సమాచారం

మేల్ కొలుపు : మగవాళ్ళ దినోత్సవం

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో – 2012 అధికారిక నివేదిక ప్రకారం  వివాహితులైన పురుషులలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 63,343 ఇది వివాహితులైన స్త్రీల ఆత్మహత్యలు (31,921) కంటే రెట్టింపుగా వుంది. వేరుపడిన పురుషులలో 2043 మంది ఆత్మహత్యలకు  పాల్పడ్డారట మహిళలలో ఈ సంఖ్య 1240 గావుంది. తమ కుటుంబంలోని కలహాల వల్ల జీవితాలను చాలించిన మగవాళ్ళ సంఖ్య 7541 గా వుంది. ఇలా వత్తిడికి లోనవుతున్న వర్గంలో మగవాళ్లు కూడా వున్నారు గమనించండంటూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మరీ ‘మేల్’ తలపెట్టాలని కోరుతున్నారు. వృత్తి పరమైన వత్తిడులూ, కుటుంబం తాలూకూ భాద్యతలతో పాటూ ఈ మధ్య సమాజమూ, మీడియా దృష్టిలో దోపిడీ వర్గంలాంటి కోణం లోకి నెట్టివేయబడటమూ జరుగుతోందనేది కూడా వీరి ప్రధాన వాదన మార్చి 8 అంతర్జాతియ మహిళాదినోత్సవం సంతోషమే. మరి మగాళ్ళకు మీకెందుకు దినోత్సవం అంటూ మహిళా సంఘాలు విరుచుకుపడాల్సిన అవసరం ఏమిటనేదీ ప్రశ్నే?


ఇదేమీ ఒక్క దేశపు సమస్య కాదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
 (International Men’s Day) ప్రతి సంవత్సరం నవంబరు 19 తేదీన జరుగుతోంది. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగో లో 1999 లో ప్రారంభించబడినది. బాలుర పురుషుల ఆరోగ్యం పై శ్రధ్దపెంచడం. జెండర్ రిలేషన్స్ ని మెరుగుపరచడం. ఆదర్శవంతమైన రోల్ మోడల్ గా వున్న మగవాళ్ళను ముందుకు తీసుకురావడం తద్వారా కూడా వ్యక్తులలో అలముకుంటున్న చీకటి ప్రవృత్తులను తగ్గించేందుకు ప్రయత్నించడం. దోషాలను ఆపదిస్తూ ఏర్పడుతున్న, ఏర్పడిన ప్రతికూల వివక్షనుండీ నిజాల కోణాన్ని చూపించడం.లాంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో వుంచికుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థలోని ఏదో స్వార్ధపూరిత అస్తవ్యస్థత అన్నివైపులా తినేయాలని చూస్తున్నప్పుడు. కనీసం బాధ పడేవాళ్ళన్నా ఆ విషయాన్ని గమనించాలి. మగాడంటే మృగాడే ననే నేటి మారిపోయిన పరిస్థితులలో మీడియా సైతం వార్తాంశంగా తీసుకునేందుకు జంకుతున్నట్లుంది. నిజానికి అమ్మా, నాన్నా ఇద్దరూ సక్రమంగా వుంటేనే కుటుంబం సంతోషంగా వుంటుంది. సమాజం నడిచేందుకు కూడా స్ర్తీ,పురుషులిద్దరూ సమానంగానే కావాలి. 


(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
సమాచారం

సదర్ పండుగ : ఏ సాంస్కృతిక మూలాలనుంచి వచ్చింది?

సదర్ ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్న జనం
ఏంటీ పండుగ?
సదర్ పండుగ ప్రధానంగా పశువులకు ఇంకా చెప్పాలంటే దున్నపోతులకు సంభందించినది.

ఎప్పుడు జరుగుతుంది?

ఇది దీపావళి మరుసటిరోజు 

సదర్ అంటే అర్ధం ఏమిటి? ఇది ఏ భాషా పదం?

సదర్(सादर ) అనే పదం హిందీ నిఘంటువు ప్రకారం ‘‘ RESPECTFULLY ’’ అనే అర్ధంలో ఉపయోగించారు. అంటే గౌరవసూచకంగా ప్రదర్శించడం, గౌరవించడం అనే అర్ధంలో వాడి వుంటారనుకోవచ్చా. 
सदृश होना {sadaRash hona} అంటే TAKE AFTER అనే అర్దం వుంది.
सादृश {sadaRash} అంటే వున్న AGREEMENT అనే అర్ధమూ
सादृश्य {sadaRashy} అంటే వున్న APPROXIMATION అనే లాంటి అర్ధం కూడా ఈ పండుగ విధానానికి దగ్గరగానే వున్నాయి. ముస్లింల పాలనలో వున్న తెలంగాణా ప్రాంతానికి సంభందించిన పండుగ పేరు వెనకున్న అర్ధం కాబట్టి హిందీ ఉర్దూ మాటల నుండి ప్రయత్నించటంలో తప్పులేదను కుంటాను. 

Etymology ప్రకారం పరిశీలిస్తే

Hindi లో వాడుకలో వున్న ఈ పదాలలో sar అనేది Persian మూలంలోని అర్ధాన్ని తీసుకుంటే head అని dar అంటే holder అని తెలుస్తుంది. ఈ ఉత్సవంలో ప్రధానంగా తలను ఒడుపుగా పట్టుకుని దున్నపోతును వెనుక రెండు కాళ్లపై నిలుచునే లా చేస్తారు కాబట్టి కూడా సదర్ అని వుంటారని అనుకోవచ్చు.

ఎవరు చేస్తారు?

యాదవులకు ఇది ప్రధాన పండుగ, తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా నిర్వహిస్తారు. తమ ఉనికికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నామని యాదవులు తెలియజేస్తారు.

పూర్వ చరిత్ర ఏమిటి?గంగిరెద్దుల ఆటకు దగ్గరగా అనిపించే ఈ సదర్ ఉత్పవాన్నిపాతబస్తీలోని సైదాబాద్‌లో జరిగే యాదవ సదర్ వేడుకలను స్వయంగా నిజాం నవాబు స్వయంగా వీక్షించి ప్రోత్సహించేవారట. 

పండుగ సందర్భంగా ఏం చేస్తారు?

తమ దున్నపోతులను చూడ ముచ్చటగా సింగారించి… రాజదర్పంతో అలంకరిస్తారు. అలంకరణ కోసం మంచి

సదర్ ప్రదర్శనలో భాగంగా దున్నతో విన్యాసం

పువ్వుల దండలు వేస్తారు, కొమ్ములకు రంగులు వేస్తారు. శరీరంపై కూడా రంగులతో రకరకాలుగా అలంకరిస్తారు.సాంప్రదాయ సొబగులు అద్దుతారు. పూలదండలు, రంగులు, నెమలి ఈకలు, ఫించాలతో రమణీయంగా తయారు చేస్తారు. ఇలా అలంకరించిన దున్నపోతులను వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళతారు. గుంపుల్లో రకరకాల వాయిద్యాలు వాయిస్తారు. ప్రధానంగా మంచి హుషారిచ్చే తీన్ మార్ దెబ్బలకు జనం చిందేస్తుంటారు. అంతే కాకుండా ఈ జంతువులతో విన్యాసాలు చేయిస్తారు. ప్రధానంగా వాటిని వెనుక కాళ్ళపై నిలబడేలా చేస్తారు. వాటి ముట్టె బాగంలో ఒడుపుగా పట్టుకోవడం ద్వారా ఈ విన్యాసాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇలా చక్కటి విన్యాసాలు చేయించిన వారికి ప్రత్యేకంగా బహుమతులను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందుకాళ్ళను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రధానం చేస్తారు. దీనినుంచి బలమైన, నాణ్యతగల మన్నికైన దున్నలను ప్రదర్శిస్తారన్నమాట

ఉపయోగం ఏమిటి?

యాదవుల ఐక్యతకు, అస్తత్వానికీ ప్రతీకగా ఈ పండుగను చెపుతారు. పశువుల ఎడల తమకున్న శ్రధ్దను, వాటి పెంపకంలో తాము తీసుకున్న జాగ్రత్తలను తెలియజేయటం ద్వారా పశుసంపద పెంపొందించుకోవాలనే ఉత్సాహాన్ని పెంపొదిస్తుందని అంటారు. అలాగే ఇది మత సామరస్యానికి కూడా ఒక ప్రతీక గా చెపుతారు. 


ఇబ్బందులేమిటి?

