Uncategorized

కవిత్వాన్ని బతికించాలి

అంతరించిపోకుండా పదాలనెన్నో పదునెక్కించి వాడుకలోకి తేవటమేకాదు.
ఎప్పటినుండో పదునుని నిక్షిప్తంచేసుకున్న పొత్తాలను హత్తుకోవడమేకాదు.

లైకుకి కూడా ఓ పొడుగు కామెంటేసి, ఫేసుబుక్కు మరుపుపొరల్లోకీ ఇంకిపోకుండా
మళ్లీ మళ్లీ బయటికి లాగటం ద్వారాకూడా కవిత్వాన్ని కాపాడుతుండాలి.

నమస్కారానికి నమస్కారం సమస్కారమే కానీ
పేసుబుక్కుపోరాటంలో అదో మనస్కారం అయిపోయింది.

ఊపిరందక పడిపోయిన మనిషికి మళ్లీ మళ్ళీ ఆవిరులూది వత్తిడి చేసినట్లు
అడుగంటిన ఆశలను వదలకుండా కొట్టికొట్టి కొన్ని చుక్కలుగా బోరుబావినుండీ బయటికి తోడుకున్నట్లు.
జారిపోతున్న ఆశలాగా పడిపోతున్న కొన్నిలైన్లను కొట్టో కొట్టించుకునో బయటకులాగుతూనే వుండాలి.
ఎందుకంటే కవిత్వాన్ని బతికించాలి. కవితనాలను కూడా బతికించాలి.

Standard
Uncategorized

అహల్యా పరితాపం

ఏమైందసలు నీకు? ఎటుపోయావిన్నాళ్లూ? కవిత్వాపు రుచికూడా చూడటంలేదే ఈ మధ్య?
అలసత్వం ఆవరించిందా? ఆదమరిచావా? అజీర్తి గానీ చేసిందా?

నడిచినదారులే నలిగినపనులే ఎదురోస్తుంటే,
క్షీణోపాంతసిద్దాంతం పనిజేసిందా? ఉరికే జీవితపు పరుగులలో
కునుకే కినుక చూపుతుంటే.
ఊహాతటాకాల తీరాలు ఊరించటం మనేశాయా?

తోచిందల్లా మనసుగదుల్లోకి తోసేస్తుంటే
తడిలేని పదాలెన్నో లోపలికి దిగినా అరుగుదల జరగక అజీర్తి చేసి మరేకొంచెంకూడా లోనకి వేసుకుందామనిపించటంలేదా? 

వాడి వాడి వేడి తగ్గి వాడిన వాడిలేని భావనలతో లోతులేమీ
తవ్వలేక ఊటచలమలే ఇంకిపోయాయా?

ఓ లకుముకిపిట్టా ఎడారిదారులలో లొట్టిపిట్టవై
ఎక్కడెక్కడతిరుగుతున్నావురా ఇన్నిరోజులూ? కొయిలవే నీవైనా కూతేలేనపుడు చీకటితోసమానం. 

చిగురాకులు రుచిచూస్తుంటేనే, చిగురాశలు వెలికొస్తాయి.
చిరాకుగా పరాకు చెందితే జరూరుగా పరాయివౌతావు.

ఊటలుగా వెలికొచ్చే బావనలే నీభాషైనప్పుడు
ఉలిపై శిలకోసం సుత్తిదెబ్బలెందుకు?

http://www.facebook.com/groups/kavisangamam/permalink/464011036984987/

Standard
Uncategorized

మనిషంటే ?

మానవుడింతవరకూ క్రుత్రిమంగా జీవకణాన్ని స్రుష్లించలేదు దగ్గరగా వెళ్లాడంతే.
మనకి అందుబాటులో వున్న నాలెడ్జిద్వారా అర్ధం చేసుకోవాలంటే కంప్యూటరో, రోబోనో మరింత అడ్వాన్సుడు కండిషన్లోవున్న సెల్ప్ జనరేటింగ్ యంత్రం మానవుడు.

శరీరం హర్డ్ వేర్ (Hardware)…. తెలివితేటలు సాఫ్ట్ వేర్(Software)..

కానీ మనకింకా వున్న సాఫ్ట్ వేర్ లనే పూర్తిగా సరిగా వాడుకోవడమే రాలేదు…
ఇక OS ఇస్టలేషన్ ఎప్పటికి వస్తుందో..

హర్డ్ వేర్ కంపైలేషన్ జరగటంతో పుట్టుక అంటున్నామేమో..
సిస్టమ్ ఇర్రికవరబుల్ డిస్ఠ్రక్షన్ కి లోనవటమే మరణం..

మరణించాక మనకి తెలిసిన జ్ఞానం ప్రకారం హర్డువేరు ఏమవుతుందో మీకు తెలుసు ఖననం లేదా దహనం.. అంతేకదా. అంటే ఏవేవో మిశ్రమాలనుండి ఒకటిగా తయారయిన యంత్రం.. వేరు వేరు విశ్రమాలుగా విడిపోతోంది. ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం చూసినా నాశనం కాలేదు. మరి శక్తిరూపం లోని సాప్ల్ వేర్ ఏమయింది. తెలివితేటలు శక్లిరూపమేనా కాదా..ఇది చూడాలి..

ఇక ఈ యంత్రం పనిచేయటానికి పనికి అర్ధం ఏమిటి ? అతివిశాల స్వజాతి మనుగడను నిలబెట్టుకోవడమా ? నాశనం దిశగా నెట్టడమా ? రెండుకొసలలో ఏవైపుకు.. వెళుతున్న కొసలో ఎంత ఎత్తుకు ఇవే కనిపిస్లున్నాయి సోదరా మానవ జాతి చరిత్రలో..

ఏమన్నా అర్ధం అయ్యిందో లేదో… చెప్పండి..

Standard
Uncategorized

లోకపు కాకులు

తలోంచితేఅతివినయం ధూర్తుడవంటుంది.

తలెత్తితేతలబిరుసు మూర్ఖుడవంటుంది.

నవ్వితేనాలుగు విధాల చేటంటుంది.

మానితేనలభై రకాల చేదంటుంది.

కదిలినా, మెదిలినాబతికినా, చచ్చినా
తన కనుసన్నల కొలతలేనా అని సరిచూస్తుంది.

పాడులోకంఅనదలచుకున్నాక
నీ పనిలో తర్కాన్నేమీ చూడదు.

ఓ లకుముకిపిట్టానీవే న్యాయమూర్తివి
నడుస్తూఫో…

నడమంత్రపు మాటలకువిలువనిస్తూ కూర్చోకు.
అడుగుపడే ప్రతిదశలోనూ
మనసునడగటం మరువకుంటే చాలు.
తీరైన నడతలుగా మలచుకుంటే మేలు.

పనంటూ పూర్తయితేనేకొలతలకు అర్ధం
ప్రయత్నాన్ని మాన్పించే
పలుకులకు విలువేమిటి ?
http://www.facebook.com/groups/kavisangamam/permalink/456017034451054/

Standard
Uncategorized

కాలయంత్రం

భాషనేమీ వాడకుండానే, భాషణం చేయకుండానే,

బావాన్ని ప్రసరింపజేస్తూ, భాధ్యతలను గుర్తింపజేసే,

తత్త్వవేత్త గడియారం నీకేమని చెబుతోంది ?

నడకనెప్పుడూ ఆపకుండానూ, నడతనెప్పుడూ తొణకకుండానూ,

గతాన్ని కొలతలేస్తూ, భవిత ప్రశ్నలకు బదులిస్తూ

కాలజ్ఞాని గడియారం నీకేమని చెబుతోంది ?

అలుపెరుగని ప్రయాణానికి అర్ధం వినిపిస్తూ,

కూలబడే జీవనాల వ్యర్ధతలను వివరిస్తూ,

నిరంతర ప్రయాణంలోనే గడియారం నీకేమని చెబుతోంది ?

తనవైపే అందరూ చూస్తున్నా, కాలనికే కొలమానమై నిలుచున్నా,

గమ్యం వైపు గమనాన్నేమాత్రం ఆపకుండానే,

నిత్యక్రుషీవలునిగా గడియారం నీతో ఏం చెబుతోంది?

కొన్నిమాటలు, కొన్ని అర్ధాలూ

చెవితో వింటేనే వంటికెక్కతాయనకూడదు.

మనసు గదిలో ప్రతిధ్వనించే లబ్ డబ్ లకు తోడుగా,

జుగల్ బందీ యుగళగీతం టిక్ టిక్ మనే వేళ,

కొన్నిపొరలను పరుచుకుంటూ,

కొన్ని తలుపులు తెరుచుకుంటూ,

వినాలనే తలంపుని తయారుచేస్తేచాలు.

తను చెప్పేదొక్కటనే కాదు.

నీక్కావలసిందేదో కూడా వినిపిస్తుంది.

నీవెక్కడికి నడవాలో సెలవిస్తుంది.

లోలోపలి తిమిరాన్ని తరిమేస్తుంది.

వెలుగుల బాటలో నడిపిస్తుంది.
http://www.facebook.com/groups/kavisangamam/permalink/454455971273827/

( ఆలోచనా విత్తనాన్ని నాటిన Sister Mercy కి ధన్యవాదాలతో )

Standard