Uncategorized

కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచనా

1

ఏం చేస్తే..
సంతోషం హ్రుదిలో నిండుతుంది?

తళుకు బెళుకుల తక్కెడలో తారట్లాటొద్దు.
చేసుకుంటూ పో……… పని.

2

ఎలా వుంటే
ధైర్యం వెన్నుతడుతుంది ?
తావీజులేవో వుంటాయని తఖరారు పడొద్దు
కండకే కాదు, గుండెకూ సానపట్టేది ……… పని.

3

ఏ క్రమత్వంతో
ఆరోగ్యం స్థిరమౌతుంది ?
దేశ, విదేశీ విధానాలతో దిమ్మరివై పోవద్దు.
నిరంతర చైతన్య పూరకం పని.

4

ఏ స్వాంతనలో
దు:ఖం ఉపశమిస్తుంది ?
కన్నుతుడిచే చేయి, వెన్ను నిమిరే వొడికోసం
అంగట్లో అంగలార్చకు,
పోటెత్తే ప్రవాహంతో మరకల్ని తడిపేది ……… పని.

5

ఏ ప్రయత్నంలో
విజయం వరిస్తుంది ?
శిక్షణా కేంద్రాల శివారులలో మునకలేయోద్దు.
తానే అందలమై అలరించేది ……… పని.

6

ఎంతటి ప్రచారంతో
ప్రతిష్ట ఇనుమడిస్తుంది ?
వందిమాగదుల పోషణలో వున్నది హరించుకోవద్దు.
పరిఢవిల్లే ఫలితంతో పల్లకీ ఎక్కించేది ……… పని.

7

మరి

8

ఏ సాధనలో
ప్రశాంతత మదినిండా వెల్లివిరుస్తుంది ?
ప్రపంచాన్ని వదిలేసి మౌనంలో సమాధికావద్దు.
సమూహత్వం సిద్దించుకుని నీవే పనివై శబ్దిస్తే చాలు.

9

ఏ పద పదఘట్టన
పసతో కవిత్వం పనలెత్తుతుంది ?
జనాంతికంలో పునరావ్రుతి దోషంలేని పదం
……… పని. ……… పని. ……… పనే.

Advertisements
Standard
Uncategorized

test

var objectsQuery = “select id from object_url where url in (‘http://example.com/xyz’, ‘http://example.com/abc’, ‘)http://www.facebook.com/groups/kavisangamam/permalink/426604380725653’)”;
var likesQuery = “select object_id from like where object_id = {0}”;

FB.Data.query(objectsQuery).wait(function (objectRows) {
console.log(objectRows);

FB.Array.forEach(objectRows, function (objectRow) {
FB.Data.query(likesQuery, objectRow.object_id).wait(function (likeRows) {
console.log(likeRows);
})
});
});

Standard
telugu poetry

డబ డబ సోడబ్బా

భజనలూ, భుజకీర్తులూ

భాగ్య సంపదై భాసించేందుకు

కప్పల తక్కెడ తోక్కిసలాటలో

గంపగుత్తగా ఇస్తున్నార్ట.

చిడతలూ, బుర్రకధలూ

చెప్పుకుంటూ శోభిల్లేందుకు

తప్పని తిప్పల తాయిలాలతో

తయారుగానే వుంటుండాలట.

వందిమాగదుల వందనాలకై

వందల వరదలు వదలాల్సిందేనట.

బట్రాజ, భజంత్రీలకై

భవధీయులై భజించాల్సిందేనట.

ముంజేతి కంకణాలూ

ముంగిట్లో మంగళారతులు

ముందస్తుగా మాకనుకుంటేనే

మంది బలంతో మజా వస్తుందట

అంగట్లో నీ తూకం

వ్యర్దాలతో వేసుకుంటావా ?

ముంగిట్లో ఓ అర్ధం

సమర్ధతతో వెతుక్కుంటావా?

తెలుసుకునేదీ, తేల్చుకునేదీ

ఎవరో కాదు… నీలో నువ్వే

నీతో నువ్వే…

http://www.facebook.com/groups/kavisangamam/permalink/427192700666821/ 
సిరి.కట్టా

Advertisements
Standard
Technical

కావలసిన ఫేస్ బుక్ వీడియోలను మీ వెబ్ పేజీలలోకి బ్లాగులోకి తీసుకోవటం ఎలా ?

ఈ వ్యాసం ద్వారా మీరు సులభంగా మీ వెబ్ పేజీలను మరియు బ్లాగ్ లో ఫేస్ బుక్ లోని విడియోలను పొందుపర్చటం తెలుసుకుంటారు.. మీరు కూడా ఫేస్ బుక్ లో ఒక ఖాతాను లేకుండానే ఫేస్ బుక్వీడియోలను చూడవచ్చు.

ఎవరైనా ఫేస్ బుక్సైట్ వీడియో క్లిప్లు అప్లోడ్ చేయవచ్చు కానీ YouTube మరియు ఇతర ఆన్లైన్ వీడియో షేరింగ్ సైట్ లు వలె కాకుండా, ఫేస్ బుక్(అధికారికంగా) వారి వీడియోలను కోసం ఒక ఎంబెడెడ్ కోడును అందించడం లేదు. ఆ రెండు కారణాల వలన ఒక సమస్య ఉంది.

1. మీరు ఫేస్ బుక్ లో ఒక ఆసక్తికరమైన వీడియో ను చూస్తారు దాన్ని మీ బ్లాగులో కూడా వుంచుకుంటే బావుంటుందని బావిస్తారు కానీ దానికి సంబందించిన కోడ్ మీకు దోరకదు. దాన్ని ఎలా పంచుకోవాలో అర్దం కాక తల పట్టుకుంటారు.

 2. మరో ముఖ్యమైన సమస్య మీరు పేస్ బుక్ లోని లాగిన్ అయిన తర్వాత మాత్రమే అందులోని విడియోలను చూడగలుగుతారు. మరి పేస్ బుక్ ఎకౌంట్ లేని మీ మిత్రులకు మీకు నచ్చిన విడియో మీ బ్లాగు ద్వారా చూపటం ఎలా ?
మీ వెబ్ సైట్ లోకి Facebook వీడియోను చేర్చుటం ఎలా

ఒక సాధారణ ట్రిక్ ద్వారా మీరు మీ వెబ్ పేజీల లోకి ఏ Facebook వీడియో నైనా ఎంబెడ్ చేసుకోవచ్చు.
విడియోను ప్లే చేస్తున్నపుడు బ్రౌజర్ చిరునామా చోటులో V= xxx లా విలువ వుంటుంది గమనించండి.

దానిలోని కోడ్ ను జాగ్రత్తగా కాపీ చేసి క్రింది కోడ్ లోని xxx విలువ దగ్గర దానికి బదులుగా విడియోకు సంభందించిన కోడ్ ను పేస్టు చేయండి.

ఇప్పుడు మీరు ఏ వెబ్ పేజీలలో కావలసిన దగ్గర ఈ కోడ్ ను ఉంచాలి. అంతే ఇతర ప్లాష్ విడియోల లాగానే ఈ ఫేస్ బుక్ విడియోను కూడా మీరు చూడగలుగుతారు.

Advertisements
Standard
Uncategorized

మిత్ర పోత్తం

పుస్తకాల అల్మరా తెరిస్తే
ప్రపంచపు కిటికీ తీసినట్టే
ఓ చల్లటి గాలి మెల్లగా
ఒరుసుకుంటూ వెళుతుంది.

ఇక పొత్తన్ని తెరిస్తే
ఓ ముద్దుల పురాతన తాత
బుజ్జగింపులతో తలనిమిరినట్లే వుంటుంది.

అక్షరాల వెంట పరుగెడుతుంటే,
సత్తువ పెరిగి లోపటి జవసత్త్వాలు
ఇనుమడిస్తూ సెగలెత్తిస్తుంది.

భాష వెనుక బావం
ఎదలో ఇంకినపుడల్లా
తెలియని జల ఏదో
ఊరుతూ ఉరుకుతూ ఊరిస్తుంది.

ఆత్మీయత అచ్చొత్తుకుని
అనుభవాల పొరలెత్తే
అనుంగు మిత్రుల సాహచర్యం కూడా
దాచిన పుస్తకమంతటి
కమ్మటి వాసనలు వీస్తుంది.
అందుకేనేమో.

సిరి.కట్టా**27-07-2012

( అమ్మని, పుస్తకాన్ని యిష్టపడని వారు ఎవరుంటారు, కవితా వస్తువు పాతదే కాని నేను కూడా నా మాటల్లో చెప్పాలని పించింది.)http://www.facebook.com/groups/kavisangamam/permalink/426604380725653

Advertisements
Standard
telugu poetry

మేనియా

జ్వరం రావడం.
పిచ్చిపట్టడం లాగా.
కవిత్వ అబ్బటం కూడా…

ఓ ప్రమాదమే

నీకో…
పాఠకుడికో…

http://www.facebook.com/groups/kavisangamam/permalink/425333414186083/

Advertisements
Standard
telugu poetry

ఛా… బిస్కట్లబ్బాయి.

ఓ గుర్తింపుల
సభా తటాకంలో
కొన్ని కప్పలూ, మరికొన్ని చేపలూ..
లొడ లొడ లాడుతూ,
ఈదు లాడుతున్న వేళ
మెత్తటి కాగితప్పడవలా
అలజడేం లేకుండా చోచ్చుకువచ్చాడతడు.
అభిమన్యుడై

తన మొహంలో ఏ తహ తహా లేదు.
తన తాహతుకు తగ్గ విధి నిర్వహణ తప్ప.

అస్తిత్వాన్ని సమస్టిలోనే స్థాపించి,
అలసిన మెదళ్ళకు స్వాంతన చేకుర్చేందుకు,
తానే ఒక
తామరాకు పై కన్నీటి బొట్టైకదులుతున్నాడు.

పేరేమిటో, ఊరేమిటో, మరేం చదివాడో
తిన్నాడో,లేదో మదివున్నవాడో కాదో.
అనవసరాంశం సభాంశీభూతాలకు,

సభనుంచి చెదురుతూ ఓరగా అతనికై
వెతుకులాడే చూపులకు ఆ మొహం మాత్రం దొరకదు.

ఇతడు
తన కదలిక అలజడి కాకుండా
వంగి వంగి అలలేవీ రాకుండా ఈదులాడుతున్నాడు.
జితేంద్రియత్వం సాధించిన మునిలా
మౌన ముద్రను వీడకుండానే విధినిర్వహిస్తూ

ఇంతకీ నీకంటే సభికులే మేదావులా ?
ఇంత గాంభీర్యాన్ని తేన్చుతున్నందుకు..

http://www.facebook.com/groups/kavisangamam/permalink/422676184451806/

Advertisements
Standard