అయితే ఈ విన్యాసాల సందర్భంగా కొన్నిసార్లు దున్నపోతులు అదుపుతప్పటం, దానివల్ల దగ్తరలోని జనం గాయాల పాలవటం కొండొకచో వ్యక్తులు మరణించడం జరుగుతోంది. జంతువుల మూపుపై కెక్కి డాన్సులు కట్టడాన్ని కూడా జంతు ప్రేమికులు నిరసిస్తున్నారు. అయితే సదర్ పండుగ ‘‘ బుల్ ఫైట్’’ ‘‘జల్లికట్టు’’ లాగా జంతువులను కష్టపెట్టి ఆనందించే ఆట కాదని, శ్రధ్దతో వాటిని అలంకరించి గౌరవించి వాటి విన్యాసాలను, తాము అదుపు చేయగల సామర్ధాన్నీ చూపెట్టే ప్రక్రియ మాత్రమే నని సమాదానంగా అంటున్నారు.
Standard
సమాచారం

ఏమిటీ నాగుల చవితి? ఎందుకీ ఆచారం ఇంతగా ప్రభలింది?

►నాగులు, గరుడులు, వానరులు, రాక్షసులు, అసు రులు వీరందరూ వేరువేరు జాతుల వారంటారు మనుష్యశాస్త్ర జ్ఞులు.

► భారతదేశంలో నాగులు చాలా చోట్ల ఉన్నట్లు తెలుస్తుంది. అస్సాం దక్షిణభాగంలో ఉన్న నాగాయ్‌ కొండలలో ఇప్పటికీ నాగ జాతివారు కొందరు ఉన్నారట. వారు అనా గరికులు.కాశ్మీరదేశంలో అనాది కాలం నుంచీ నాగులుంటూ వచ్చినట్లుగా గాథలున్నాయి కాని ఆ జాతివారు లేరు. అక్కడ ఒకచోటే కాదు, మన ప్రాంతాలలో అనేక ప్రాంతాల నాగులుండే వారని తెలుస్తున్నది.

► ఆంధ్రులు నాగజాతి వారంటారు. కృష్ణా నది దక్షిణ తీరాన నాగజాతి వారుండేవారని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తుంది.

► ఎట్లా వచ్చిందో తెలియదు కానీ వేశ్యా సమూహానికి తెలుగులో నాగవాసమంటారు. నాగవాస మన్నది సంస్కృత సమాసము. మరి దీనికి సంస్కృతంలో వేశ్యా సమూహమనే అర్థం ఉన్నట్లు తోచదు.

►బౌద్ధ ధర్మమంటే నాగులకెక్కువ అనురక్తి. బౌద్ధాన్ని ఎక్కువగా ఆచరించి, అవలంచిన వారు నాగులు. వారు బుద్ధునికి పరమ భక్తులు. బౌద్ధ వాఙ్మయంలో నాగులకు సం బంధించిన గాథలు చాలా ఉన్నాయి. ఏలాపత్రనాగుడు, ముచిళింద నాగుడు మొద లైన వారు బౌద్ధ గాథలలో ప్రసిద్ధులు. ఏలాపత్రనాగునికి ఏరపత్ర నాగుడని నామాంతరమున్నది.

► దిక్కులను పాలించే లోకపాల కులకు నాగులకు కూడా సంబంధ మున్నట్లు కనప డుతుంది. విరూ పాక్షుడనే నాగరాజు తూర్పుదిక్కుకు పాల కడునీ, ఏలాపత్రుడు పడమటి దిక్కుకు పాలకుడనీ బౌద్ధుల విశ్వాసం.

► అమరావతి, నాగార్జున కొండ బౌద్ధ శిల్పా లలో ఎక్కడ చూసినా నాగరాజులు, నాగినుల, నాగముల చిత్రాలే. శిల్పంలో ప్రాచీనాంధ్ర శిల్పులు నాగులను కటి ప్రదేశం నుంచి పై భాగమంతా మనిషిరూపంలోనూ నాగముల క్రిందిభాగమంతా సర్పరూపంలోనూ చెక్కారు. నాగరాజు చిత్రాలకు తలమీద అయిదు పడ గలు ఉంటాయి. నాగినికి ఒక్కటే పడగ. అద యినా నాగకన్యక అని తెలియడానికే ఏమో! ఈ విధంగా సగం మనిషి సగం సర్పరూపంలో కాకుండా కేవలం మహాసర్ప రూపంలో చెక్కిన చిత్రాలు కూడా లేకపోలేదు.

►మనదేశంలో నాగపూజ అధికం. నాగప్రతి మలు చెక్కిన శిలలు సాధారణంగా ప్రతి చోటా కనపడుతాయి. వీటిని నాగ శిలలనీ, నాగకల్లు లనీ అంటారు. పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉంటే సంతానం నిలవడానికి నాగప్రతిష్ఠచేసి ఆరాధించడం కద్దు. పూర్వీకుల నుండీ నాగదేవతను ఆరాధించేవారని ఆధారాలు తెలుపుతున్నాయి. నాగములను శిలలపై చెక్కి ఆరాధించడం ఒక ఆచారం.

► ఆంధ్రవిశ్వకళా పరిషత్‌ చిహ్నం మీద నాగముద్ర ఉంది.

నాగులచవితికి యోగ సంబంధమైన ఒక వివరణ
…………………………………………………

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘ నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని కూడా ఒక ప్రచారం లోని కథ

చలిప్రవేశించు నాగుల చవితినాడు
మెరయు వేసవి రథసప్తమిగా దివసమున
అచ్చ సీతు ప్రవేశించు బెచ్చుపెరిగి
మార్గశిర పాషమాసాల మధ్యవేళ

—————-> సురవరం ప్రతాపరెడ్డి ))))

మలేషియాలోని పెనాంగ్‌లో 1850లో పాములకు ఆలయం నిర్మించారు.

ఇక్కడ పాములు వీరవిహారం చేస్తాయి. ఎవరినీ ఏమీ చేయకపోవడం విశేషం. బౌద్ధమత ప్రవక్త ఈ ఆలయ నిర్మాణం చేశారు. చిత్రమేమంటే పరిసరాల్లో ఆలయాలున్నా వాటిలో పాము కన్పించదు. కేవలం ఇక్కడే దర్శనమిస్తాయి. ఈ ఆలయం బేయాన్‌ లెపాస్‌ విమానాశ్రయానికి దగ్గరలోని సంగైక్లువాంగ్‌లో వుంది. ప్రాచీన కాలంలో డేవిడ్‌ బ్రౌన్‌, అనే బ్రిటిష్‌ వాసికి తీవ్రవ్యాధి నుండి బాధపడుతూ, ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే రోగనివారణ జరిగిన కారణంగా బౌద్ధమత బోధకునికి ఆర్థిక సహాయం చేసి ఆలయాభివృద్ధికి కృషి చేశాడట.

> శివుడికి సర్పం అలంకారప్రియం.
> విష్ణువుకి తల్పం, మంధర పర్వతాన్ని చిలికేప్పుడు తాడు

> కాశ్మీర రాజులు తాము కర్కోటక నాగరాజు సంతతియనీ, నాగపూర్‌ రాజు పుండరీకుడని విశ్వసిస్తారు.

> సర్పాధి దేవత మానసాదేవి నాలుగు చేతులలోనూ నాలుగు పాములు, పాముల చుట్టు చుట్టుకొనివుండే వాటిమీద ఆసీను రాలైవుంటుంది.

> పాముల్లో పన్నెండు రకాలున్నాయట. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, కర్కోటక, అశ్వతర, దృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ.

> సృష్టి, జ్యోతిశ్శాస్త్ర, గోచార విషయాలకు సంబంధింత మైనదిగా సీక్రెట్‌ డాక్ట్రయిన్‌లో హెచ్‌.పి. బ్లావెట్‌స్కీ విశదీకరించారు.

> కుండలినీ శక్తికి మరోపేరు స్పీరిమాగా గ్రీకులు వ్యవహరిస్తారు.

> యోగ విద్యలో కుండలినీ శక్తి సర్పంలా ముడివలె చుట్టుముట్టి సహస్రల వారకూ శరవేగంగా పోతుంది. పుట్ట మానవ శరీరానికి ప్రతీకం. మానవ శరీరంలో పాము నిద్రావస్తలో వుంటే, దానిని యోగ సాధన ద్వారా జాగ్రదావస్తలోకి తీసుకువెళ్ళెదరు. అంటే విషం హరిస్తుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది.మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముక (బ్రహ్మదండి) సర్పకారంగా సుఘమ్మానాడిని ఉత్తేజితం చేయడమే నాగపూజ ప్రధానోద్దేశం.

నాగోబా జాతర

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దేవాలయంలో ప్రతియేటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి జాతర ప్రారంభమవుతుంది. జిల్లాలోని గిరిజనులతోపాటు వరంగ ల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వారే కా కుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్టల్ర నుంచి తరలివస్తారు. గంగాజలం కోసం కా లినడకన వెళ్లిన మెస్రం వంశీయులు శనివారం ఇంద్రవెల్లికి చేరుకుని ఇంద్రాయి వద్ద పూజలు నిర్వహించడంతో సంబరాలు ఆరంభమయ్యా యి. అదే రోజు కేస్లాపూర్ చేరుకుని నాగోబా ఆల య సమీపంలోని మర్రిచెట్ల(వడమర) వద్ద విడిది చేస్తున్నారు. ఈ నెల రెండున ప్రారంభమ య్యే జాతర 13న ముగుస్తుంది. వివిధ ప్రాంతా ల గిరిజనులు జాతరకు తరలి వస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

పూజలు ఇలా… జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయు లు జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని అస్తలమడుగు(అత్తలమడుగు) నుంచి కాలినడకన గంగాజలం తీసుకొస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజల అనంతరం కేస్లాపూర్ చేరుకుంటారు. నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్న మర్రిచెట్ల(వడమర) వద్ద విడిది చేస్తారు. ఆ సమయంలో గంగాజలం ఉన్న కల శం కింద పెట్టకుండా చెట్టు కొమ్మకు కట్టి ఉంచుతారు. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆల యంలో ఏడు పుట్టలు తయారు చేసి నవధాన్యాలు, ఆవుపాలు, నైవేద్యంగా సమర్పిస్తారు.

సిరికొండ నుంచి కుండలు.. ఇచ్చోడ మండలం సిరికొండలో ప్రత్యేకంగా త యారు చేసిన 116 మట్టికుండలను పూజల కో సం తీసుకొస్తారు. పూజల అనంతరం మెస్రం ఆ డపడుచులు వడమర సమీపంలోని బావి నుంచి వాటిలో నీటిని ఆలయానికి తెస్తారు. గత ఏడాది నిర్మించిన మట్టిపుట్టలను తొలగించి వాటి స్థానం లో ఆవుపేడ, జలంతో మట్టి పుట్టలు నిర్మించి కొలుస్తారు. అనంతరం కిక్రీ, డోలు తదితర వాయిద్యాలతో పెద్దలు కచేరీలు నిర్వహిస్తారు.

మెస్రం వంశీయులే కటోడాలు.. మెస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మెస్రం వంశీ యుల కిందికి వస్తారు. మడావి, మర్సుకొల, పు ర్క, మెస్రం, వెడ్మ, పంద్రా, ఉర్వేత ఇంటిపేర్లు గ లవారు మెస్రం వంశీయులు. వీరే కటోడా(పూజారులు)లుగా వ్యవహరిస్తారు. పూజారులను మూ డేళ్లకోసారి మార్చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వారు కొత్వాల్, మెస్రం వంశంలో 22 తెగల వారిని పేరు పేరున స్మరించుకుంటారు.

గోవడ నుంచి పూజలు నాగోబాకు పూజలు నిర్వహించే మెస్రం వంశీ యులు ఆలయం వద్ద ఉన్న గోవడ(గుండ్రంగా గోడ కట్టి ఉండే ప్రాంతం)లోనే విడిది చేస్తారు. ఈ గోవడలో 22 కిత్తలతో విడిది చేసి నాగోబా జాతర ముగిసే వరకు పూజలు నిర్వహిస్తారు.

జాతరలో బేటింగ్… మెస్రం వంశంలో పెళ్లిళ్లు జరగ్గానే ఇంటికి వచ్చే కోడళ్లను వెంటనే వంశస్తురాలుగా గుర్తించరు. నాగోబా సమక్షంలో బేటింగ్ నిర్వహించాకే వారి వంశపు కోడళ్లుగా గుర్తింపు ఇస్తారు. ఇందుకోసం ప్రతి ఏడాది నాగోబా పూజల అనంతరం ఆలయంలో బేటి(బేటింగ్) నిర్వహిస్తారు. ఆలయంలో తయారు చేసిన పుట్ట వద్ద నూతన దంపతులతో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. నాగోబా దర్శనం అనంతరం మెస్రం వంశంలోని కుల పెద్ద భార్య కోడళ్లను వంశస్తులకు పరిచయం(బేటి) చేయిస్తారు. అప్పటి నుంచి వారిని మెస్రం వంశం కోడళ్లుగా గుర్తిస్తారు.

నాగోబా చరిత్ర పూర్వకాలంలో మెస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రుడికి తల్లి తన తమ్ముడి కూతురైన గౌరితో వివాహం జరిపిస్తుంది. అత్త ఆజ్ఞ మేరకు గౌరి తన భర్త నాగేం ద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరికి వెళ్తుంది. సర్పం ఓ చోట ఉడుం రూపంలో కనిపించడంతో అక్కడ ఉడుంపూర్ ఏర్పడింది.

ఆ తర్వాత గౌరి గోదావరి నదిలో స్నానానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారడాని.. అయితే పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి నాగేంద్రుడు పాము రూపంలోకి మారడానే కథ ప్రచారంలో ఉంది. నాగేంద్రుడి కోసం ఉడుంపూర్ నుంచి గరిమ్మెల వరకు వెతికిన గౌరి గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందని, ఆమె వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు రాయిగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుని సన్నిధిలో పరిచయం(బేటి) చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టలోకి వెళ్లిపోవడంతో అక్కడ నాగోబా వెలిసిందని ప్రచారంలో ఉంది.

Standard
సమాచారం

Job sites

ఉద్యోగాల వేటలో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఏ సైట్లలో సమాచారం దొరుకుతుంది? అనే విషయంలో గూగుల్ ని ఆశ్రయించినా అదిచూపించే సముద్రంలో ముత్యాల వేట అంత సులభంకాదు. కొన్ని ముఖ్కమైన జాబ్ సైట్లు ఇవి అవసరమైనా మిత్రుల కోసం

Job Websites : 

  1. Naukri              :   www.naukri.com
  2. Monster India    :  www.monsterindia.com
  3. Times Jobs       :  www.timesJobs.com
  4. Shine               :  www.shine.com
  5. Jobstreet          :  www.jobstreet.co.in
  6. Careerbuilder    :  www.careerbuilder.co.in
  7. jobsahead         :  http://www.jobsahead.com/
  8. Freshers World  :  www.freshersworld.com/
  9. Click Jobs           :  http://www.clickjobs.com/
  10. V Freshers         :  http://www.vfreshers.com/
  11. Career Jet          :  http://www.careerjet.co.in/
  12. Career Age         :  http://www.careerage.com/
  13. Free Job Alert      :  http://www.freejobalert.com/
  14. Employment News :  http://www.employmentnews.gov.in/

Standard
సమాచారం

మరుల మాతంగి (Xanthium indicum Koen) Marula Matangi

ఆంధ్రప్రదేశ్ లో లభించే ఉపయోగకరమైన ఆకుకూరలు
Tender leaves can be cooked, It is diuretic and sedative,It is useful in urinary tract problems.
Xanthium strumarium (Rough Cocklebur, Clotbur, Common Cocklebur, Large Cocklebur, Woolgarie Bur) is a species of annual plants belonging to the Asteraceaefamily. It probably originates in North America and has been extensively naturalized elsewhere.

Reproductive biology

The species is monoecious, with the flowers borne in separate unisexual heads: staminate (male) heads situated above the pistillate (female) heads in the inflorescence. The pistillate heads consist of two pistillate flowers surrounded by a spiny [involucre]. Upon fruiting, these two flowers ripen into two brown to black achenes and they are completely enveloped by the involucre, which becomes a [bur]. The bur, being buoyant, easily disperses in the water for plants growing along waterways. However, the bur, with its hooked projections, is obviously adapted to dispersal via mammals by becoming entangled in their hair. Once dispersed and deposited on the ground, typically one of the seeds germinates and the plants grows out of the bur.

మరుల మాతంగి కాయలు

Toxic or medicinal phytochemistry

The plant may have some medicinal properties and has been used in traditional medicine in South Asia and traditional Chinese medicine. In Telugu, this plant is called by name Marula Matangi.

However, while small quantities of parts of the mature plants may be consumed, the seeds and seedlings should not be eaten in large quantities because they contain significant concentrations of an extremely toxic chemical, carboxyatratyloside. The mature plant also contains at least four other toxins.
Animals have also been known to die after eating the plants.
A patient consuming a traditional Chinese medicine containing cocklebur, called Cang Er Zi Wan (苍耳子丸) developed muscle spasms.
It was responsible for at least 19 deaths and 76 illnesses in Sylhet District, Bangladesh, 2007. People ate large amounts of the plants, locally called ghagra shak, because they were starving during a monsoon flood and no other plants were available. The symptoms included vomiting and altered mental states, followed by unconsciousness.

మరుల మాతంగి ఆకు

మరికొన్ని ఆకుకూరల వివరాలు

Standard
సమాచారం, Fun

రోటి టైం : అప్పడాల కర్ర తిరగేస్తారా?

ఈ మధ్య తీయని భాదల నేపద్యంలోనో, కొవ్వుని కరిగించే కార్యక్రమంలోనో రోటీకి బాగానే డిమాండ్ పెరిగింది. తినడానికేం భేషుగ్గా వుంటుంది. అసలు రోటీలో నంజుకునేందుకు కూరలు చెయ్యాలా? కూరలు తినేందుకు నంజుగా రోటీ వండుకుంటామా ? అనే భేతాళ ప్రశ్నకు సమాధానం వెతికే విక్రమార్కుడే దొరకలేదట.

ఆట పింటని పిలుచుకునే గోధుమపిండి, లేదా మరికొన్ని పిండ్లతో కలిసిన పిండిని నీళ్ళనుకావలసినంతే కలిపి చేతివేళ్ళకు కావలసినంత ఎక్సర్ సైజ్ చేయించి,  దెబ్బలూ, మొట్టికాయలూ, పిడిగుద్దులూ, కసితీరా వేసేది. అప్పుడిక అప్పడాల కర్ర అందుకుంటే నా సామిరంగా సాఫయి పోవాల్సిందే కదా. ఇక వీటికోసం ఎన్ని రకాల పీఠలూ, ఎన్నెన్ని రకాల కర్రలు. క్రిందనో పైననో అంటుకోకుండా నొక్కగానే సరిపోదు దానికి అందమైన ఆకారం రావాల్సిందే. పైగా రౌండు గుండ్రమయితేనే ప్లేటుకి సరిపోనూ సరిగ్గా అమర్చేందుకు బావుంటుంది.

ఇక పెనం బాధలుచెప్పేదేముంది. ఆయిల్ తక్కువ వేయాలి. మాడిపోకూడదు. రోటీలూ, పుల్కాలూ, చపాతీలూ, చుక్కారోటీలూ, నాన్ లు, బటర్ నాన్ లు, పరాటా, పూరీ, ఆలూ స్పెషల్ పూరీ భారతీయ బ్రెడ్డుకు కావలసినన్ని రూపాలు.

ఇక జోన్ పిండి రొట్టెలైతే పీటలూ, కర్రలూ ఏంలేకుండా చేతులతోనే సమానంగా నైపుణ్యంతో వత్తేస్తారు. రుమాల్ రోటీ తినటం కంటే అది చేసేప్పుడు చూడటమే వింతగా వుంటుంది. సర్వపిండి రొట్టెలు పప్పుబద్దలతో హట్ హాట్ గా తెలంగాణాకి ఫేవరెట్,

సరే కానీ ఇంతకీ విషయం ఏంటంటే వీటిని పెద్దమొత్తంలో చేయడానికీ, సులభంగా చేసుకోవడానికీ చాలా రకాల యాంత్రిక పద్దతులొచ్చాయి. సరదాగా కొన్ని చూస్తారా మరి.

పిండి, నీళ్లూ వగైరా వేసేసి ఎన్ని రోటీలు కావలి? ఎంతమందంతో కావాలి లాంటి వివరాలు ఫీడ్ చేసి మనం డైనింగ్ టేబుల్ అమర్చుకునే లోగా నిమిషానికొకటి చొప్పున జిరాక్స్ మెషిన్లోంచి పేపర్లు పడ్డట్లు ప్లేటులోకి వచ్చేస్తున్నాయి. 

న్యూస్ పేపరు అచ్చుకోసం వెళ్ళినట్లు దుప్పటి లాగా, ద్రౌపతికి కృష్ణుడు ప్రసాదిస్తున్న కోకలాగా ఓ క్రమంలో వస్తున్న రోటీ బెల్టుని చక్కని గుండ్రని ఆకారంలో కత్తిరించటం, అదే వరుసలో వాటిని వేడిచేయటం బెల్టు చివరికెళ్ళేసరికి తయారైన రోటీలను కుప్పలుగా వచ్చేస్తుంటే ప్యాక్ చేసుకోవడం… బహుశా కటింగ్ లో మిగిలిన పిండి ముక్కల్ని మళ్లీ రౌండ్ లో కలుపుతారేమో.

కొద్దిగా మనుషుల అవసరం ఎక్కువ కావలసిన రొట్టలు తయారు చేసే మినీ పరికరం.
పిండి వృధాకావడం లేదు. యాంత్రిక శక్తికూడా మరీ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు.

సరే మీరు ఓపిగ్గా రోటీ మేకింగ్ మెషిన్ల కోసం వాటి వివరాల కోసం వెతుక్కుంటే చాలా దొరుకుతాయి.
చివరిగా ప్రపంచంలోనే పెద్ద రోటీ ఎలా తయారు చేసారో చూడండి. మనం రుమాల్ రోటీ అన్నట్లే దీనికి కూడా పేరుపెట్టాలంటే లుంగీ రోటీనో, పంచె రోటీ అనో పెట్టాలేమో.. చూడండి చేతులతోనే సాగదీసి ఎంతబాగా ఆరేస్తున్నాడో

Standard
సమాచారం

శత వసంతాల సినిమా

రంగస్థలం నుంచీ బొమ్మలు కదలాడుతూ తెరమీదకి ప్రతిక్షేపించబడ్డాయి. ఆక్షేపణలేం లేవు. ఒక చరిత్ర నెమ్మదిగా కనుమరుగవుతూ తెర ఆ స్థానంలో నిలబడింది. కదిలే బొమ్మలాటకు ఇంతపెద్ద ఆర్ధిక(రాజకీయ కూడా ) కదలిక తెచ్చే శక్తివుంటుందని 1913లో అనుకొని వుండరు.

ఆడవాళ్ళు ఈరంగంలో రంగేసుకోవటమే అవమానం అనుకునే దశనుంచీ అవకాశాన్ని పదిలం చేసుకునేందుకు చర్మన్ని పరిచే దాకా ప్రయాణం సాగింది. పొట్టకూటికి పిట్టల దొర వేషాల నుంచీ రాజ్యాలు ఏలేందుకు రంగేసుకున్న ఆకర్షణ పనిచేస్తోంది. అటు రాజకీయాలతోనూ ఇటు మాఫియాలతోనూ పెనవేసుకుంటూ విచిత్రమైన కొత్తతలలను మొలకెత్తించుకుంది.

మూగ గా కదలాటం దగ్గరనుంచీ సాగుతూ మాటలూ, రంగూలూ అద్దుకుని ఈరోజు ఆధునిక సొబగులతో ఐమాక్స్ తెరలపై, త్రిమితీయ హోయలు పోతూ డాల్భీ శబ్దాలతో దడదడ లాడిస్తొంది.

తెలుగు సినిమా పితామహుడు గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిఙ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశం లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గ సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రి లో స్థాపించారు. అప్పుడు వేలరూపాయిలతోనే పూర్తయ్యే చిత్రనిర్మాణం నేడు కోట్లరూపాయిలను అలవోకగా ఖర్చుపెడుతోంది. వందల కోట్లను అంతే సామర్ధ్యంతో తిరిగి తెచ్చుకోగలుగుతుంది. అందుకే అత్యంత శక్తివంతమైన,ఆకర్షణీయమైన మాద్యమంగా ఊరిస్తోంది.

దేశంలో అత్యధిక సినిమా ధియెటర్లు ఆంధ్రపదేశ్లోనే, ప్రపంచంలోనే అతి పెద్ద త్రిమితీయ ఐ మాక్స్ తెర, అత్యధికంగా సినిమాను వీక్షించే తెరలూ హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ లోనే. అతి పెద్ద పిల్మ్ స్టుడియో కూడా రామోజీ పిల్మ్ స్టుడియోనే. అన్నగారు సినిమా తెరకూ రాజకీయలకూ మధ్య వారధి ఎలా వుంటుందో చూపారు. ఎక్కువ తాలూకూ రికార్డులు తెలుగుసినిమాకు చాలానే వున్నాయి.

అయితే ఆధునిక పరిజ్ఞాన నేపద్యంలో పైరసీ వ్యాధి సోకిన సినిమా మరెంత కాలం బ్రతుకుతుందో చూడాలి. లేదా దీన్ని తట్టుకునేలా మరో కొత్తరూపంలోకి మారుతుందో కూడా ఎదురు చూడాలి.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
వివరణ, సమాచారం

బతుకమ్మ తెలంగాణాలో మాత్రమే జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి?

బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.
మహిషాసుర మర్ధని నేపద్యంలో చెప్పే బతుకమ్మ కథ: శ్రీగౌరి మహిషాసురుని చంపిన తర్వాత (ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమినాడు) అలసటతో మూర్చపోయింది. ఆ మూర్చనుంచి ఆమెను తేర్చటానికి స్త్రీలంతా గుమిగూడి పాటలు పాడినారు. సరిగ్గా పదవరోజున ఆమె మూర్చనుంచి తేరుకొని స్పృహలోకి వొచ్చింది. మూర్చలోని ఆమెను తిరిగి ‘బతుకమ్మా’ అని పాడితే బతికింది. గనుక ఆ పదిరోజులు పండగ జరుపుకొంటారు.
కాపు బిడ్డ కథ..
పూర్వంలో కాపు దంపతులకు పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోతే ఎడవ కాన్పులో పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొడుకు పుట్టడం. కొంత కాలానికి బతుకమ్మకు పెళ్లి చేసిన తర్వాత ఆమె సోదరునికి కూడా పెళ్లి చేస్తారు. తర్వాత అత్తవారింటి నుంచి తల్లిగారింటికి వచ్చిన బతుకమ్మ మరదలు కలిసి చెరువులోకి దిగి స్నానం చేస్తారు. పొరపాటున ఒకరి చీర ఒకరు ధరించడంతో ఆగ్రహించిన మరదలు బతుకమ్మను గొంతు నలిమి చంపిపాతిపెట్టి వెళ్లి పోతుంది. మరణించిన బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి తనను తీసుకెళ్లమని వేడుకోనడంతో ఆయన తెల్లారి బయల్దేరి చెరువు గట్టు వద్దకు వెళ్లాడు. బతుకమ్మ స్నానం చేసిన చెరువు గట్టు వద్దకు చేరుకున్నాడు. గతంలో ఎప్పుడు చూడని తంగేడు పువ్వులను ఆశ్చర్యంతో చూశాడు. వాటిని చూసిన అతను తెంపబోగా ఆ చెట్టు జరిగిన కథను చెప్పిందట. అప్పటి నుంచి ఆమె కోరిక మేరకు తంగేడు పూలతో బతుకమ్మను పేర్చడం.. అలంకరించడం..అనవాయితీగా మారింది.
బతుకమ్మ పండుగ వెనుక ఇంకా చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం “బతుకమ్మా !” అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.
ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.
ఈ పండుగలో భాద్రపద అమావాస్య చాలా ప్రాముఖ్యమైంది. ‘పెద్దల అమావాస్య’ అనే ‘పెత్తరమాస’ అని పలుచుకునే ఈ రోజు గౌరవమైనది. పనుల హడావుడిలో తీరది గనుక, వేర్వేరు తిథులు దినాలు గుర్తుపెట్టుకోవటం కష్టం గనుక ఒకరోజు అనుకొని అందరూ. తమ పెద్దలకు, పితృలకు పండుగ చేస్తారు. బియ్యం దానమివ్వటం, ఇష్టమైన వంటలు వండిపెట్టడం, వచ్చేవాళ్లతో పొయ్యేవాళ్లతో పల్లెటూళ్లల్లో పండుగ జరుగుతుంది.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు “బొడ్డెమ్మ” (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.‘బొడ్డె’ అంటే చిన్నకుప్ప లేదా రాశి. ‘బొడ్డె’ అమ్మ బొడ్డెమ్మ. నిజానికి ఒకరకంగా ఇది మట్టిపూజ. ఉత్పత్తి (పంటలు, పనరుత్పత్తి (సంతానం) సవ్యంగా జరగాలని చేసే పూజ.

‘‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాపూందరే కోల్
నీ బిడ్డపేరేమె కోల్ నిండా నూరేళ్లే కోల్’’
చీకటి పడిందాక ఆడి ‘బొడ్డెమ్మ’లు తీస్తారు. ‘నిదురపో బొడ్డెమ్మా నిదురపోవమ్మ, నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యేళ్లు’’ అని పాటల్తో నిద్రపుచ్చి ఎవరింటికి వాళ్లు తీసుకెళ్తారు.
బత్కమ్మ పేర్చే తీరు…
బొడ్డెమ్మలు, ఎంగిలిపూలు మొదలు ఆడపిల్లల సంబురమే ఇల్లంతా, ఊరంతా నిండుతుంది.
బతుకమ్మ రెండోరోజు నుంచి కుటుంబంలోని మగపిల్లలు పువ్వుతేవటానికి కంచెకు వెళ్లుతారు. ప్రతిరోజు మబ్బుల (తెల్లవారకముందే) అరికంట్లం (చలినుంచి రక్షణ కోసం ధరించే పాతబట్ట) కట్టుకొని చిన్న పిల్లలు తట్టలు, ఎలితె గంపలు సంకల పెట్టుకొని పోయి పూలవేట మొదలు పెడతారు. మధ్యాహ్నం స్త్రీలు ముక్కాలి పీటమీద
పెద్ద తాంబోళం లేదా సిబ్బి (వెదురు బొంగు పూలతో తయారు చేసిన ప్లేటు) లేదా తపుకుపైన గుమ్మడి ఆకులను పేర్చి మొదటి వరుసలో గుండ్రంగా తంగేడీ పూలను పేరుస్తారు. ( దీన్ని మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బిపూలు అని అనేక పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో చరమ రంగ లేక మాయహరి, ఆవర్తకి, పీఠకిలక, తిమిరిహరి అని అనేక నామాలున్నాయి. ఆంగ్లంలో టానర్స్ కాషియా లేక టానర్స్ సెన్నా అని, శాస్త్రీయంగా కేషియా ఆరిక్యులేటా లేక సెన్నా ఆరిక్యులేటా అని పిలుస్తారు. ఇది సీసాల్పినియేసి అనే కుటుంబానికి చెందినది. ఈ మొక్క బెరడులో టాన్లి ఎక్కువగా ఉన్నాయి. మొక్క సమూలంలో బీటా సైటోస్టీరాల్, గ్లైకోసైడ్లు వున్నాయి. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు.) మలి వరుసల్లో సాధారణంగా గునక పూలను పేలుస్తారు. గునక పూలు ‘అర తెలుపు’ రంగులో ఉంటాయి కాబట్టి ముదురు నీలి, గులాబి, ఆకుపచ్చ రంగుల్లో ముంచుతారు. పది, పదిహేను పూలను ఒక కట్టగా కట్టి పూవు కొనలను తుంచి రంగులో ముంచుతారు. ఆ తర్వాతి బంతి, చామంతి, గన్నేరు, మందార, కలువ, తామర తదితర పూలను శంఖం ఆకారంలో పేరుస్తారు. మధ్యలో కడుపులో ఆకులు, తుంచిన కాడలను నింపుతారు. పూలు జారిపోకుండా సన్నటి నూలు దారాలను గుమ్మడి ఆకుల క్రిందగా ముడివేస్తారు. పేర్చిన బత్కమ్మ మీద రెండు తమలపాకులు పెట్టి పిడికెడంత పరిమాణంలో పసుపుముద్దను పెడతారు. ఇది కూడా త్రికోణాకారంలో ఉంటుంది. దీనికి కుంకుమ బొట్టు పెడ్తారు. పుదిచ్చిన (పేర్చిన) బ్రతుకమ్మకు వెలిగించిన అగరవత్తులు కుచ్చుతారు. మొదట ఇంట్లో దేవుని గదిలో పెట్టి మొక్కుతారు.ఈ బతుకమ్మను పీటపై ఉంచి వాడిపోకుండా తడిబట్ట కప్పుతారు.
సాయంకాలం ఇంటి ముందు (వాకిట్లో) ఆవుపేడ, ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు. ముగ్గులపై బతుకమ్మను ఉంచి మహిళలు, పిల్లలు జీవనశైలికి సంబంధించి, ఆచార వ్యవహారాలకు సంబంధించి, కట్టుబాట్లకు సంబంధించిన, ఆడవారి కష్టాసుఖాల గురించిన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు.ఏడేడు తరాల కథలనూ గాథలనూ తవ్విపోసుకుంటారు. కుటుంబంలోని దుఃఖాన్ని, ప్రకృతి వైపరీత్యపు కడగండ్లనూ సామూహికంగా పాడుకుంటారు. కుటుంబ జీవనంలోని సంతోషాన్నీ, పిల్లల ముద్దు ముచ్చట్లనూ, పంటచేల వయ్యారాలనూ, వీరుల త్యాగాలనూ, దేవతల దయనూ, శృంగారాన్నీ, కరుణనూ, హాస్యాన్ని బతుకమ్మ పాటలలో కలగలిపి పాడుతారు.
చీకటి పడేదాక ఆడి ‘బతుకమ్మ’లు పట్టుకొని చెరువు దనుక గుంపులు గుంపులుగా వెళ్లి అప్పటికే నీళ్ల ఒడ్డున నిలుచొని ఉన్న మగవాళ్లకందిస్తారు. వాళ్లు మోకాళ్లలోతు నీళ్లదాక వెళ్లి ఒడుపుగా తబుకు తీసి ‘బతుకమ్మ’ను నీళ్లలో వదిలి వేస్తారు. ఆడవాళ్లు గౌరమ్మ పాటలు పాడుతూ తెచ్చిన ప్రసాదం పప్పులు ఫలహారాలు తబుకుల్లో పోసి ఒకరికొకరు పంచుకుంటారు. పెసరపప్పు, శర్కర, మక్కగింజ శర్కర, కందిపప్పు, బెల్లం, పుట్నాలు, దానిమ్మ గింజలు మొదలైన ప్రసాదాల కోసం మగపిల్లలు చుట్టూ మూగి సందడి చేస్తారు. అలా అయిదు రోజులు హుషారుగా సాగిపోతుంది. ఆరో రోజు అర్రెం. బతుకమ్మలు పేర్వరు. పనులు చూసుకోవటానికి, యాంత్రికం కాకుండా ఒకరోజు విరామం. ఏడో, ఎనిమిదో రోజులు మరింత హుషారు.

సద్దుల బతుకమ్మ

బతుకమ్మను తొమ్మిది రోజులు జరుపుకొన్నాక ఆఖరు రోజు అష్టమి రోజును దుర్గాష్టమి, పెద్దబతుకమ్మ, సద్దులబతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు మహిళలు తమ ఇంటిలో పులిహౌర, దద్దోజనం, సత్తుపిండి (మొక్కజొన్న పిండి, బెల్లంతో చేసిన పిండి) వగైరా సద్దులు చేస్తారు. ఇచ్చుకోవాయినం పుచ్చుకోవాయినం అని సద్దులు పంచుతారు. అక్కడి నుండి ఊర్లో గుడి దగ్గరకు కాని, ఊరి మధ్యలో కాని ఊరడమ్మ, బొడ్రాయి దగ్గర కానీ పెట్టి ఊరి వారందరూ కలిసి ఆడతారు. తదుపరి బత్కమ్మలను డప్పులతో చెరువు గట్టు వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. మళ్లీ గట్టుమీద బత్కమ్మలను పెట్టి అందరూ కలిసి ఆడతారు. కొందరు ఉత్సాహవంతులు, యువకులు, సేవకులు చెరువునీళ్లలోకి దిగి లోతుదాక వెళ్లి బతుకమ్మలు వదులుతారు. తబుకులతో తడికాళ్లతో నడుస్తూ స్త్రీలు బతుకమ్మను సాగనంపుతారు.
‘‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ
మల్లొచ్చె యాడాది తిరిగి రావమ్మా’’
అంటూ.
శ్రీలక్ష్మి నీమహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
ఎన్నెన్నో రూపముల – ఏడేడు లోకముల
ఉన్న జనలకు కోర్కెలన్ని సమకూర్చేవు’’ అని పాడుతారు.
వాయనాలు ఇచ్చుకుంటూ
ఉసికెలో పుట్టే గౌరమ్మ.. ఉసికెలో పెరిగే గౌరమ్మ..
కుంకుమలో పుట్టే గౌరమ్మ..
కుంకుమలో పెరిగే గౌరమ్మ..
పసుపులో పుట్టే గౌరమ్మ..
పసుపులో పెరిగే గౌరమ్మ..అంటూ మహిళలు చెరువు గట్టు వద్ద వాయనాలు ఇచ్చుకున్న అనంతరం తమతో తెచ్చుకున్న ఫలహారాలను, సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ఆరగిస్తారు.

బతుకమ్మ పండుగ – బోనాల పండుగ ఇవి ఎప్పుడు ప్రారంభం అయ్యాయి? వీటి మూలం ఏమిటి?

ప్రత్యేకంగా తెలంగాణా ప్రాంతం లోనే ప్రాముఖ్యత వుండి మిగిలిన తెలుగు ప్రాంతంలో లేకపోవడానికి సహేతుకమైన కారణాలున్నాయా? ఇవి నిజంగానే తెలుసుకోవలసిన ప్రశ్నలు. వీటిని రూఢిపరచుకోవలసిన సమయం కూడా నిజంగా ఇదేనేమో
క్రిస్తుకు పూర్వనుంచే ఇటువంటి పండగవుంటే దానికి సంభందించిన ఆధారాలు ఖచ్చితంగా ఏదో ఒక పద్దతిలో మిగిలే వుండేవి కదా?
1. వివిధ రాజుల కాలంలో కట్టించిన దేవాలయాలలో దీనిని ప్రతిబింబించే శిల్పాలు లేదా చిత్రాలు వంటివి ఏర్పటయి వుండివుండాలి. కాకతీయులు కట్టించిన అన్ని నిర్మాణాలలో ఎక్కడైనా ఈ సంస్కృతిని గమనించే ఆధారాలు దొరుకుతాయా?
2. చరిత్ర రాసిన వారి ఉట్టంకింపులలో కానీ, ఆ కాలపు రచనలలో కానీ పేర్కోనబట్టట్లు దాఖలాలున్నాయా?
3. వివిధ కాలాలలో చలామణీలో వున్న నాణేలలో కానీ ఎక్కడన్నా దీన్ని సూచించే చిహ్నలేవైనా వున్నాయా?
బహుశా అటువంటివేమైనా దొరుకలేదనే నేనను కుంటున్నాను.
నైజాం మినహా మిగిలిన ప్రాంతం బ్రిటీషు వాళ్ళ చేతిలో వుంటే ఇక్కడ మాత్రం తురుష్కుల దాష్టికంలో బానిస బతుకుల్లో నలిగిపోయింది. తినడానికి లేకుండే స్థితికంటే దారుణంగా స్వీయవ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకుని ‘‘నీ బాంచెన్ దొరా’’ గా గడీల అడుగులకు మడుగులొత్తుతూ పడివుంది.
ఆడవాళ్ళ విషయం మరీ దారుణం రాక్షసుడి కంట్లో పడితే తినేస్తాడన్నట్లు, కొంచెం నదరుగా కనిపిస్తే వాడు కావాలంటాడేమో నని బితుకు బితుకు మంటూ బ్రతికిన కాలం. పండుగకైనా మంచి బట్టలు కట్టుకునేందుకో, ఇంటిముందు రంగుల ముగ్గుపెట్టి ఎవడి కంట్లోనో పడేందుకో జంకిన సమయం.
ఈ అభద్రతాకాలంలోనే సంస్కృతికంగా వచ్చిన పారంపర్యత వల్ల తప్పని సరిగా ఎదైనా పండుగ చేసుకోవాలనుకోవడం వల్ల కావచ్చు.
అటువంటి దాషికానికి బలైనా ఎవరో ఒక ఆడబిడ్డను తలచుకుంటూ మిగిలిన తమ బిడ్డలు బ్రతుకాలని కోరుకునే బ్రతుకమ్మ కావచ్చు.
బహిరంగంగా ఉమ్మడిగా కలుసుకునేలా తయారు చేసుకున్న ఈ వేదిక ద్వారా పాడుకునే పాటలలో కూడా అంతర్గత సందేశాలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు కూడా కావచ్చు.
ఆకాలంలో అతిసాధారణంగా దొరికే గుణుగు, తంగేడు లాంటి పేర్చిన పువ్వుల గుట్టలో ఆయుధాలనో, సంహారం చేసిన శత్రువు తలనో గుమ్మనంగా చెర్లో కలిపేపేందుకు ఒక సాకుని ఏర్పాటు చేసుకున్నారో నిజంగానే చరిత్ర మనకు చెప్పేంత వరకూ మన ప్రతిపాదించుకోగలం మాత్రమే. చరిత్రను మాట్లాడించగలిగే సహనమూ విద్వత్తూ వున్నవారు కావాలిప్పుడు.
కానీ సంక్రాంతికి పెట్టే గొబ్బెమ్మలు వాటిపై పూలూ పెట్టటం లాంటి విధానానికి మరికొంచెం మార్పులు చేసినట్లుంటుంది ఈ బతుకమ్మపూల పేర్పు, కోలాటం లాంటి ఉమ్మడి ఆటలకూ మల్లే, గిరిజన తెగలు ఎక్కువగా వుండే ఈ ప్రాంతంలో వారి సంస్కృతిలోని ‘‘రేలా’’ నాట్యంలో ఒకరి వలయంగా ఏర్పడి ఒకరి నడుంపై మరోకరు చెయ్యేసి చేసే పద్దతికి దగ్గరగా వుంటుంది.
బహుశా ఇలా బ్రిటీష్ పాలన, నైజాం దాష్టికాల కాలంలో ఏర్పడివుంటేనే తక్కిన పురాణేతిహాస పంభంధ పండుగలకు భిన్నంగా, తాము మాట్లాడే భాషలోని ఇతర పండుగలకంటే వేరుగా భిన్నత్వాన్ని కలిగివుండేందుకు ఆస్కారం వుంది.
అంతకు ముందే ఏర్పడి వుండి వున్నట్లయితే సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో నెమ్మదిగా ఎక్కువదూరం ప్రవహించివుండేది.
మరో వివరణ

బతుకమ్మ ప్రధానంగా ప్రారంభం అయ్యింది చెరువుల పండుగగానా ?

అవునని కొందరు పరిశీలకులు చెపుతున్నారు. కాకతీయుల కాలంలోనూ రాజ్యం అభ్యున్నతి చెందాలంటే చెరువులు అవసరం అని గుర్తించారు విరివిగా చెరువులు తవ్వించారు. దశబంధ చెరువులు, గొలుసుగట్టు చెరువులు, పాకాల, లక్నవరం, పొలవాస, సిర్నపల్లి, రామగుండం, కంభం, ఎలిగందల, దోమకొండ, మొదలైనవి దీనికి ఉదాహరణలు ఒక చెరువు నిండితే అదనపు నీరు అలుగుపైగా పారి క్రింద ఉన్న ఇంకో చెరువులోకి వెళ్తుంది. ఇలా ఒక దానిక్రింద ఒకటిగా గొలుసుకట్టు చెరువులుండేవి. ఇలాంటి చెరువుల వ్యవస్థ వల్ల ఆనాటి ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. చెరువుల వల్ల ఆనాటి ప్రజల బ్రతుకులు బాగయ్యాయి. కాబట్టి ఊరి ఆడవాళ్ళందరూ కలిసి ఏడాదికి ఒకసారి చెరువులకు నెనరులు (కృతజ్ఞతలు) చెప్పేవారు కాబోలు. అందుకే ఇది చెరువుల పండుగ.
సహజంగా నీరు నిలిచే ఒక ప్రాంతాన్ని గుర్తించి, దానిపై ఒకవైపు కట్టను, తూములను నిర్మించి, నీటి నిలువ సామర్థ్యం పెంచేవారు. దానిని పెద్ద చెరువు అని వ్యవహరించేవారు. దాని అలుగు కింద ఇంకో చెరువు ఉంటుంది. దీన్ని చిన్న చెరువు అంటారు. ఈ రెండు చెరువులే కాకుండా ఇంకో కుంటను ఏర్పరిచే వారు. సాధారణంగా తెలంగాణలో ప్రతి పెద్ద ఊరికి ఈ మూడు నీటి వనరులుంటాయి. లేదా ఈ వసతి ఉన్నచోటనే ఊరును ఏర్పాటు చేశారు. ప్రతి చెరువుకు పరివాహక ప్రాంతం, ఆయకట్టు నిర్దేశితమై ఉండేవి. నీటి నిలువను పంపిణీని చూసుకోవడానికి ‘నీరడికారులు’ ఉండేవారు.
తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చెరువులున్నాయో అక్కడే ఈ పండుగ ఉంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలోని చెరువులు లేని ప్రాంతాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు. ఇది మొదట చెరువుల పండగ. తర్వాత కాలక్రమంలో పూల పండుగ అయ్యింది. క్రమంగా పండుగ జరుపుకునే తీరు పరమార్థంలో కూడా మార్పులు వచ్చాయి. బ్రతుకునిచ్చిన చెరువమ్మకు పూలతో కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి పూలపండగ కూడా అయ్యింది. దీనికి ఆటపాట కూడా తోడయ్యింది.
వర్తమానంలో బతుకమ్మ పండుగ పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు, అత్తవారింటికి వెళ్లిన కొత్త కోడళ్ళు జరుపుకునే పండగగా కూడా మారింది. ‘బతుకును’ ఇచ్చే అమ్మను పూజించే పండుగ కాబట్టి పెళ్ళికానివారు గుణవంతుడైన భర్తకోసం, పెళ్ళి అయిన వారు భర్త క్షేమాన్ని కోరుకుంటూ కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఆట పాట కూడా ఉంటుంది కాబట్టి యువతకు ఆసక్తి కలిగించే పండగ అయ్యింది. కొద్ది మార్పులతో దాదాపు తెలంగాణ అంతటా ఈ పండుగను ఒకేలా జరుపుకుంటారు. అడవి ఆవరించి ఉన్న అదిలాబాద్ జిల్లాలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకోరు. పాలమూరు జిల్లాలో ఒక పక్క కూడా ఇది తక్కువే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ పండుగ పలు రూపాల్లో ఉంది. తరచి చూస్తే ఈ పండుగలో ఇంకో పరమార్థం కూడా కనిపిస్తున్నది. బత్కమ్మ అంటే తంగేడు, గునక, గుమ్మడి ఆకులు, పసుపు ముద్ద, బంతి తదితర పూలు ఈ పూలను బత్కమ్మగా పేర్చి చివరలో చెరువులో వేస్తారు. దీంతో ఆ చెరువు నీరు శుద్ధి అవుతుంది. ఆకులు, పూలు నీటిలో నాని మెత్తబడి తర్వాత కుళ్ళిపోయి నీటి అడుగుకు వెళ్లి మట్టిలో కలుస్తాయి. దీంతో ఆ మట్టి సారవంతం అవుతుంది. ఆ మట్టిని రైతులు చెరువు ఎండినప్పుడు వేసవిలో పొలాలకు తరలిస్తారు. ఇలా పొలాలు సారాన్ని సంతరించుకునే ఒక అంశం బత్కమ్మ పండగలో ఇమిడి ఉంది.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
సమాచారం

కలవరపెడుతున్న కచ్చాతీవు – డా॥గోపరాజు నారాయణరావు

చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయన్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)లలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం.  భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి.
 

‘భారతదేశమంటే కేంద్ర సర్కారు సొంత జాగీరని కాంగ్రెస్ అనుకుంటున్నదా?’ ఈ సెప్టెంబర్ 2న రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యుడు వి.మైత్రేయన్ వేసిన ప్రశ్న ఇది. 1962 ముందు అక్సాయ్‌చిన్, నీఫా సరిహద్దుల గురించి పార్లమెంటు చర్చించినప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రశ్నకే నెహ్రూ సమాధానం చెప్పవలసివచ్చింది. గడ్డిపోచ కూడా మొల వని ప్రదేశం గురించి ఎందుకు బెంగ? అం టూ మహావీర్ త్యాగీని ప్రథమ ప్రధాని దబాయించారు. తరువాత చైనాతో యుద్ధం జరి గింది. ఈ కాలంలో వచ్చిన మార్పు ప్రమాదకరమైనది. గడ్డిపోచలు మొలవకపోవచ్చు. కానీ తుపాకి గిడ్డంగులు అలాంటి చోట వెలి సే ముప్పు ఉంది. అన్నా డీఎంకే సభ్యుడు వేసిన ప్రశ్న- నిర్మానుష్యంగా ఉండే దీవిలో పొంచి ఉన్న విపత్తు గురించినది. ఇప్పుడు ఆ విపత్తు గురించి తమిళ ఎంపీలూ, పార్టీలే కాదు, దేశం మొత్తం ప్రశ్నించుకోవాలి.
 
భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు జలాలలో ఉన్న కచ్చాతీవు 285 ఎకరాల చిన్న దీవి. ఈ రెండు దేశాల మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తారు. ఇందులో రామేశ్వరం (భారత్); తలైమన్నార్ (శ్రీలంక)- ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్‌ను పాక్ జలసంధి అంటారు. కచ్చాతీవు ఇందులోదే. ఈ సెక్టార్ రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్ మైళ్ల దూరంలోను, తలైమన్నార్‌కు ఆగ్నేయంగా 18 నాటికల్ మైళ్ల దూరంలోను ఉంది. ఈ దీవిలో వందేళ్ల నాటి సెయింట్ ఆంథోనీ కేథలిక్ చర్చి తప్ప జనసంచారం ఉండదు. 1974 లో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరి మావో బండారు నాయకే మధ్య, రెండేళ్ల తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు (కరుణానిధి హయాంలో) కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతోంది.
 
 కానీ 1974 నాటి ఒప్పందం ‘సగం అచ్చయిన రూపాయి నోటు’ వంటిదని వ్యాఖ్యానిస్తారు. ఎందుకం టే, ఆ అప్పగింతను పార్లమెంటు ఆమోదిం చాలి. అది జరగలేదు. తాజాగా కచ్చాతీవును భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతున్నా యి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జూన్, 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కూడా ఆమె కోరారు. ఈ అంశం మీద కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కచ్చాతీవును తిరిగి స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని పేర్కొన్నది. దీనితో తమిళ పార్టీలకూ కేంద్రానికీ మధ్య ఘర్షణ అనివార్యమైంది.
 
 కచ్చాతీవు భారత యూనియన్‌లోనిదేనని కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన ఎనిమిది దీవుల లో ఇదొకటి. అక్కడ చేపల వేటకీ, ముత్యాల వెలికితీతకీ ఆ వంశీయులే అబ్దుల్ మరికర్‌కు ఏడు వందల రూపాయలకు లీజుకు ఇచ్చారనీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి ఇటీవలే చెప్పారు. ఈ పత్రాలను కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిందని కరుణానిధి కూడా జయకు సలహా ఇచ్చారు. కచ్చాతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి విదేశాంగ మం త్రి ఎస్‌ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదనీ, అక్కడకు వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమనీ కూడా వెల్లడించారు. అదే సమయంలో భారత్ ఏ భూభాగాన్నీ ఎవరికీ అప్పగించలేదనీ, ఏ భూభాగం మీదా సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదనీ తాజాగా కేంద్రం పేర్కొనడం విశేషం. శ్రీలంక కూడా ఘర్షణ వైఖరికే మొగ్గుతోంది. 1974 ఒప్పందం చెల్లదని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదని 2010 లోనే ఆ దేశం తమిళనాడు ప్రభుత్వానికి నోటీ సు ఇచ్చింది. ఇక, ఎల్‌టీటీఈ సమస్య దరి మిలా శ్రీలంక ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుతో కచ్చాతీవులో తమిళజాలర్లు ప్రవే శం ప్రాణాంతకంగా మారిపోయింది. 1974 ఒప్పందం ప్రకారం ఇక్కడ భారతీయ జాలర్లు వేటాడవచ్చు. వలలు ఎండబెట్టుకోవచ్చు. ఈ అంశం మీదనే తమిళ పార్టీలతో పాటు బీజేపీ, సీపీఐ కూడా గళమెత్తాయి.
 
 కచ్చాతీవులో విజృంభిస్తున్న భారత వ్యతిరేక పవనాల గురించి కేంద్రం ఎందుకు కినుక వహిస్తున్నదో అర్థం కాదు. ఈ గొడవ మొదలైన తరువాత సెప్టెంబర్ 10న కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ సహాయ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ మరీ చిత్రమైన ప్రకటన చేశారు. ఢిల్లీలోని ప్రగతీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే కచ్చాతీవులో వాణి జ్య ప్రదర్శన నిర్వహించడం సాధ్యంకాగలదే మో శ్రీలంక ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెన్నైలో ప్రకటించారు.
 
 కేంద్రానికి కచ్చాతీవు లో వాస్తవ పరిస్థితులు తెలియవని తమిళ మేధావులు, ఆందోళనకారులు విమర్శిస్తున్న ది ఇందుకే. శ్రీలంక అజమాయిషీ ఆరంభమ య్యాక కచ్చాతీవును పవిత్రదీవి (చర్చి వల్ల) గా ప్రకటించింది. కానీ ఆ పుణ్యభూమిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది. చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయ న్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)ల లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం. ఏటా ఆంథోనీ చర్చిలో జరిగే 3 రోజుల ఉత్సవాలకు మన రెండు దేశాల మత గురువులు, క్రైస్తవు లు హాజరవుతారు. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి. భారత్ జాలర్లను వెంటాడి చంపుతున్న గస్తీ నౌకలలో చైనా సైనికులు కనిపిస్తున్నారు.
 
 కచ్చాతీవులో వేటాడే హక్కు తమిళ జాల ర్లకు ఉండాలని జయ కోరడం సబబే. కానీ అంతకుమించి కేంద్రం నిర్వహించాల్సిన గురుతర బాధ్యత కూడా ఉందని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. సుప్రీం నిర్ణయం తరువాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.ఇది  సాక్షి దినపత్రిక లో 18-09-2013 న ప్రచురింపబడిన వ్యాసం

Standard
సమాచారం

తెలంగాణా యాది మరవని రోజు

నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. భూస్వాముల అరాచకత్వం… నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ప్రజల ఆకాంక్షకు ఆయుధాలుగా నిలిచాయి.

నిజామనగ ఎంతరా … వాడి తహతెంతరా…
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా…….

నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ……
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)

రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు. హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు. నైజాం ప్రాంతం అనటం ఇప్పటికీ పరిపాటే.

వందల ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకుని జనాన్ని నరకయాతన పెడుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన నాటి ఉద్యమం… చివరికి సాయుధ పోరాటంగా మారింది. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని అణగదొక్కాలని నిజాము ప్రయత్నించాడు.. దీంతో సాయుద పోరాటం చిలికిచిలికి గాలివానగా మారింది. 1946లో రజాకార్లకు వ్యతిరేకంగా ఆరంభమైన నాటి ఉద్యమం… హైదరాబాద్ విమోచనమే లక్ష్యంతో ముందుకు సాగింది.రెండేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో రజాకార్ల చేతిలో నాలుగున్నర వేల మంది పోరాట యోధులు నేలకొరిగారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలూ కీలక పాత్ర పోషించారు. 1947 సెప్టెంబర్ 11 న ఈ ఉద్యమం సాయుద పోరాటంగా మారింది. భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. 1948 సెప్టెంబర్ 13 న భారత సైన్యం రంగంలోకి దిగింది. ఓ వైపు సాయుధ పోరాటం… మరో వైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో (ఆపరేషన్ పోలో) చేసేదేమీ లేక అప్పటి నిజాం ప్రభువు చేతులెత్తేశాడు. అప్పటివరకు నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతం… నాలుగంటే నాలుగు రోజుల్లోనే భారతదేశంలో విలీనం అయిపోయింది.

ఇలా హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి.

►1930: మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ జరిగింది.
►1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం. (జూలై)
►1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం (సెప్టెంబర్).
►1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాలాపన.
►1944: దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభం.
►1946: నల్గొండ జిల్లాలో నిజాం మిలటరీ దాడి ప్రారంభం.
►1947, డిసెంబరు 4: నిజాంపై నారాయణరావు పవార్ బాంబుదాడి.
►1946 ఆగష్టు 11: వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో బత్తిని మొగులయ్య గౌడ్ హత్య.
►1948 ఆగష్టు 21: పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారు.
►1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
►1948 సెప్టెంబర్ 17: నిజాం లొంగుబాటు.
……………………………………………………………………………………….
►1948 సెప్టెంబర్ 18: నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం.
……………………………………………………………………………………….

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard