వ దళాలు కూడా అనవసరమైన హడావిడికీ గందరగోళానికీ గుంపులతో సమానంగా దూకుడుగా వ్యవహరించి నష్టాలను కలిగించుకోవటం చూస్తున్న మనకి.

ఈ కొరియన్ సైనిక దళాలు, ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా గుంపుని ఎదుర్కోవటం చూస్తే,
తుఫానులూ, భూకంపాలూ, సునామీలే విపత్తులు కావు. ముట్టడులూ, ప్రజాస్వామికమనే పేరుతో నడిచే ఆవేశాలూ ఒకరకమైన విపత్తులే వీటి నిర్వహణకు మన దళాలకు ముందస్తుగా ఇటువంటి శిక్షణా ఏర్పాట్లు చేసుకోలేని దశలో వున్నామా మనం.

మాస్ ప్రొటస్ట్ కంట్రోల్ విషయంలో కొరియన్ దళాలు ఎలా వ్యవహరించాయో తెలుసుకోవాలనుకుంటే ఈ విడియో చూడండి.

బయటినుండి దళం మొత్తాన్నీ మైక్ లో ఒక కంఠం నిర్దేశించటం.
ఒక క్రమంలో వ్యూహాత్మకంగా ముందుకు రావటం.
గుంపు చేసే బలప్రయోగానికీ వారి దూకుడుకూ అనుగుణంగా ఎత్తుగడలను మార్చడం.
దుందుడుకుగా వచ్చేవారినీ, ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇతర పదార్ధాలను లంఘించి గుంపుమధ్యలోకి చేర్చి పక్కకి చేర్చి గుంపును సైకలాజికల్ గా బలహీనపరచటం.
ఎంత గందరగోళం జరుగుతున్నా ఒక ఉక్కు గోడలా వారి క్రమశిక్షణతో నిర్మాణాన్ని చెక్కచెదరకుండా నిలుపుకోవడం.
జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి విషయాలు చాలా అబ్బురం అనిపిస్తాయి.

మహా భారతంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చే వ్యూహం ‘‘పద్మవ్యూహం’’ పద్మం ఆకారంలో సైనిక నిర్మాణం చేసి శత్రువులను బంధించటం. అభిమన్యుడు దానిలో చిక్కుకున్న కథ చదువుకున్నాం.

ఈ మధ్య కాలంలో మెలూహా మృత్యంజయులులో కూడా అమిష్ ఇటువంటి ప్రక్రియలనే వివరిస్తాడు. NCC,స్కౌటింగ్ లాంటి శిక్షణలలో చెప్పే విషయాలు నిజజీవితంలో సమస్యలను ఎదుర్కునే దళాలకు ఇవ్వరా? ఏమో నాకా ప్రొఫెషనల్ డీలింగ్ సంఘటన ఎక్కడా గమనించినట్లు ఎరుకలో లేదు.

విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని, వ్యూహా శాస్త్రనిపుణులు వివరిస్తారు. సైన్యం తక్కువుగా ఉన్నప్పుడు ఎదుటి సైన్యం ఎక్కువుగా ఉన్నప్పుడు తమ తక్కువ సైన్యం ఎక్కువ సైన్యాన్ని గెలవడానికి వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి.

మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహాం, గరుడ వ్యూహాం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో కనిసిస్తున్నాయి. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆ పశువులు కానీ, ఆపక్షులు కానీ తమ శత్రువులతో ఎలా పొట్లాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు

చక్రవ్యూహం లో అభిమన్యుడు ప్రవేసించే చిత్రం రాతిపై శిల్పరూపంలో.

రోజువారీగా మహా భారత కథలో వర్ణించిన యుద్ధ విశేషాలు

వివిధ దినాలలో కురు పాండవ సేవలు పన్నిన వ్యూహాలిలా ఉన్నాయి.
యుద్ధం రోజు పాండవ వ్యూహం కౌరవ వ్యూహం విశేషాలు
1 వజ్ర వ్యూహం సర్వతోముఖ వ్యూహం కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు.
2 క్రౌంచ వ్యూహం త్రికూట వ్యూహం అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు.
3 అర్ధచంద్ర వ్యూహం గరుడ వ్యూహం భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు.
4  ?  ? అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది.
5 శ్యేన వ్యూహం మకర వ్యూహం పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రధికులను నిర్జించాడు.
6 మకర వ్యూహం క్రౌంచ వ్యూహం భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.
7 వజ్ర వ్యూహం మండల వ్యూహం కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు.
8 శృంగాటక వ్యూహం కూర్మ వ్యూహం భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.
9  ? సర్వతోభద్ర వ్యూహం భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్ధించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు
10  ?  ? భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు.
11 క్రౌంచ వ్యూహం శకట వ్యూహం కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు.
12 మండలార్ధ వ్యూహం గరుడ వ్యూహం సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణునివల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు.
13 (సాధారణ వ్యూహం) పద్మ (చక్ర) వ్యూహం
(తమ్మి మొగ్గరము)
ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు.
14  ? శకటవ్యూహం +
పద్మవ్యూహం +
సూచీవ్యూహం
ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.
15 ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు “అశ్వత్థామ” (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.
16 అర్ధచంద్ర వ్యూహం మకర వ్యూహం అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.
17 దుర్జయ వ్యూహం  ? దుర్యోధనుని ప్రార్ధననంగీకరించి కర్ణునికి సారధ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రధం భూమిలో దిగబడినపుడు అర్జునుడు అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు.
18 త్రిశూల వ్యూహం సర్వతోభద్ర వ్యూహం దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రధం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ “సౌప్తిక పర్వం”లో ఉంది.)

Standard
Videos

వయస్సెలా వస్తుంది?

కొన్ని అలా జరిగిపోతూవుంటాయి. తెలుస్తూ వుంటుంది కానీ ఖచ్చితంగా గమనించినట్లు అనిపించదు. చిన్నప్పటినుండీ మన మొహం చూసుకుంటూ వుంటాం ఏవేవో మార్పులు వస్తున్నట్లు తెలుస్తుంటుంది. మన కళ్ళముందే పుట్టిన పిల్లలు ఎదగటం గమనిస్తుంటాం. ఆధునిక సాంకేతికతతో ఆ మార్పును మన కళ్ళకు కడుతున్నారు ఈ ఐదు నిమిషాల విడియోలో…”వయసుపైబడుట” అనే పదం కొంత సందిగ్ధం అయినది. “విశ్వవ్యాప్త వృద్ధాప్యం” (సహజంగా ప్రజలందరిలో కలిగే మార్పులు) మరియు “సంభావ్యత సంబంధిత వృద్ధాప్యం” (వయసు పెరుగుతున్నప్పటికీ కొందరిలో మాత్రమే సంభవించే మార్పుల రెండవ రకం
The ageing process. 
The ageing process. Transformation from a child to an old age.The idea was that something is happening but you can’t see it but you can feel it, like aging itself.
వయసుపైబడటం, ఒక విశ్వవ్యాప్త మానవ అనుభవం, దీనిని మొదటిసారి ఒక అంశంగా 1532లో ముహమ్మద్ ఇబ్న్ యూసుఫ్ అల్-హరవి అనే వైద్యుడు ఇబ్న్ సిన అకాడెమి అఫ్ మిడీవల్ మెడిసిన్ అండ్ సైన్సెస్ ప్రచురించిన అతని పుస్తకం “ఐనుల్ హయత్” లో వ్రాసారు. ఈ పుస్తకం కేవలం వయసుపైడటం మరియు దానికి సంబంధించిన విషయాల ఆధారితంగా ఉంటుంది. “ఐనుల్ హయత్” యొక్క మూల వ్రాతప్రతిని 1532లో గ్రంథకర్త ముహమ్మద్ ఇబ్న్ యూసుఫ్ అల్-హరవి లిఖించారు. ఈ పురాతన గ్రంథం యొక్క నాలుగు వ్రాతప్రతులు ప్రపంచంలోని వివిధ గ్రంథాలయాలలో ఉన్నాయి. ఇది ప్రపంచంలో వయసుపైబడటం అనే విషయం మీద ఉన్న మొట్ట మొదటి పాఠ్యంశం అని ప్రకటించారు. ఈ నాలుగు వ్రాతప్రతులను అధ్యయనం చేసిన తరువాత హకీం సయ్యద్ జిల్లుర్ రెహమాన్ 2007లో దీనిని సరిదిద్ది అనువదించారు. ఈ సరిదిద్దబడిన పుస్తకంలో, వయసుపైబడుటకు సంబంధించిన ప్రవర్తన మరియు జీవన విధాన కారకాలు ఆహారం, వాతావరణం మరియు గృహ స్థితులు అన్నిటి గురించి 500 సంవత్సరాల పూర్వం రచయిత ఎంత అద్భుతంగా వివరించారో తెలుసుకోవచ్చు. ఈయన ఇంకా వయసుపైబడుటను పెంచే మరియు తగ్గించే ఔషధాల గురించి కూడా వివరించారు.
ఆయుర్దాయంతో జన్యు శాస్త్రం ముడి పడినట్లుగానే, దీనితో పాటు చాలా జంతువులలో ఆహారం అనేది ఆయుర్దాయంను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకంగా, కేలోరిక్ నియంత్రణ (అంటే తీసుకోవలసిన పోషకాలను తీసుకుంటూ జీవులు తీసుకునే యాడ్ లిబిటం కన్నా 30-50% తక్కువగా కేలోరీలను నియంత్రించుట), ఆయుర్దాయాన్ని 50% వరకు పెంచుతాయి అని కనుగొన్నారు. కేలోరిక్ నియంత్రణలు ఎలుకల మీదనే కాకుండా అనేక ఇతర జాతుల మీద కూడా పనిచేస్తాయి(వీటిలో విభిన్నమైన ఈష్టు మరియు డ్రోసోఫిల ఉన్నాయి), మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ (US)లో రీసస్ కోతుల మీద చేసిన అధ్యయనం ప్రకారం (విషయం పరిష్కారం కానప్పటికీ) ప్రైమేట్స్ జీవిత కాలాన్ని పెంచుటకు కనిపిస్తుంది, అయినప్పటికీ జీవితంలో ప్రాధమిక దశలోనే కేలోరిక్ నియంత్రణ మొదలు పెడితేనే జీవితకాలాన్ని పెంచుకోనవచ్చు అనేది గమనించ తగినది. ఎందుకనగా, అణు స్థాయిలో వయసు రెట్టింపు అయ్యే కణాల సంఖ్యను పట్టి లెక్కిస్తారు కాని కాలాన్ని పట్టి లెక్కించరు, కేలోరీ తగ్గుదల యొక్క ఈ ప్రభావం కణజాల పెరుగుదల ద్వారా మధ్యస్థం కాగలదు, కాబట్టి కణ విభజనల మధ్య కాలం దీర్ఘం అవుతుంది.
ఔషధాల సంస్థలు ప్రస్తుతం ఆహార ఉపయోగాన్ని తీవ్రంగా తగ్గించి వేయకుండా కేలోరిక్ నియంత్రణ యొక్క జీవనకాల-పెరుగుదల ప్రభావాలను అనుసరించు మార్గాల కొరకు అన్వేషిస్తున్నాయి.
Standard
Videos

నీలాగే ఒకడుండే వాడు ఫస్ట్ లుక్

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నందకిషోర్ కవిత్వం ‘‘నీలాగే ఒకడుండేవాడు’’ త్వరలోనే పాఠకుల చేతుల్లోకి రాబోతోంది.

నిజంగానే ఇలాంటి వాడింకెవరన్నా వుంటాడా??
ఏమో నాకయితే అనుమానమే..

కష్టం వెంటబడితరుముతున్నపుడూ,
సుఖం మెత్తగా నిదురబుచ్చినపుడూ,
ద్వేషం నిప్పులా కాల్చుతున్నపుడూ,
ప్రేమలు పాశాలై పెనవేసుకున్నపుడూ కూడా

కవిత్వాన్ని పలవరించేవారూ,
తనే కవిత్వమై పలకరించే వారూ వుంటారా??

చూస్తే పసితనమే, కానీ ఏదో తెలియని మేధస్సు నిండుగోదారిలా ప్రవహిస్తున్నట్లుంటాడు.
ఇన్నాళ్ళూ పేస్ బుక్ లోనే బుల్ బుల్ లై బులిపించిన అక్షరాల అలలు
ముద్రితమై మనచేతుల్లోకి రాబోతున్నాయి.

అక్షరాలా అక్షరాలలో బ్రతికే వాళ్ళకి పుస్తకం ఒక నిండుపండగే కదా..

పండుగ వేడుకకు స్వాగతం …

Standard
History, Videos

వేయి స్థంభాల గుడిపై వేయి పడగల నిర్లక్ష్యం

గుడిని 2004 నుంచీ ఇలా కూలగొట్టి కూర్చోబెట్టారు
భారత దేశం పై దండయాత్ర చేసిన శత్రువులు మన దేశ దేవాలయ శిల్పసంపదను ద్వంసం చేస్తేనో, తాలీబాన్లు బమియన్ బుద్దవిగ్రహాన్ని నాశనం చేస్తున్నప్పుడో బాధ అనిపిస్తే సాధారణమే,  కానీ స్వంతంగా మన ప్రభుత్వపు భాద్యతా రాహిత్యమూ, శ్రద్ధలేని తనం మూలంగా ముక్కముక్కలై వేయి శకలాలుగా కాకావికలమై పడిపోయి వున్న వరంగల్ వేయిస్థంభాల గుడిని చూస్తే అంతకంటే మరీ బాధనిపిస్తుంది. వందల సంవత్సరాలుగా ఎన్నో తుఫానులనూ, భూకంపాలనూ తట్టుకుని ఠీవిగా నిలబడ్డ నిర్మాణాన్ని ఈ రోజు కాళ్ళువిరగ్గొట్టి క్రింద పడేసి మళ్ళీ నిలబెట్టటమెలాగో తెలియక తలలు పట్టుకు కూర్చున్నారు.


ఎప్పుడో 11వ శాతబ్ధంలో కాకతీయ వంశ తేజం రుద్రదేవుడు చాళుక్య శైలిలో నిర్మించిన శివాలయం ఇది. 1163 లో

అంతకు ముందు ఇలా ఠీవిగా వుండేది

దీన్ని నిర్మించారు. నిర్మాణ కాలం 72 సంవత్సరాలు పట్టిందట. ఒక మీటరు ఎత్తుగా ముందు పటిష్టమైన ప్లాట్ ఫాం నిర్మించి దానిపై వెయ్యి అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన స్థంబాలను నిలబెట్టారు. ఆ నిలబెట్టటంలో గణిత నైపుణ్యం విక్షకుడు ఏ స్థానం నుంచి చూసినా దేవతా మూర్తికి ఇవి అడ్డుపడకుండా వుండేలా జాగ్రత్త పడ్డారట. సిమెంటు వాడకుండా నిలబెట్టటం కంటే ఇది మరీ ఆశ్చర్యం అనిపించింది. త్రికూటాలయం లో నక్షత్ర పీఠం పై రుద్రేశ్వరుడిని ప్రతిష్టించారు. త్రీకూటాలయంలో ప్రధాన దేవతా మూర్తులుగా శివుడు, విష్ణువు, సూర్యభగవాడు.

లావా జనిత ఎకశిలా నిర్మిత నిండైన నంది

ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా వుంటుంది. వేయిస్థంభాల గుడి దక్షిణాభిముఖమై వుంటుంది. ఇలా నిర్మించటంలో ప్రధానోద్దేశం ఉదయ సూర్యకిరణాలు సరాసరి శివుని తాకటం కోసమే అయ్యింటుందని చెపుతారు.(మళ్ళీ దీనిపై వాస్తు దోషమంటూ కొత్త ఆర్భాటం కొంత మొదలయ్యింది ఇప్పుడు) ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై వున్న నందీశ్వరుడు నల్లటి బసాల్ట్ ( లావా శిల) నుంచి మలచ బడిన ఏక శిలా విగ్రహం. అత్యద్భుతమైన పాలిషింగ్ తో నున్నగా వుంటుందీ విగ్రహం. నంది పై చెక్కన గంటలు లాంటివి చాలా స్పష్టంగా చెక్కారు. తుగ్లక్ కాలం లో తీవ్రమైన విధ్వంసానికి గురయ్యింది. మతపరమైన ద్వేషంతోనే కాకుండా విగ్రహాల వెనుక నిధిరహస్యాలుంటాయని వాటిని ఛేదించాలని కూడా శిల్పలను ధ్వంసం చేశారు. అందులో నంది కూడా దెబ్బతింది. ఈ గుడుల మద్యలో నాట్య మంటపం వుంటుంది. ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప

వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు వున్నాయి. కేవలం ఆధ్యాత్మిక అవసరాలకోసం మాత్రమే కాకుండా భద్రతను కూడా సైనిక అవసరాలనూ దృష్టిలో వుంచుకుని ఇక్కడి నుండి ప్రధాన సైనిక స్థావరాల వరకూ భూ అంతర్భాగంలో సొరంగాలున్నయట. ఒక సొరంగ మార్గం ఓరుగల్లు కోట వరకూ వుండేదట. కొన్ని శిధిల గృహాలను ఇప్పటికీ తలుపులు మూసే వుంచుతున్నారు బహుశా వాటిలోపలేవైన ద్వంసమైన సొరంగ మార్గాలుండి వుండవచ్చు కూడా. 


పీకేసిన స్థంభాలను సరిచేసి నిలబెట్టేందుకు 2004 నుంచి క్రిందా మీద పడుతూనే వున్నారు. పూర్తయిన పనులకు బిల్లులు రాక శిల్పకారులు వెళుతున్నారు. కొత్తవాళ్ళు వస్తున్నారు. పాతవాళ్లు సగంలో వదిలేసిన పని అర్ధం అయ్యికాక వీళ్ళూ వీళ్ళ పద్దతిలో మరికొంచెం చేసి వెళుతున్నారు. స్థానికంగా ఎటువంటి నిర్మాణ భాద్యతలు కానీ పరిశీనా భాద్యతలు కానీ ఇవ్వలేదు. కేంద్ర పరిశీలక బృందం ఎప్పుడొస్తారో ఏం పట్టించుకుని వెళతారో తెలియదు. పోనీ ఎప్పటికి పూర్తవుతుందని టార్గెట్ పెట్టుకున్నారో తెలియదు. ఇప్పటికి మూడున్నర కోట్లు ఖర్చు చేసారు మరెన్ని కోట్ల అంచనాలను పెంచుకుంటూ ముందుకు పోతారో. బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒక్కరోజులో చంపేస్తారా? గుడ్లు పెట్టినన్నాళ్ళూ గుద్దుతూనే వుండాలి. చారిత్రక సంపద పరిరక్షణలో ఇంతటి ప్రభుత్వ నిర్లిప్తత నిజంగా బాధగానే వుంది.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard